Will Numerological Name Change Helps To Srikanth Son Roshann To Get Success, Deets Inside - Sakshi
Sakshi News home page

Actor Roshann: పేరు మార్చుకున్న శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌

Mar 15 2022 10:24 AM | Updated on Mar 15 2022 11:13 AM

Will Numerological Name Change Helps Srikanth Son Roshann To Get Huge Success - Sakshi

నిర్మల కాన్వెంట్‌ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు రోషన్‌. ఈ సినిమా తర్వాత ఇటీవలె పెళ్లి సందD సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో  గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయినా రోషన్‌ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కానీ సరైన హిట్‌ మాత్రం పడలేదు. దీంతో తాజాగా ఈ యంగ్‌ హీరో తన పేరులోని స్పెల్లింగ్‌ను  “Roshann” గా మార్చుకున్నాడు.

న్యూమరాలజీ ప్రకారం తన పేరుకు  అదనంగా ‘n’ని జోడించాడు. మరి ఈ లాజిక్‌ రోషన్‌ కెరీర్‌కు ప్లస్‌ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇంతకుముందు తమన్నా, సాయి ధరమ్‌ తేజ్‌ సహా పలువురు సెలబ్రిటీలు న్యూమరాలజీ ప్రకారం తమ పేరును మార్చుకొని అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement