Yemaipothaney Telugu Movie Releasing On July 1st - Sakshi
Sakshi News home page

Yemaipothaney Movie: జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఏమైపోతావే చిత్రం

Published Mon, Jun 20 2022 4:31 PM

Yemaipothaney Telugu Movie Releasing On July 1st - Sakshi

అమర్లతు, చాందిని పౌర్ణమి హీరో హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ఏమైపోతానే. ఇటీవల అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 1న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. సురేశ్‌ కుమార్ కుసిరెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో విజయ్  రామ్, జె. నరేష్ రెడ్డి , శివ నరిశెట్టి, సరిపల్లి సతీష్, సుజాత, మహేంద్ర నాథ్, భలే రావు, రవళి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ మూవీ ప్రమోషన్‌ల్లో దర్శకుడు, నిర్మాత సురేశ్‌ కుసిరెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రేమకథా సినిమా గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని భావిస్తున్నాను. పాటలకు ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల ప్రీమియర్ షో కి వచ్చిన రెస్పాన్స్ కూడా మర్చిపోలేనిది. ఆరోజు అందరి స్పందన నాకు ఈ సినిమాపై మంచి కాన్ఫిడెన్స్ ను పెంచింది. ఈ సినిమా లో మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమాలో నటించిన, పనిచేసిన అందరు కూడా ఎంతో బాగా సపోర్ట్ చేశారు. జులై 1న ఈ చిత్రం అందరి ముందుకు రాబోతుంది’ అన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement