breaking news
Pelli SandaD Movie
-
చిన్న సినిమా చేసిన పెద్ద మ్యాజిక్... ‘పెళ్ళి సందడి’
చిన్న పాత్రలతో పేరు తెచ్చుకున్న ఓ నటుడు సినిమాలో హీరో. ఆయన కథానాయకుడిగా చేస్తున్న ప్రయత్నాల్లో అక్షరాలా అది రెండో సినిమానే! ఉత్తరాది నుంచి ఒక హీరోయిన్‌కు తెలుగులో అదే తొలి సినిమా. మరో హీరోయినేమో అప్పడప్పుడే పైకొస్తున్న వర్ధమాన నటి. ఈ కాంబినేషన్లో ఓ టాప్ మోస్ట్ డైరెక్టర్ సినిమా చేస్తే? ఆ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు అగ్రతారలు ఉవ్విళ్ళూరే సమయంలో... అలాంటి చిరు ప్రయోగానికి ముగ్గురు అగ్ర నిర్మాతలు సిద్ధపడితే..? అదే... శ్రీకాంత్, దీప్తీ భట్నాగర్, రవళి తారాగణంగా దర్శకుడు కె. రాఘవేంద్రరావు రూపొందించిన ఆనాటి ‘‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డ్’’ అయిన ‘పెళ్ళి సందడి’ చిత్రం. 1996 జనవరి 12న రిలీజైన ఆ ఆల్‌టైమ్ మ్యూజికల్ హిట్‌కు 30 వసంతాలు దాటినా... జనం మర్చిపోలేదు. ‘కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా?’ అన్న అందులోని విచిత్ర సంభాషణను ప్రజల భాష నేటికీ వదులుకోలేదు. ఒక చిన్న పంతం... ఓ పెద్ద ఇండస్ట్రీ హిట్ సినిమాకు దారి తీసిందంటే నమ్ముతారా? అవును... మూడు దశాబ్దాల క్రితం తెలుగు సినీ పరిశ్రమను వసూళ్ళ వర్షంతో తడిసి ముద్ద చేసిన ‘పెళ్ళిసందడి’ (1996) అక్షరాలా అలానే పుట్టింది.మాటల యుద్ధంలో పుట్టిన కుటుంబ కథదర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అంటే... అప్పట్లో టాప్ స్టార్లతో, భారీ చిత్రాలతో బ్రహ్మాండ విజయాల సృష్టికర్త. ఆయన పేరు చెప్పగానే సాధారణంగా అందరికీ అవే గుర్తొస్తాయి. ‘టాప్ హీరోలు లేకుండా మీరు సినిమాలు తీయలేరండీ’ అని నిర్మాత అల్లు అరవింద్ ఒకరోజు ఏదో చర్చల్లో... కాస్తంత ఉడికిస్తున్నట్టుగా రాఘవేంద్రరావుతో అన్నారు. అంతే... కెరీర్ ఆరంభంలోనే ‘జ్యోతి’ (1976) లాంటి చిన్న చిత్రాలతో సాహసం చేసి, హిట్లందుకున్న దర్శకేంద్రుడికి సహజంగానే కోపం వచ్చింది. ‘మీ నిర్మాతలందరూ అగ్రహీరోల డేట్ల కోసం వెంటపడుతున్నారు కాబట్టే, ఈ పరిస్థితి. నిర్మాతలు ముందుకొస్తే చిన్న హీరోతో, మంచి కథతో సినిమా తీసేందుకు నేను రెడీ’ అన్నది రాఘవేంద్రుడి జవాబు. ‘మంచి కథ చెబితే మేమూ రెడీ’ అన్నది అరవింద్ సవాలు. ‘రెండు రోజుల్లో రండి. కథ చెబుతా’ అని దర్శకేంద్రుడు ఛాలెంజ్ స్వీకరించారు.అప్పటికే రాఘవేంద్రరావు మనసులో ఓ ఆలోచన మెదులుతోంది. అంతకు ఏడాది క్రితం రిలీజైన హిందీ చిత్రం ‘హమ్ ఆప్కే హై కౌన్’(1994) దేశమంతటినీ ఊపేసింది. కుటుంబకథా నేపథ్యంలో అలాంటి మాంచి మ్యూజికల్ లవ్‌స్టోరీని తెలుగులో తీస్తే? అంతకు ముందే ‘అల్లరి ప్రియుడు’ (1993)ను పాపులర్ పాటలతో, సిల్వర్ జూబ్లీ హిట్ చేసిన ఘనత ఆయనది. ఈసారి సినిమా ఉండాల్సింది... అంతకు మించి! అదే శ్వాస, అదే ధ్యాస!! రచయిత సత్యానంద్‌ను పిలిచారు. శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ అండ్ వైట్ కాలపు అక్కినేని ‘పెళ్ళి కానుక’ (1960 – తమిళ ‘కల్యాణ పరిసు’కు రీమేక్) ఫక్కీలో అక్కాచెల్లెళ్ళ సెంటిమెంటల్ ప్రేమకథ ఎప్పుడూ మంచి పేయింగ్ ఎలిమెంట్ అని సత్యానంద్ ప్రగాఢ నమ్మకం. అదే స్ఫూర్తితో అంతకు ముందు రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే డి. రామానాయుడు నిర్మించిన శోభన్‌బాబు ‘దేవత’ (1982) లాంటి కొన్ని చిత్రాలు వచ్చాయి. ‘దేవత’కు సత్యానందే మాటల రచయిత. అయినా, ఇంకా ఏదో అసంతృప్తి. దాన్ని తీర్చేలా... ఈసారి మరింత పక్కాగా కుటుంబ నేపథ్యం, అక్కాచెల్లెళ్ళ సెంటిమెంట్, ప్రేమ – త్యాగం నిండిన మంచి మ్యూజికల్ ముక్కోణపు ప్రేమకథ సిద్ధమైపోయింది. కథ విని, అరవింద్ ఎగిరి గంతేశారు. ఆ కథే... ఆ తరువాత తెరకెక్కిన ‘పెళ్ళి సందడి’.అగ్రశ్రేణి పంపిణీదారులే... నిర్మాతలుగా!‘పెళ్ళిసందడి’ నిర్మాణం గమ్మత్తుగా జరిగింది. దర్శకుడు రాఘవేంద్రరావు ఒకటే షరతు పెట్టారు. ‘వీలైనంత తక్కువ ఖర్చులో సినిమా తీద్దాం. తీసిన సినిమాను వేరొకరి అమ్మేయకుండా, సొంతంగా రిలీజ్ చేయాలి. లాభమైనా, నష్టమైనా భరించాలి’ అన్నారు. అరవింద్ ఓకే అన్నారు. దాని ఫలితంగా... ‘పెళ్ళిసందడి’ ఒకరికి నలుగురు నిర్మాతల సమష్టి ప్రయత్నంగా రూపొందింది. దర్శకుడు రాఘవేంద్రరావును సైతం నిర్మాణ భాగస్వామిగా చేసుకొని, మూడు ప్రముఖ పంపిణీ సంస్థలు... ‘గీతా ఫిలిమ్ డిస్ట్రిబ్యూటర్స్’ (అల్లు అరవింద్), ‘వైజయంతీ ఎంటర్ప్రైజెస్’ (సి. అశ్వినీదత్), ‘లక్ష్మీ ఫిలిమ్స్’ (కె. జగదీశ్ ప్రసాద్) కలసి ‘శ్రీరాఘవేంద్ర మూవీ కార్పొరేషన్’ అనే కొత్త బ్యానర్‌పై నిర్మించారు. అసలు అల్లు అరవింద్, అశ్వినీదత్‌లు అప్పటికి పూర్తిగా క్రేజీ ప్రాజెక్టులే నిర్మిస్తున్నారు. జగదీశ్‌ప్రసాద్ యాజమాన్యంలో పంపిణీ సంస్థగా పేరున్న లక్ష్మీ ఫిలిమ్స్ అయితే అంతకు ముందు రాఘవేంద్రరావు – హీరో కృష్ణల కాంబినేషన్లో ‘వజ్రాయుధం’ (1985), దర్శకుడు కోదండరామిరెడ్డి – హీరో చిరంజీవితో ‘కిరాతకుడు’ (1986) లాంటి భారీ చిత్రాలే నిర్మించింది. అలాంటి ఆ ముగ్గురు బడా నిర్మాతలూ కలసి ‘పెళ్ళి సందడి’ లాంటి చిన్న ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం విచిత్రమే!నిజానికి, అంతకు అయిదేళ్ళ ముందు దర్శకుడు దాసరి నారాయణరావు ఇలాంటి చిరు ప్రయత్నమే చేశారు. అగ్ర నిర్మాతలు కె. దేవీవరప్రసాద్, టి. త్రివిక్రమరావు, అశ్వినీదత్‌లు ముగ్గురి సమష్టి నిర్మాణంలో, శారద ప్రధాన పాత్రధారిణిగా ‘అమ్మ రాజీనామా’ (1991 డిసెంబర్ 27) అనే చిన్న బడ్జెట్ లేడీ ఓరియంటెడ్ కుటుంబ కథాచిత్రాన్ని రూపొందించి, వార్తల్లో నిలిచారు. జీవితాంతం కుటుంబం కోసం కష్టపడే తల్లి... తన విలువను గుర్తించని ఆ కుటుంబసభ్యులతో వేసారి, తన బాధ్యతలు మానేస్తే ఏమవుతుందన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న ఆ చిన్న సినిమా అప్పట్లో మధ్యతరగతి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మళ్ళీ ఆ తరహాలో పెద్ద నిర్మాతలు చేసిన చిన్న బడ్జెట్ ప్రయత్నం... ఈ ‘పెళ్ళి సందడి’.లక్షలు ఖర్చు పెడితే... కోట్లు వచ్చాయ్!కేవలం కోటి రూపాయల పరిమిత బడ్జెట్లో తీయాలని టార్గెట్. రాఘవేంద్రరావు పారితోషికంగా రూ. 15 లక్షలు కూడా అందులోనే లెక్క. అయితే, అన్ని విధాలా సంతృప్తికరంగా సినిమాను పూర్తి చేసేసరికి అనుకున్నదాని కన్నా రూ. 5 లక్షలు ఎక్కువైంది. ఆ పెరిగిన కొద్దిపాటి వ్యయాన్ని తన పారితోషికపు మొత్తం నుంచి రాఘవేంద్రరావే భరించారు. మరో గమ్మత్తు జరిగింది. సెన్సార్ నిబంధనల ప్రకారం ఫీచర్ ఫిల్మ్ అంటే 11 వేల అడుగుల పైనే నిడివి ఉండాలి. ‘పెళ్ళి సందడి’ చిత్రీకరణ అంతా పూర్తయ్యాక సెన్సార్‌కు ముందు చూసుకుంటే, నిబంధనల కన్నా తక్కువ నిడివి ఉంది. దాంతో, రాఘవేంద్రరావు బృందం తెలివిగా అప్పటికప్పుడు వినోదాత్మకమైన కోడిపుంజు ఎపిసోడ్ సృష్టించి, నటులు ఏవీఎస్, శ్రీలక్ష్మి, బ్రహ్మానందం తదితరులపై చిత్రీకరించి, ఇంటర్వెల్ తర్వాత జత చేశారు.ముందుగా అనుకున్నట్టే... సినిమాను అమ్ముకోకుండా, సొంతంగానే రిలీజ్ చేశారు. ఆంధ్రా, నైజామ్ లాంటి మిగతా ప్రధాన ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకుంటూ, సీడెడ్ ఏరియాలో మాత్రం నిర్మాత – పంపిణీదారు వి. దొరస్వామిరాజు సంస్థ ‘వి.ఎం.సి’ ద్వారా విడుదల చేశారు. అలా నలుగురు నిర్మాతలుగా కలసి, సరదాగా చేసిన ఈ ప్రయోగాత్మక ప్రయత్నం గురించి మొదట్లో ఎవరికీ ఏమంత అంచనాలు లేవు. సినిమా రిలీజ్ కన్నా ముందే ఆడియో సూపర్‌హిట్‌తో సంచలనం మొదలైంది. చివరకు ఆ ఏటి సంక్రాంతి చిత్రాలన్నిటిలోకీ మేటిగా... ‘పెళ్ళి సందడి’ నిలిచింది. కోటి రూపాయల్లో తీసిన చిన్న సినిమా కనివిని ఎరుగని రీతిలో రూ. 14 – 15 కోట్ల షేర్ వసూలు చేసింది. కమిషన్లు పోగా, దాదాపు రూ. 10 కోట్ల లాభం వచ్చింది. వెరసి, కలెక్షన్లలో అప్పటికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.వసూళ్ళలో అసలు సిసలు ‘ఇండస్ట్రీ రికార్డ్’ చిత్రాలు ఇవీ..!‘పెళ్ళి సందడి’ లాంటి ఒక చిన్న సినిమా అలా వసూళ్ళలో ‘ఇండస్ట్రీ రికార్డ్’ నెలకొల్పడం అదే ప్రప్రథమం. అంతకు మునుపటి ఇండస్ట్రీ రికార్డ్ సినిమాలన్నీ దాదాపు పెద్ద హీరోలు, పేరున్న హీరోయిన్లతో రూపొందినవే! బాక్సాఫీస్ చరిత్ర పూర్వాపరాలు గమనిస్తే... ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, 1984లో తెలుగునాట సినిమా టికెట్లపై వినోదపు పన్నులో మార్పులు తెచ్చి, అమ్ముడైన టికెట్లతో సంబంధం లేకుండా థియేటర్లోని సీటింగ్ కెపాసిటీ మొత్తానికీ పన్ను విధించే ‘శ్లాబ్ సిస్టమ్’ను ప్రవేశపెట్టారు. ఫలితంగా 1984 నాటి నాన్ ఏసీ థియేటర్లలో బాల్కనీ టికెట్ రేటు రూ. 2.60 నుంచి అమాంతం రూ. 4.50కి ఎగబాకింది. అలా పెరిగిన టికెట్ రేట్ల పుణ్యమా అని ఆ వెంటనే కృష్ణంరాజు ‘బొబ్బిలి బ్రహ్మన్న’ (1984 మే 25 రిలీజ్) కళ్ళు తిరిగే కలెక్షన్లు రాబట్టింది. వసూళ్ళలో ఆనాటి ‘ఇండస్ట్రీ రికార్డ్ సినిమా‘ అయింది. ఆ వెనువెంటనే, ఎన్టీఆర్ ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ (1984 నవంబర్ 29) కనివిని ఎరుగని ప్రేక్షకాదరణతో దిమ్మతిరిగేలా కలెక్షన్లు కొల్లగొట్టింది. అలా ఆ చిత్రం కొత్త ‘ఇండస్ట్రీ రికార్డ్’ అయింది. ఆ తర్వాత విజయశాంతి ‘ప్రతిఘటన’ (1985) దాన్ని దాటి, ఆ స్థానాన్ని అందుకుంది. అటు తర్వాత వెంకటేశ్ ‘చంటి’ (1992), దాన్ని దాటి ‘పెదరాయుడు’ (1995), దాన్ని కూడా అధిగమించి అటుపైన ‘పెళ్ళి సందడి’ (1996) తిరుగులేని బాక్సాఫీస్ ఇండస్ట్రీ రికార్డయ్యాయి.‘పెళ్ళి సందడి’ ఇండస్ట్రీ రికార్డ్‌ను విజయశాంతి ‘ఒసేయ్ రాములమ్మా’ (1997), ఆ తర్వాత బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ (1999), ఆ తర్వాత ‘నరసింహ నాయుడు’ (2001)... వరుసగా ఒకదానినొకటి వసూళ్ళలో అధిగమిస్తూ పోయాయి. ఇక, కొత్త మిలీనియమ్‌లోకి వచ్చాక వరుసగా చిరంజీవి ‘ఇంద్ర’ (2002), మహేశ్ బాబు ‘పోకిరి’ (2006), అటుపైన రామ్‌చరణ్ ‘మగధీర’ (2009 జూలై 31), ఆ తర్వాత త్రివిక్రమ్ – పవన్ కల్యాణ్‌ల ‘అత్తారింటికి దారేది’ (2013 సెప్టెంబర్ 27) వసూళ్ళలో మునుపటి చిత్రాన్ని దాటి, కలెక్షన్లలో ఇండస్ట్రీ రికార్డులయ్యాయి. ఆ తర్వాత రాజమౌళి ‘బాహుబలి–1’ (2015 జూలై 10), అటుపైన ‘బాహుబలి–2’ (2017) చిత్రాలు ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డులయ్యాయి. విచిత్రంగా ఆ తర్వాత దాన్ని అధిగమించిన సినిమా ఏదీ రాలేదు. అలా ఇప్పటికి దాదాపు తొమ్మిదేళ్ళుగా తెలుగు సినిమాకు ఇండస్ట్రీ రికార్డ్ అక్కడే స్తంభించి పోయి ఉండడం గమనార్హం. అచ్చమైన తెలుగింటి అక్కాచెల్లెళ్ళ పెళ్ళికళ‘పెళ్ళి సందడి’ పూర్తి సంగీతాత్మక, వినోదభరిత, సకుటుంబ చిత్రం. బొడ్డు పక్కన అందమైన పుట్టుమచ్చ, ఆ పక్కనే దోపుకున్న వెండి తాళాల గుత్తితో ఉన్న ఓ స్వప్నసుందరిని హీరో (శ్రీకాంత్) ప్రేమిస్తుంటాడు. ఊరు, పేరు, ముక్కూ ముఖం తెలియని ఆ అమ్మాయిని కలల్లో ప్రేమిస్తున్నా... అనుకోకుండా మరో అమ్మాయి (రవళి)తో పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది. తీరా తన స్వప్నసుందరి (దీప్తీ భట్నాగర్) నిజజీవితంలో ఎదురయ్యేసరికి, ఆమెతో ప్రేమముడి వేసుకొని, ఖరారైన పెళ్ళిని కాదనే దాకా వస్తాడు. అక్కను చేసుకోవాల్సిన వాడే తనను గాఢంగా ప్రేమిస్తున్న ప్రియుడని తెలిశాక ఆ స్వప్న సుందరి త్యాగానికి సిద్ధపడుతుంది. అక్క కోసం చెల్లెలు... చెల్లెలి కోసం అక్క... త్యాగాల పరిణామం మిగతా కథ. అక్క కల్యాణి పాత్రలో రవళి, చెల్లెలు స్వప్న పాత్రలో దీప్తీ భట్నాగర్ నటించిన ఈ సినిమా నిండా కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులే. గోదావరి జిల్లా తాలూకు గౌరవాలు, పెళ్ళి వారింటి సరదాలు, సరసాలు, మర్యాదలు, కుటుంబ ఆప్యాయతలతో ప్రతి సీనూ అచ్చమైన వివాహ భోజనమే! సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్ కెమెరా పనితనంలో పశ్చిమ గోదావరి జిల్లా అల్లంపురం, కోసూరి నగర్, తొర్రేడు, తణుకు తదితర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఆ సీన్లు, వాటికి ప్రాణం పోసిన నటీనటుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!సంక్రాంతి రేసులో... ఊహించని సూపర్విన్నర్!ఆ ఏడాది సంక్రాంతికి వచ్చిన చిత్రాల్లో బాలకృష్ణ ‘వంశానికొక్కడు’ (1996 జనవరి 5) మంచి హిట్టయితే, అదే రోజున మలయాళ హిట్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన నాగార్జున ‘వజ్రం’ బొత్తిగా సానబెట్టని రాయిగా మిగిలిపోయింది. అప్పట్లో వరుస విజయాలతో దూకుడు మీదున్న దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి జోరుకు ‘వజ్రం’ ఠక్కున బ్రేకులు వేసింది. ఇక, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే హీరో కృష్ణ ‘సంప్రదాయం’ (జనవరి 11), సురేశ్ కృష్ణ నిర్దేశకత్వంలో సొంత సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకటేశ్ ‘ధర్మచక్రం’ (జనవరి 13) కూడా ఆ ఏటి సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో కోడిపుంజులే. ఇక, అంతకు ముందు ఏడాదే ‘పెదరాయుడు’తో కలెక్షన్లలో ఇండస్ట్రీ రికార్డ్ హిట్ సాధించిన మోహన్‌బాబు కాస్త ఆలస్యంగా ఆ సంక్రాంతి రేసులోకి వచ్చారు. పండగ వెళుతూనే 1996 జనవరి 20న ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో, రమ్యకృష్ణ జోడీగా ‘సోగ్గాడి పెళ్ళాం’తో పలకరించారు. కానీ, ఆ పోటాపోటీ సంక్రాంతి సినిమాల బరిలో అనూహ్యంగా అన్నింటినీ ఓడించి పందెం గెలిచింది మాత్రం ‘పెళ్ళి సందడే’!మనసును తాకిన సంగీతం... మెప్పించిన సాహిత్యం ‘పెళ్ళి సందడి’లో ఏ పాటకు ఆ పాటే గొప్ప. అన్నీ కథకు నప్పినవే... జనం మెచ్చినవే! ప్రేమను నిర్వచిస్తూ, పతాక సన్నివేశ గీతంగా వచ్చే ‘హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం... ప్రేమ ప్రేమ ప్రేమ...’ అన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన సినిమా క్లైమాక్స్‌కు ఆయువుపట్టయింది. ఇక, సిరివెన్నెలే రాసిన మరో గీతం ‘సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి...’ ఆల్‌టైమ్ హిట్. అలాగే, అక్కాచెల్లెళ్ళు ప్రియుణ్ణి గురించి చెప్పుకొంటున్నట్టు సామవేదం షణ్ముఖశర్మ రచించగా, చిత్ర పాడిన ‘నవ మన్మథుడా అతి సుందరుడా... నిను వలచిన ఆ ఘనుడు...’ పాట ఆడపిల్లల నోట మారుమోగింది.ఇక, ‘నీ ఊహల్లోని స్వప్న సుందరి ఎలా ఉంటుం’దంటూ హీరోను అతని బావలు ప్రశ్నించే సందర్భంలో ముందుగా పాట అనుకోలేదు. హీరో నోట నాలుగైదు డైలాగులతో సరిపెడదామని భావించారు. కానీ, చివరి క్షణంలో మనసు మార్చుకొని, జొన్నవిత్తులతో పాట రాయించారు. అదే... పాపులర్ సినిమా హీరోయిన్ల పేర్లతో జనరంజకమైన హాస్యరసస్ఫోరక గీతం – ‘రమ్యకృష్ణ లాగ ఉంటదా... రంభ లాగ రంజుగుంటందా... అరె చెప్పర కన్నా...’ ఇవి కాక ‘మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగె...’, ‘చెమ్మచెక్క చెమ్మచెక్క చేరడేసి మొగ్గ...’, అలాగే స్వర – పద సంయోజనంగా సాగే ‘కిల కిల కిల కిల కిల... పడుచు కోకిల – పలికె ప్రియగీతిక పెళ్ళికిలా...’ వేటూరి మాత్రమే చేయగల పదాల గారడీలు.వర్ధమాన చంద్రబోస్‌కు విలువైన ఛాన్స్ఇవాళ సుప్రసిద్ధ సినీ గీత రచయిత అయిన చంద్రబోస్‌కు ‘పెళ్ళి సందడి’ ఓ కెరీర్ టర్నింగ్ పాయింట్. అప్పటికి ఆయన అప్పుడప్పుడే సినిమాల్లో నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. శ్రీకాంతే హీరోగా నటించిన ‘తాజ్‌మహల్’లో, అలాగే వెంకటేశ్ ‘ధర్మచక్రం’లో... ఇలా ఒకట్రెండు సినిమాలకే పాటలు రాశారు. ఆయనను పిలిచి, రాఘవేంద్రరావు అవకాశమిచ్చారు. అలా అప్పట్లో తిరుపతిలో మ్యూజికల్ సిట్టింగ్స్‌కు పిలిస్తే వెళ్ళిన చంద్రబోస్ ‘పెళ్ళి సందడి’కి ‘సరిగమ పదనిస రాగం – త్వరపడుతున్నది మాఘం...’, అలాగే ‘అయినా చిక్కలేదు చిన్నదాని ఆచూకీ – చెప్పరాని ఆశలన్ని హుష్‌కాకి...’ పాటలు రాశారు. అప్పుడు అలా కీరవాణి, రాఘవేంద్రరావులతో పరిచయం జరిగి, అప్పటికప్పుడు కీరవాణి మాటతో అటునుంచి అటే వారితో కలసి మద్రాసు వెళ్ళిన చంద్రబోస్ ఇక కెరీర్లో వెనక్కి తిరిగిచూసుకోలేదు. ‘పెళ్ళి సందడి’ మ్యూజికల్ హిట్‌తో రాఘవేంద్రరావు, కీరవాణి బృందంలో ఆయనా ఒకరయ్యారు. సినీ రంగంలో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. నాడు కేవలం రూ. 8 వేల పారితోషికం అందుకున్న ఆ వరంగల్ కుర్రాడు ఇవాళ అక్షర లక్షలు గడిస్తూ, ‘ఆస్కార్’ విజేతగా ఎదగడం అసాధారణ విజయం. మ్యూజికల్ మాయాజాలంఅప్పట్లో ఊరూవాడా ఎక్కడ విన్నా... ‘పెళ్ళి సందడి’ పాటలే! మ్యూజికల్ లవ్‌స్టోరీగా తీర్చిదిద్దిన ఈ ఫిల్మ్‌లో మొత్తం 9 పాటలు. ఫస్టాఫ్‌లో 6 పాటలు, సెకండాఫ్‌లో 3 పాటలు. సంగీత దర్శకుడు కీరవాణి అప్పటికే మంచి రేజ్‌లో ఉన్నారు. కీరవాణి – రాఘవేంద్రరావుల కాంబినేషన్ క్రేజు మీదుంది. అంతకు కొన్నేళ్ళ ముందే వారి కలయికలోనే వచ్చిన ‘అల్లరి ప్రియుడు’ (1993 మార్చి 5) సూపర్‌హిట్. ఆ పాటలు ఊరూరా మారుమోగాయి. ఆ నేపథ్యంలో వారిద్దరి కాంబినేషన్లోనే సిద్ధమైంది ‘పెళ్ళి సందడి’. ఆ సినిమా రిలీజుకు ముందే పాటలన్నీ సూపర్ డూపర్ హిట్.‘లహరి’ సంస్థ రిలీజ్ చేసిన ఆడియోకు పిచ్చ క్రేజొచ్చింది. ఎంతగా అంటే... అప్పట్లోనే ‘పెళ్ళి సందడి’ ఏకంగా 3 లక్షల క్యాసెట్లు అమ్ముడుపోయాయి. అలా ఆ చిత్ర ఆడియో ‘ప్లాటినమ్ డిస్క్’ సాధించింది. దాంతో దర్శక, నిర్మాతలు మద్రాస్‌లోని ‘చోళా హోటల్’లో దాసరి, కె. విశ్వనాథ్, దేవీవరప్రసాద్, ఏడిద నాగేశ్వరరావు లాంటి సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖ దర్శక, నిర్మాతల సమక్షంలో ప్రత్యేకంగా ప్లాటినమ్ డిస్క్ వేడుకలు నిర్వహించారు. క్యాసెట్లకున్న క్రేజ్‌ను చూశాక, ఇక తెరపై పాటల చిత్రీకరణ కూడా తోడయ్యాక సినిమా పెద్ద మ్యూజికల్ హిట్టవడం ఖాయమని దర్శక, నిర్మాతలు ముందుగానే అభిప్రాయపడ్డారు. అక్షరాలా అదే నిజమైంది. పాటలు బంపర్ హిట్. సినిమా సూపర్‌హిట్. బాక్సాఫీస్ కలెక్షన్లలో సినిమా ఇండస్ట్రీ హిట్.నృత్య దర్శకుడిగా... రాఘవేంద్రరావుకు ‘నంది’!సౌందర్య పిపాసిగా పూలు, పండ్లు, గ్లామర్ దుస్తులతో తన ప్రతి సినిమాలో పాటల చిత్రీకరణలో ప్రత్యేకత చాటుకోవడం దర్శకుడు కె. రాఘవేంద్రరావు మార్కు శైలి. అలాంటిది... ఈ ‘పెళ్ళి సందడి’లో పాటలన్నిటికీ ఆయనే స్వయంగా నృత్యదర్శకత్వం కూడా వహించడం విశేషం. వేరే డ్యాన్స్ మాస్టర్ ఎవరూ లేకుండా అలా ఆయనే పాటలు తీసి, ఏకంగా ప్రేక్షకులందరితో డ్యాన్స్ చేయించారు. అంతకన్నా విశేషం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమిచ్చే ప్రతిష్ఠాత్మక నంది అవార్డుల్లో ఆ ఏడాది బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు ఆయనకే దక్కింది. ‘పెళ్ళి సందడి’ పాటలు వినడానికే కాదు... చూడడానికీ అంతే బాగుంటాయనడానికి అదో నిదర్శనం. ‘పెళ్ళి సందడి’ బాణీల్లో తన స్వర విశ్వరూపం చూపిన కీరవాణే ఆ ఏడాది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటూ ‘నంది’ పురస్కారం నిర్ద్వంద్వంగా వరించింది.ఈ సినిమా కోసం ఊటీ, బెంగుళూరు, శివసముద్రం తదితర అందమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించారు. ఓ పాట కోసం రాఘవేంద్రరావు దాదాపు 40 రోజుల పాటు రోజూ షూటింగ్ జరిగే ప్రతి అందమైన లొకేషన్లో షాట్లు తీసుకుంటూ, చివరకు దాన్ని అందంగా కూర్చి, అబ్బురపరిచారు. రాఘవేంద్రరావు కెరీర్‌పై ఈ సినిమా, ఈ పాటలు ఎంత ప్రభావం చూపాయంటే... తరువాత 2010 దశకంలో రాఘవేంద్రరావు తొలిసారిగా పెదవి విప్పి, కెమెరా ముందు తన సినీజీవితానుభవాలను సహచరులతో కలసి పంచుకుంటున్నప్పుడు ఆ టీవీ షోకు కూడా ‘పెళ్ళి సందడి’లోని హిట్ పాట ప్రేరణతో ‘సౌందర్యలహరి’ అనే పేరే పెట్టారు. ఆ హిట్ పాట ట్యూన్‌నే తమ కార్యక్రమానికి థీమ్ మ్యూజిక్‌గా ఎంచుకున్నారు.ఊరూరా... విజయయాత్ర‘పెళ్ళి సందడి’కి ముందు ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల రోజుల నుంచే సినీ వాణిజ్య రాజధాని విజయవాడలో కొత్త సినిమాల యూనిట్‌కు అభినందన సభలు, పాత్రికేయులతో ఇష్టాగోష్ఠి సమావేశాలు జరపడం ఆనవాయితీగా ఉండేది. పత్రికలన్నీ ప్రధానంగా విజయవాడలో కేంద్రీకృతమై, పంపిణీదారులు ప్రధాన పాత్ర పోషించే ఆ రోజుల్లో అదొక మంచి పబ్లిసిటీ మార్గంగా కూడా ఉపకరించేది. అలాగే, 1950లు – 1970ల మధ్యలో అక్కినేని ‘రోజులు మారాయి’ లాంటి సినిమాల మొదలు పలు సినీ విజయయాత్రలు జరిగేవి. క్రమంగా అవి తగ్గుముఖం పట్టాయి. పాతికేళ్ళ తర్వాత మళ్ళీ ‘పెళ్ళి సందడి’ ఆ ట్రెండ్‌ను పునరుద్ధరించింది. సక్సెస్ టూర్ల పేరిట చిత్ర ప్రధాన తారాగణం, దర్శక – నిర్మాతలు ప్రధాన కేంద్రాల్లో థియేటర్లను సందర్శిస్తూ, నేరుగా ప్రేక్షకులను కలుసుకొనే సంప్రదాయం నెలకొంది. అలా 1996 ఏప్రిల్‌లో ‘పెళ్ళి సందడి’ యూనిట్ గూడూరు, నెల్లూరు సహా అనేక కేంద్రాల్లో పర్యటించి, సక్సెస్ టూర్లను మళ్ళీ పాపులర్ చేసింది. అప్పటి నుంచి మూడు దశాబ్దాల తర్వాత తాజా 2026 సంక్రాంతికి సైతం పలు చిత్రాల యూనిట్లు తెలుగు నేలపైనే కాక, అమెరికా గడ్డ మీదా విజయయాత్రలు చేసి, ప్రేక్షకులతో మమేకమయ్యే మార్కెటింగ్ వైఖరిని అవలంబించడం విశేషం. ఆ రకంగా 1990ల నుంచి ఆ ట్రెండ్‌ను మళ్ళీ సెట్ చేసింది ‘పెళ్ళి సందడే’!తొలిసారిగా అమెరికాలోనూ సినీ ప్రదర్శనలు!ఇవాళంటే, మన సినిమాలు ఓవర్సీస్లో ప్రదర్శితం కావడం, ఇండియాలో రిలీజయ్యే టైమ్‌కే అక్కడా రిలీజ్ కావడం లాంటివి సర్వసాధారణమైపోయాయి. కానీ, ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది కాదు. 1996 నాటికి ఓవర్సీస్ రిలీజ్ అనే మాట తెలుగు సినిమాకు కొత్త. అలాంటి సమయంలో... అమెరికాలో తొలిసారిగా ఎగ్జిబిషన్ షోలు ప్రదర్శితమైంది కూడా ‘పెళ్ళి సందడే’! అప్పట్లో గుంటూరుకు చెందిన ‘పద్మావతీ’ సుబ్బారావు అమెరికాలో ఈ ‘పెళ్ళి సందడి’ ప్రదర్శనలు జరిపారు.సినిమాను అక్కడ ప్రదర్శించడానికని నిర్మాత అల్లు అరవింద్‌ను అభ్యర్థించి, సినిమా ప్రింట్లు తీసుకున్నారు. ఆ ప్రింట్లు తీసుకువెళ్ళి, అమెరికాలో శుభ్రంగా ప్రత్యేక రుసుము వసూలు చేసి మరీ, ‘పెళ్ళి సందడి’ ఎగ్జిబిషన్ షోలు వేయడం విశేషం. అలా ‘పెళ్ళి సందడి’ బాగానే వసూళ్ళు సాధించింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో, ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే నాగార్జున హీరోగా వచ్చిన ‘అన్నమయ్య’ (1997) తొలిసారిగా కొంత పెద్దస్థాయిలో కమర్షియల్‌గా థియేటర్లలో ప్రదర్శితమైంది. అదిగో... అలా తెలుగు సినిమా ఓవర్సీస్ రిలీజులకూ ఒక రకంగా రాఘవేంద్రరావు సినిమాలే శ్రీకారం చుట్టాయన్న మాట!సరికొత్త ‘ఇండస్ట్రీ రికార్డ్’ల సందడి...అప్పట్లో ఊరూరా... థియేటర్లలో ‘పెళ్ళి సందడే’! కోటి రూపాయల బడ్జెట్లో తీసిన సినిమా అందుకు అనేక రెట్లు సంపాదించడమే గొప్ప అనుకుంటే, కేవలం కలెక్షన్లలోనే కాదు రన్‌లోనూ ఆ సినిమా ఓ ఊపు ఊపేసింది. ఫస్ట్ బ్యాచ్‌లో 40 ప్రింట్లతో రిలీజ్ చేస్తే... ఏకంగా 34 కేంద్రాల్లో వంద రోజులాడింది. లేట్‌గా రిలీజైన మరో 10 కేంద్రాల్లోనూ శతదినోత్సవం జరుపుకొంది. ఇంకా విశేషమేమంటే, అంతకు ముందు అప్పటి పెద్ద హీరోల్లో ఒకరైన మోహన్‌బాబు ‘పెదరాయుడు’ చిత్రం 7 సెంటర్లలో సిల్వర్ జూబ్లీతో ఇండస్ట్రీ రికార్డ్. కానీ, ఏ పెద్ద హీరో లేని సోకాల్డ్ స్మాల్ ఫిల్మ్ ‘పెళ్ళి సందడి’... అంతకు మునుపెన్నడూ ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని రీతిలో 27 కేంద్రాల్లో నేరుగా సిల్వర్ జూబ్లీ (175 రోజులు) జరుపుకొంది. కొత్త ‘ఇండస్ట్రీ రికార్డ్’ సృష్టించింది. అంతేకాదు... 28వ కేంద్రంగా షిఫ్టులతో నెల్లూరులోనూ ‘పెళ్ళి సందడి’ పాతిక వారాల పండగ చేసుకుంది. (ఆ తర్వాత రోజుల్లో బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ 30 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, ఒక కేంద్రంలో షిఫ్టులతో... మొత్తం 31 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ చేసుకొని, ఆ రికార్డ్‌ను తిరగరాసింది. సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్‌ను నెలకొల్పింది).ఒక్క సిల్వర్‌జూబ్లీ కేంద్రాల సంఖ్యలోనే కాదు... ద్విశత దినోత్సవ సెంటర్ల సంఖ్యలోనూ అప్పట్లో ‘పెళ్ళి సందడి’ సరికొత్త ఇండస్ట్రీ రికార్డే. మొత్తం 15 కేంద్రాల్లో ఆ చిత్రం 200 రోజులు విజయవంతంగా ప్రదర్శితమవడం ఆనాటికి తెలుగు సినీసీమ కనివిని ఎరుగని విషయం. (ఆ తర్వాత రోజుల్లో తరుణ్ నటించిన ‘నువ్వే కావాలి’ చిత్రం 18 సెంటర్లలో ఆ ఫీట్ సాధించి, పాత ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది). (pelli sandadi movie @30 years)డైలీ ‘హౌస్‌ఫుల్’ సందడి! సంవత్సర కాలం గారడీ!! ఒక్క విజయవాడ కేంద్రమే తీసుకుంటే... ప్రేక్షకులపై ‘పెళ్ళి సందడి’ చేసిన మాయాజాలం అంతా ఇంతా కాదు. విజయవాడలోని ‘స్వర్ణా ప్యాలెస్’లో ఆ సినిమా 301 రోజులు ఆడింది. రోజుకు 4 ఆటల చొప్పున అలా ఒక సింగిల్ స్క్రీన్‌లో 1200 ఆటలకు పైగా ఒక చిత్రాన్ని ప్రదర్శించడం కోస్తా ఆంధ్రలో అప్పటికీ, ఇప్పటికీ హయ్యస్ట్ రికార్డ్. చెప్పుకోవాల్సినదేమిటంటే... విజయవాడ ‘స్వర్ణ ప్యాలెస్’లో ‘పెళ్ళి సందడి’ ప్రదర్శితమైన ఆ 301 రోజుల్లోనూ... రోజుకు 4 ఆటల వంతున 200 రోజులూ థియేటర్ హౌస్‌ఫుల్లే! అలాగే, గుంటూరులోని బాలభాస్కర్ థియేటర్లోనూ డైలీ 4 షోస్ చొప్పున 150 రోజుల పాటు ప్రతిరోజూ థియేటర్ బయట హాలు నిండినది బోర్డే!! విజయవాడలో భారీయెత్తున బహిరంగంగా సినిమా సిల్వర్‌జూబ్లీ ఫంక్షన్ చేస్తే, ప్రముఖ హీరో చిరంజీవి దానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, యూనిట్‌ను అభినందించారు. తర్వాత అదే విజయవాడ, హైదరాబాద్‌లలో ‘పెళ్ళి సందడి’ చిత్రం షిఫ్టులతో 365 రోజుల పాటు ఆడింది. అలా సంవత్సరం రన్‌తో ‘గోల్డెన్ జూబ్లీ’ చేసుకుంది.రెండు దశాబ్దాలు... రెండు సినిమాలు... రాఘవేంద్రజాలంహైదరాబాద్ కేంద్రమే తీసుకుంటే, సంధ్య 35 ఎం.ఎం. థియేటర్లో ‘పెళ్ళి సందడి’ 233 రోజులు ఆడి, కనివిని ఎరుగని రీతిలో కోటి రూపాయల గ్రాస్ సాధించింది. ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక తెలుగు సినిమా కోటి రూపాయల మొత్తం వసూలు చేయడం చరిత్రలో అదే తొలిసారి. తెలుగు సినీచరిత్ర పరికిస్తే... సింగిల్ స్క్రీన్ థియేటర్లో తొలిసారిగా రూ. 10 లక్షల గ్రాస్ సాధించిన చిత్రం... హైదరాబాద్‌లోని ‘వెంకటేశ థియేటర్’లో ఎన్టీఆర్ ‘అడవిరాముడు’ (1977). దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ‘పెళ్ళి సందడి’ (1996)తో ఓ తెలుగు సినిమా తొలిసారిగా కోటి రూపాయల గ్రాస్ వసూళ్ళు సాధించిన ఘనత దక్కించుకుంది. రెండు దశాబ్దాల వ్యవధిలో తెలుగు సినిమా బాక్సాఫీస్‌కు అలాంటి కీర్తి కిరీటం కట్టబెట్టిన ఆ రెండు సినిమాలూ... మెగాఫోన్ మెజీషియన్ కె. రాఘవేంద్రరావు అందించినవే! అదీ దర్శకేంద్రుడి కమర్షియల్ స్టామినా! (మల్టీప్లెక్సులు వచ్చాక, హైదరాబాద్ ‘ప్రసాద్– ఐమ్యాక్స్’లో హాలీవుడ్ చిత్రం ‘అవతార్–పార్ట్1’ (2009 డిసెంబర్ 18న ఇండియా రిలీజ్) ఏకంగా ఏడాది పాటు ఆడి, దాదాపు రూ. 6 కోట్ల గ్రాస్ సాధించి, బాక్సాఫీస్ రికార్డులకెక్కింది). ఎందరికో... కెరీర్లో కొత్త మలుపు‘పెళ్ళి సందడి’ ఎంతో మంది కెరీర్లను మార్చేసింది. అంతకు ముందు అనేక చిన్న పాత్రలు, ప్రతినాయక ఛాయలున్న పాత్రలు కూడా చేసిన శ్రీకాంత్‌కు హీరోగా అది రెండో సినిమా. హీరోగా తొలి చిత్రం ‘తాజ్‌మహల్’ విజయవంతమైనా, కథానాయక పాత్రలతో ప్రమోషన్ కోసం తండ్లాటలో ఉన్న శ్రీకాంత్ ‘పెళ్ళి సందడి’తో ఒక్కసారిగా హీరోగా స్థిరపడ్డారు. అలా చిన్న నిర్మాతలకు అందుబాటులో ఉండే మరో మంచి హీరో ఇండస్ట్రీకి దొరికారు. ఈ సినిమాలో చెల్లెలు పాత్ర ధరించిన దీప్తీ భట్నాగర్‌కు తెలుగులో ఇదే మొదటి సినిమా. ఆమె అందరినీ ఆకర్షించారు. ఇక, అక్క పాత్రకు ముందుగా అనుకున్నది హీరోయిన్ రవళిని కాదు... సంఘవిని! ఆమెకు డేట్లు కుదరకపోవడంతో ఆ అదృష్టం రవళిని వరించింది. అటుపైన రవళికి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వెంకటేశ్ సరసన ‘చిన్నబ్బాయి’ (1997 జనవరి 10) సహా ఎన్నో ఊహించని ఆఫర్లు వెల్లువెత్తాయి. అలాగే, ఈ సినిమాతో గీత రచయితగా చంద్రబోస్ పరిశ్రమలో నిలబడ్డారు.అప్పటికే జోరు మీదున్న రాఘవేంద్రరావు – కీరవాణి జోడీ అప్పటి నుంచి విడదీయరానిదైంది. సాక్షాత్తూ రాఘవేంద్రరావు కెరీర్ సైతం మారిపోయింది. ‘పెళ్ళి సందడి’ లాంటి అందమైన ప్రేమకథతో సెల్యులాయిడ్‌పై శృంగారాన్ని బంగారంగా పండించిన దర్శకేంద్రుడి ప్రస్థానం ఆ వెంటనే అదే 1996లో మరో కొత్త మలుపు తిరిగింది. నాగార్జునతో ‘అన్నమయ్య’ చిత్రీకరణ మొదలైంది. అలా సెల్యులాయిడ్ కామి కాస్తా మోక్షగామి అయి, రక్తిరస లాహిరి నుంచి భక్తిరస భావన వైపు మళ్ళి, ఆ జానర్లో తనదైన ముద్ర వేయడం మరో అసాధారణ విషయం.అదే బ్యానర్‌పై రిపీట్ అవని సక్సెస్!‘పెళ్ళి సందడి’ సాధించిన విజయంతో రాఘవేంద్రరావు తమ సొంత ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్‌పై ఆ వెంటనే అదే ఏడాది జె.డి. చక్రవర్తి హీరోగా ‘బొంబాయి ప్రియుడు’ (1996 సెప్టెంబర్ 5) తీశారు. మునుపటి చిత్రం అంత పెద్ద హిట్టయినా, ఈ సినిమా మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోయింది. సక్సెస్ఫుల్ సినిమాగా పెట్టిన పెట్టుబడులు వెనక్కి తీసుకొచ్చింది. ఇక, ఆ వెంటనే ‘పెళ్ళి సందడి’ నిర్మాతలు తమ చిత్రాన్ని రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ‘మేరే సప్నోం కీ రాణీ’ (1997) పేరిట ఊర్మిళా మాతోండ్కర్, మధుబాల హీరోయిన్లుగా, సంజయ్ కపూర్ హీరోగా నిర్మించారు. విచిత్రమేమిటంటే, ఆనంద్ – మిళింద్ సంగీతంలో వచ్చిన ఆ రీమేక్ తెలుగులోని మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయలేకపోయింది. ఉత్తరాది జనానికి పట్టకపోవడంతో తెలుగు ఇండస్ట్రీ హిట్... హిందీలో అట్టర్‌ఫ్లాపైంది. ‘పెళ్ళి సందడి’ వచ్చిన సరిగ్గా రెండేళ్ళ తర్వాత 1998 సంక్రాంతికి ఆ దర్శక, నిర్మాతల టీమ్, అదే బ్యానర్‌పై నూతన తారలతో ‘పరదేశి’ (1998 జనవరి 14) ప్రయత్నం చేసింది. కానీ, అదీ ఘోరంగా ఫ్లాపైంది. దాంతో ‘పెళ్ళి సందడి’ చేసిన బ్యానర్‌కు పూర్తిగా తెరపడింది. ఆ తరువాత అయిదేళ్ళకు దర్శకుడు రాఘవేంద్రరావు తన 100వ సినిమాగా అల్లు అర్జున్ను హీరోగా పరిచయం చేస్తూ, ‘గంగోత్రి’ (2003) రూపొందించారు. లక్ష్మీ ఫిలిమ్స్ జగదీశ్ ప్రసాద్‌ను మినహాయించి, మళ్ళీ అల్లు అరవిందే సమర్పకుడిగా, అశ్వినీదత్ నిర్మాతగా, వారితో కలసి, రాఘవేంద్రరావు ‘యునైటెడ్ ప్రొడ్యూసర్స్’ అనే వేరొక కొత్త బ్యానర్‌పై ఆ చిత్రాన్ని అందించడం గమనార్హం.ఆ ముగ్గురి కెరీర్‌కీ స్వర్ణోత్సవం!దర్శక, నిర్మాతలుగా రాఘవేంద్రరావు, అశ్వినీదత్, అల్లు అరవింద్‌ల మధ్య అప్పటికీ ఇప్పటికీ మంచి అనుబంధం, స్నేహం. గమ్మత్తేమిటంటే, ఈ ముగ్గురూ ఇప్పటికి 50 ఏళ్ళ పైగా సినీ రంగ ప్రస్థానం సాగిస్తూనే ఉన్నారు. 1965లో సహాయ దర్శకుడైన రాఘవేంద్రరావు సినీ రంగానికి వచ్చి 60 ఏళ్ళు నిండింది. శోభన్‌బాబు ‘బాబు’ (1975)తో తొలిసారి స్వతంత్ర దర్శకుడై, 50 ఏళ్ళు పూర్తయింది. ఇక, ‘వైజయంతీ’ పతాకంపై ఎన్టీఆర్ ‘ఎదురులేని మనిషి’ (1975)తో అశ్వినీదత్ స్వతంత్ర నిర్మాతై 50 ఏళ్ళు నిండాయి. అలాగే, వేరొకరితో కలిసే అయినప్పటికీ ‘గీతా ఆర్ట్ ప్రొడక్షన్స్’ పతాకంపై ‘బంట్రోతు భార్య’ (1974 జూన్ 7)తో నిర్మాత అయిన అల్లు అరవింద్ సైతం చిత్రనిర్మాణంలో యాభై వసంతాలు పూర్తి చేసేసుకున్నారు. ఆ రకంగా ‘పెళ్ళి సందడి’తో పరిశ్రమ రికార్డు సృష్టించిన ఆ ముగ్గురు మిత్రుల కెరీర్‌కీ ఇది ‘గోల్డెన్‌జూబ్లీ’ సెలబ్రేషన్స్ ఇయర్.ఏమైనా... సినిమా రిలీజ్‌కు ముందే... ఓ వేడుకలో దర్శకుడు దాసరి అన్నట్టు... ‘పెళ్ళి సందడి’ ఫక్తు వాణిజ్య ఘనవిజయాల దర్శకేంద్రుడి సినిమా కాదు... కసికొద్దీ ‘జ్యోతి’ (1976), ‘ఆమె కథ’ (1977) లాంటి సిసలైన చిన్న బడ్జెట్ సాహస ప్రయోగాలు చేసిన దర్శకుడి సినిమా. ఇంకా చెప్పాలంటే... స్టార్ హీరోల, భారీ చిత్రాల రాఘవేంద్రరావు తనను తాను స్వయంగా సవాలు చేసుకొని, కథ, కథనం, సాంకేతిక నైపుణ్యాలను నమ్ముకొని చేసిన సినిమా. సృజనాత్మకత ఉంటే చిన్న బడ్జెట్లోనూ అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన సినిమా. అప్పట్లో అందరినీ అవాక్కయ్యేలా చేసిన బాక్సాఫీస్ ఇండస్ట్రీ రికార్డ్ సినిమా. నేటికీ జనం మర్చిపోలేని మ్యూజికల్, ఫ్యామిలీ సినిమా... ‘పెళ్ళి సందడి’. – రెంటాల జయదేవ -
ఎవరైనా ప్రపోజ్ చేశారా?.. హీరోయిన్ శ్రీలీల క్రేజీ కామెంట్స్?
పెళ్లిసందడి ఫేమ్, టాలీవుడ్ యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా తర్వాత రవితేజ సరసన ధమాకాతో అదరగొట్టింది. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ అయిపోయింది ముద్దుగుమ్మ. తాజాగా రామ్ సరసన స్కంద చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహించారు. శనివారం ఈ చిత్రానికి స్కంద ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొని సందడి చేశారు. అయితే ఈవెంట్‌కు యాంకర్‌గా వ్యవహరించిన సుమ హీరోయిన్ శ్రీలీలకు ఆసక్తికర ప్రశ్న వేసింది. అదేంటో ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: బాయ్ ఫ్రెండ్ వల్ల నరకం అనుభవించాను: రోహిణి) స్కంద ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్లో శ్రీలీలను యాంకర్ సుమ ప్రశ్నించింది. మీకు ఇప్పటిదాకా మీకేమైనా లవ్ ప్రపోజల్స్ వచ్చాయా అని నవ్వుతూ అడిగింది. ఆ ప్రశ్నకు తనదైన శైలిలోనే సమాధానమిచ్చింది పెళ్లిసందడి భామ. ఇప్పటి వరకైతే రాలేదు కానీ.. సెప్టెంబర్ 15న రావొచ్చేమో.. ఫన్నీగా ఆన్సరిచ్చింది. ఎందుకంటే ఆ రోజునే రామ్- శ్రీలీల స్కంద మూవీ రిలీజ్ కానుంది. బాలయ్య గురించి మాట్లాడుతూ..'అంతేకాకుండా బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన గురించి చాలా చెప్పాలని ఉంది. కానీ వచ్చేనెలలో జరిగే మరో ఈవెంట్లో వెల్లడిస్తాననని చెప్పుకొచ్చింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నేను.. రామ్‌తో కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. హీరో శ్రీకాంత్‌కు మా ఇంట్లో వాళ్లందరు ఫ్యాన్స్. ఆయన సినిమా టైటిల్‌తోనే నేను కెరీర్ గురించి ప్రారభించా. థ్యాంక్ యూ శ్రీకాంత్.' అంటూ చెప్పుకొచ్చింది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇది చదవండి: రామ్ 'స్కంద' ట్రైలర్ విడుదల.. బోయపాటి మాస్ మార్క్) -
'పెళ్లిసందడి హీరోయిన్'.. ఇప్పుడేంటీ ఇంతలా మారిపోయింది!
అప్పట్లో శ్రీకాంత్ హీరోగా నటించిన ‘పెళ్లి సందడి’ సినిమా మీకు గుర్తుందా? 1990ల్లో వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రంలో రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా నటించారు. దీప్తి తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత దీప్తికి తెలుగులో అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే పెళ్లిసందడి సినిమాలో మెప్పించిన అమ్మడు ఇప్పుడేం చేస్తోందో, ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!) అయితే 2002లో వచ్చిన కొండవీటి సింహాసనం సినిమా తర్వాత తెలుగు తెరకు దూరమయ్యారు దీప్తి. ఆ తర్వాత బాలీవుడ్ చిత్ర దర్శకుడు రణ్‌దీప్ ఆర్యను పెళ్లి చేసుకోగా.. ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. పెళ్లి తర్వాత కూడా 2007లో వచ్చిన ‘రాకిలిపట్టు’ అనే మలయాళ చిత్రంలో నటించారు. సినిమాల్ నటిస్తూనే ‘దీప్తి భట్నాగర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా పలు టీవీ షోలను నిర్మించారు. ఇప్పటికీ ఆ సంస్థ ద్వారా షోలను నిర్మిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న దీప్తి చాలా మారిపోయింది. పెళ్లిసందడి సన్నగా, నాజూకుగా కనిపించిన ఈ అమ్మడు బొద్దుగా తయారైంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీప్తికి ట్రావెలింగ్‌పై మక్కువతో విదేశాల్లో ట్రావెలింగ్ మీద ఓ షోను కూడా చేసింది. కాగా.. దాదాపు 10 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె 2022లో రెండోసారి వెండితెరపై మెరిశారు. పెళ్లిసందDలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. (ఇది చదవండి: వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్లో నిహారిక.. ఆ ఫోటో అర్థం అదేనా?) View this post on Instagram A post shared by Deepti Bhatnagar (@dbhatnagar) - పిన్నాపురం మధసూదన్ -
చాలా అప్డేట్ అయ్యారు.. ఎవరూ అలా అలోచించట్లేదు: శ్రీలీల
పెళ్లిసందడి చిత్రం ద్వారా ఫేమ్ తెచ్చుకున్న భామ శ్రీలీల. ఆ తర్వాత ధమాకా సూపర్ హిట్‌తో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. టాలీవుడ్లో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. యంగ్ హీరోలతో పాటు అగ్రతారలతోనూ నటిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల పలు ప్రశ్నలకు సమాధానలిచ్చింది. వరుసగా అగ్ర హీరోల సినిమాల్లో చేయడం వల్ల ఏదైనా ప్రత్యేక ముద్ర పడుతుందని మీకెప్పుడైనా భయం వేసిందా? అని ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చింది శ్రీలీల. (ఇది చదవండి: స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్.. ఏకంగా త్రిష ప్లేస్‌లో!) శ్రీలీల మాట్లాడుతూ.. 'సీనియర్లతో ఒకలా.. యువ హీరోలతో చేస్తే మరోలా ఇమేజ్ అనే రోజులు ఎప్పుడో పోయాయి. ప్రజలు ఇప్పుడలా ఆలోచించట్లేదు. చాలా మారిపోయారు. ఎంతో ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. సినిమా అనేది సృష్టించిన కథ. తెరపైకి తీసుకురావడానికి అందుకు తగిన పాత్రలకు సరిపోయే తారలనే ఎంచుకుంటారు. మనకిచ్చిన పాత్రకు వందశాతం న్యాయం చేస్తున్నామా? అన్నదే ప్రేక్షకులు చూస్తారు. అంతే కానీ మీ పక్కన ఉన్నది అగ్ర హీరోనా, యువ హీరోనా అనేది ఎవరూ చూడరు. ఏ ఆర్టిస్ట్‌కు కూడా ఇలాంటి ఆలోచన ఉండకూడదు. అసలు వయసును ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవద్దు.' అని అన్నారు. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, ఆదికేశవ చిత్రాలతో పాటు నితిన్, రామ్, విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. (ఇది చదవండి: ప్రేయసితో సహజీవనం.. ఆమె ప్రెగ్నెన్సీపై డౌట్ పడ్డ నటుడు!) 🌸Comfy🌸 pic.twitter.com/QHbPaL7cdT — Sreeleela14 (@SreeLeela_1) May 29, 2023 -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లిసందడి హీరోయిన్ రవళి
ఒకప్పటి హీరోయిన్ రవళి గుర్తుందా? అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన రవళి ముఖ్యంగా ‘పెళ్లిసందడి’ సినిమాతో పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు సహా తమిళంలోనూ స్టార్ హీరోలతో జతకట్టి అప్పట్లో సూపర్ క్రేజ్‌ను దక్కించుకుంది. 18 ఏళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ కనిపించింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన రవళి ఇప్పటివరకు రీఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా తిరుమలలో దర్శనమిచ్చిన ఈమె లుక్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పడు అందచందాలతో అలరించిన రవళి ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. -
‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల తల్లిపై కేసు
‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల తల్లిపై పోలీసుల కేసు నమోదైంది. తొలి చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమె వరస ఆఫర్లు అందుకుంటోంది. మూవీ ప్లాప్ అయినప్పటికు ఆమె మాత్రం వరస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం చేతి నిండ ప్రాజెక్ట్స్‌తో తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీలకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె తల్లి స్వర్ణలతపై తాజాగా ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. వివరాలు.. సుభాకర్రావు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న స్వర్ణలత మనస్పర్థలు రావడంతో 20 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె తన కూతురు, హీరోయిన్ శ్రీలీలతో కలిసి విడిగా జీవిస్తోంది. అయితే స్వర్ణలత-సుభాకర్ విడాకుల పిటిషన్‌పై ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది. చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత ఈ నేపథ్యంలో అక్టోబరు 3న కొరమంగళలో ఉన్న తన అపార్ట్ మెంట్ లోకి స్వర్ణలత తాళం పగలగొట్టి వెళ్లిందని సుభాకర్ ఆరోపించారు. దీనిపై ఆయన తాజాగా అడుగుడి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.కాగా ఇప్పటికే స్వర్ణలతపై ఓ కేసులో నిందితురాలిగా ఉన్నారు. అలియన్స్ యూనివర్సిటీ వివాదంలో అనేకల్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఏ2గా కేసు నమోదైంది. ప్రస్తుతం స్వర్ణలత బెయిల్‌పై ఉంది. ఈ క్రమంలో ఆమెపై తాజాగా మరో కేసు నమోదైంది. ఇదిలా ఉండగా హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం రవితేజ ‘ధమాకా’, నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’, గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ హీరోగా చేస్తున్న ‘స్టూడెంట్’లో చిత్రాలతో బిజీగా ఉంది. -
ఎట్టకేలకు ఓటీటీలోకి పెళ్లి సందD, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెరకెక్కించిన చిత్రం ‘పెళ్లి సందD’. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్గా నటించింది. గతేడాది అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది. 'పెళ్లి సందD చేయడానికి రెడీనా?? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్, అందరూ ఆహ్వానితులే..' అంటూ జీ5 స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఇది చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి పెళ్లి సందడి ఈ శుక్రవారంనాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇక ఓ పట్టు పట్టాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. పెల్లి సందD చేయడానికి రెడీనా?? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్ అందరూ ఆహ్వానితులే#PelliSandaDonZEE5 #PelliSandaD@Ragavendraraoba @mmkeeravaani @arkamediaworks @Shobu_ @boselyricist pic.twitter.com/17nMnoTzD6 — ZEE5 Telugu (@ZEE5Telugu) June 21, 2022 చదవండి: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి తింటున్న టైంలో వచ్చి ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తమే.. -
పేరు మార్చుకున్న శ్రీకాంత్ కొడుకు రోషన్
నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు రోషన్. ఈ సినిమా తర్వాత ఇటీవలె పెళ్లి సందD సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయినా రోషన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కానీ సరైన హిట్ మాత్రం పడలేదు. దీంతో తాజాగా ఈ యంగ్ హీరో తన పేరులోని స్పెల్లింగ్‌ను “Roshann” గా మార్చుకున్నాడు. న్యూమరాలజీ ప్రకారం తన పేరుకు అదనంగా ‘n’ని జోడించాడు. మరి ఈ లాజిక్ రోషన్ కెరీర్‌కు ప్లస్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇంతకుముందు తమన్నా, సాయి ధరమ్ తేజ్ సహా పలువురు సెలబ్రిటీలు న్యూమరాలజీ ప్రకారం తమ పేరును మార్చుకొని అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. -
'సలార్' ప్రొడక్షన్ బ్యానర్లో శ్రీకాంత్ కొడుకు రోషన్ సినిమా
Hero Srikanth Son Roshan Next Film With Vyjayanthi Movies: నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు రోషన్. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని పెళ్లి సందD సినిమాలో నటించాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయినా రోషన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస ఆఫర్లు వస్తున్నా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేషనల్ అవార్డు విన్నర్ ప్రదీప్ అద్వైతం ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, స్వప్నా సినిమాస్ ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఆదివారం(మార్చి13)న రోషన్ బర్త్‌డే సందర్భంగా వైజయంతి మూవీస్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. We are delighted to announce our Production No.9 with #Roshann, Directed by National Award Winning Director @PradeepAdvaitam. Wishing 'Roshann' a very Happy Birthday.@SwapnaCinema @VyjayanthiFilms pic.twitter.com/NEpCwzhJHl — Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 13, 2022 -
ఆసక్తిగా శ్రీలీల పోస్ట్, మనసు సంచలనమైందంటూ కోట్..
పెళ్లి సందడి మూవీతో కుర్రకారు మతి పొగొట్టింది శ్రీలీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రోణంక తెరకెక్కించిన ఈ చిత్రంతోనే శ్రీలీల టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఒక్క సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఆమె అందం, అభియనంకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో వరస ఆఫర్లు శ్రీలీలకు క్యూ కడుతున్నాయి. ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే శ్రీలీల తాజాగా చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ‘భీమ్లా నాయక్’ టీంపై అలిగిన హీరోయిన్లు?, సంయుక్త మీనన్ క్లారిటీ సోషల్ మీడియాలో అప్పడప్పుడు దర్శనం ఇచ్చే ఆమె తన తాజా ఫొటోలను షేర్ చేస్తూ ఆసక్తికర కోట్‌ను జోడించింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ తాజా పోస్ట్‌లో శ్రీలీల.. ‘మనసు చంచలమైనది.. దానిని నియంత్రించడం చాలా కష్టం. కానీ నిరంతరం నేర్చుకోవడం వల్ల మనసును నియంత్రించుకోవచ్చు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఆమె పోస్ట్ చూసిన నెటిజన్లు రకారకాలుగా స్పందిస్తున్నారు. కాగా ప్రస్తుతం శ్రీలీల రవి తేజ హీరోగా త్రినాద్ రావ్ నక్కిన దర్శకత్వంలో వస్తున్న ధమాకా సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చదవండి: Prabhas-Pooja Hegde: అసలేం జరిగింది, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతుందా? View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
పెళ్లి సందD హీరోయిన్‌కు పుష్కలంగా అవకాశాలు..
Pelli SandaD Heroine Sreeleela New Movie With Roshan: బెంగళూరు బ్యూటీ శ్రీలీల పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. 'పెళ్లి సందD'సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ భామ రాఘవేంద్రరావు హీరోయిన్గా అందరి దృష్టిని ఆకర్షించింది. తొలి సినిమా 'పెళ్లి సందD'అనుకున్నంత సక్సెస్ కాకపోయినా ఈ అమ్మడికి మాత్రం పుష్కలంగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో చాన్సులు కొట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు తొలిసారి తనతో జోడీ కట్టిన రోషన్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వైజయంతి మూవీస్ బ్యానర్లో త్వరలోనే ఈ సినిమా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. -
ప్రభాస్ సరసన పెళ్లి సందD హీరోయిన్!
Sri Leela To Share Screen With Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఆదిపురుష్, సలార్ సినిమాలు సైతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ‘రాజా డీలక్స్’ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సర్క్యులేట్ అవుతుంది. ఈ సినిమాలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల.. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనుండగా అందులో శ్రీలీల ఒక హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తుంది. -
‘జైలు’లో పెళ్లి సందడి హీరోయిన్
ఇది నిజమైన జైలు అనుకుంటున్నారా? కానే కాదు... చైతన్యపురి చౌరస్తాలోని మణికంఠ క్రౌన్‌లో జైలు గదులను తలపించేలా రూపుదిద్దుకున్న ఓ థీమ్ మండి రెస్టారెంట్. పెళ్లి సందడి సినిమా ఫేం శ్రీలీల ఆదివారం దీనిని ప్రారంభించారు. ఈ రెస్టారెంట్లో మొత్తం జైలు వాతావరణం ఉండేలా..ఫన్నీగా తీర్చిదిద్దారు. -
‘పెళ్లి సందD’ హీరోయిన్‌కు వరుస ఆఫర్లు!, మెగా హీరోతో కూడా ఓ సినిమా?
టాలీవుడ్‌కి ఎందరో హీరోయిన్స్‌ని పరిచయం చేసిన గోల్డెన్ హ్యాండ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది. తెరపై హీరోయిన్స్‌ని ఆయన చూపించినంత అందంగా మరే దర్శకుడు చూపించలేడు అనడంతో అతిశయోక్తి లేదు. అలాంటి శతాధిక దర్శకుడు తన గోల్డెన్ హ్యాండ్‌తో తెలుగు తెరపైకి వదిలిన మరో అందాల బాణమే శ్రీలీల. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లి సందD’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ కన్నడ భామ. ఈ సినిమాలో శ్రీలీల తన గ్లామర్‌తో పాటు నటన పరంగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అంతేగాక డ్యాన్స్‌తో కూడా అదరగొట్టింది. ఇక ఆమె అందంతో పాటు యాక్టింగ్, డ్యాన్స్ స్క్రీల్స్ ఉండటంతో తెలుగు దర్శక-నిర్మాతలు ఆమెకు ఫిదా అవుతున్నారట. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నట్లు టాలీవుడ్లో టాక్. ఇప్పటికే ఆమె మాస్ మహారాజా రవీతేజ ‘ధమకా’ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ నేపథ్యంలో ఆమెకు మరిన్నీ ఆఫర్లు వస్తున్నాయని, దాదాపు 4నుంచి 5 సినిమాల్లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇవి చర్చల దశలో ఉన్నట్లు వినికిడి. అంతేగాక ఓ మెగా హీరో సినిమా ఆఫర్ కూడా వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
వివాదంలో పెళ్లి సందD హీరోయిన్.. ఆమె నా కూతురు కాదంటూ..
సాక్షి, విజయవాడ: పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల వివాదంలో చిక్కుకున్నారు. శ్రీలీల తన కూతురు అంటూ వస్తున్న వార్తలను ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు ఖండించారు. ఈ విషయంపై ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 'శ్రీలీల నా కూతరు కాదు. ఆమె నా మాజీ భార్య కూతురు. మేము విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చింది. నా ఆస్తులను క్లెయిమ్ చేయడానికి ఇంటర్వ్యూలలో నా పేరు వాడుతున్నారు. ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తాము. ఇంకా మా విడాకులపై కేసులు నడుస్తున్నాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లాము. దీనిపై సూరపనేని సొసైటీకి కూడా ఫిర్యాదు చేసినట్లు' వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు తెలిపారు. అయితే తాజాగా విడుదలైన పెళ్లి సందD సినిమాలో శ్రీలీల సహస్ర పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చదవండి: (పెళ్లి సందD సినిమా రివ్యూ) -
పెళ్లి సందD సినిమా రివ్యూ
టైటిల్: పెళ్లి సందD నటీనటులు: రోషన్, శ్రీలీలా, బ్రహ్మానందం, రావు రమేశ్, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్, తదితరులు దర్శకత్వం: గౌరీ రోనంకి నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్, ఆర్కే ఫిలిం అసోసియేట్స్ బ్యానర్ నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేదీ: అక్టోబర్ 15, 2021 దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందిన చిత్రం పెళ్లి సందD. ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, యువ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించారు. గౌరి రోణంకి దర్శకత్వం వహించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. ఎప్పుడూ తెర వెనుక ఉండే రాఘవేంద్రరావు ఈ సినిమాలో నటించడం విశేషం. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజైందీ చిత్రం. మరి ఇది బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టిందా? లేదా? అనేది తెలియాలంటే రివ్యూ చదివేయాల్సిందే! కథ: వశిష్ట(రోషన్) ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అతడి తండ్రి పాత్రలో రావు రమేశ్ నటించాడు. ఎవరో చూసిన సంబంధం కాకుండా మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు వశిష్ట. తన సోదరుడి వివావహంలో సహస్ర (శ్రీలీల)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.ఆమె కూడా అతడి మీద మనసు పారేసుకుంటుంది. అలా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. ఇంతలో వీరి ప్రేమ అనుకోని మలుపులు తిరుగుతుంది. దాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? తన ప్రేమను, ప్రియురాలిని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ: హీరో శ్రీకాంత్‌కు జనాల్లో ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభిన్నమైన కథలతో, విలక్షణమైన నటనతో జనాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడీ హీరో. అతడి తనయుడు పెళ్లి సందD సినిమా చేస్తున్నాడనగానే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే నటనతో మెప్పించాడీ హీరో. రెండో సినిమాకే పాత్రలో ఒదిగిపోయిన విధానం మనల్ని ఆశ్చర్యపరచక మానదు. హీరోయిన్ శ్రీలీల గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే కథ, కథనం చాలా వీక్‌గా ఉంది. విజువల్స్ రాఘవేంద్రరావు స్టైల్‌కు తగ్గట్టుగా ఉంటాయి. కానీ కథలో బలం లేకపోవడంతో అవన్నీ తేలిపోతాయి. సెకండాఫ్‌లో డ్రామా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. చాలా సీన్లు బోరింగ్‌గా అనిపిస్తాయి. అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లు వాటికి ఉపశమనం కోసం పెట్టినట్లు అనిపించక మానదు. ఎమోషన్స్ పండించేందుకు ఆస్కారం ఉన్నా డైరెక్టర్ దాన్ని పెద్దగా పట్టించుకోనట్లు అనిపించింది. సినిమాను ఆసక్తికరంగా మలచడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది. టెక్నికల్‌గా.. బలమైన ఎమోషన్స్‌ను పండించడంలో డైరెక్టర్ కొంత తడబడ్డట్లు అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. అందమైన లొకేషన్లను కెమెరాల్లో బంధించి మంచి విజువల్స్ రాబట్టడంలో కెమెరామన్ కొంత మ్యాజిక్ చేశాడు. సినిమా ప్రారంభంలోని సన్నివేశాలతో పాటు సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను చాలా అందంగా చూపించాడు కీరవాణి సంగీతం మెప్పించింది. నిర్మాణ విలువలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఎడిటింగ్ బాగోలేదు. నటీనటులు: రోషన్ ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. సినిమాను సేవ్ చేసేందుకు అతడు చాలానే ప్రయత్నించాడు. నటన, డైలాగులు, డ్యాన్స్.. ఇలా అన్నింటినీ ఉపయోగించాడు, కానీ వర్కవుట్ కాలేదు. హీరోయిన్ గ్లామర్‌గా కనిపిస్తూ అందరినీ ఆకర్షించేందుకు ప్రయత్నించింది కానీ ఆమె పాత్రకు పెద్దగా నటించే స్కోప్ ఇవ్వలేదు. రావు రమేశ్, రఘుబాబు తమ పాత్రలతో కామెడీ పండించే ప్రయత్నం చేశారు. రాఘవేంద్రరావు నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చివరగా.. సందడి ఎక్కువ అలజడి తక్కువ అన్నట్లు ఉందీ పెళ్లి సందD. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా కూడా ఎందుకో మెప్పించలేదనిపించింది. -
పెళ్లి సందD ట్విటర్ రివ్యూ
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ‘పెళ్లి సందD’. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోహీరోయిన్లు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్విటర్ రివ్యూ దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు ఏమేర వినోదం అందించింది మరికొద్ది సేపట్లో పూర్తి రివ్యూ రానుంది. ఆలోపు ప్రీవ్యూస్ చూసిన నెటిజన్లు ఈ మూవీ గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. రోషన్, శ్రీలీల పర్ఫామెన్స్, పాటలు, విజువల్స్ గురించి ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. Addicted #MadhuraNagarilo song 👌👌👌👌👌#PellisandaD @mmkeeravaani garu kummio 🎵🎶🎵 — Aarya (@pradeepASSRR) October 14, 2021 మినిమమ్ టాక్ వచ్చినా ఫ్యామిలీ మొత్తం థియేటర్లకు క్యూ కడుతుందని చెబుతున్నారు. అయితే కథపై అంతగా మాట్లాడుకోవడం లేదు కానీ, రోషన్, శ్రీలీలా జోడి, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం మూవీకి హైలెట్‌గా చెప్పొచ్చు అంటున్నారు. ముఖ్యంగా మధురా నగరి పాట చాలా అద్భుతంగా ఉందని, ఈ పాట తెగ ఆకట్టుకుంటోందంటున్నారు. సీనియలర్ నటులు బ్రహ్మనందం, రావు రామేశ్, రాజేంద్ర ప్రసాద్‌ల పాత్రలు బాగున్నాయని, ఇది ఒక పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, రోటీన్ స్టోరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నాటి పెళ్లి సందడికి సీక్వెల్‌గా వచ్చిన నేటి పెళ్లి సందD పాజిటివ్ టాక్‌నే తెచ్చుకుంటోందని చెప్పకోవాలని, సినిమా ఏ మాత్రం బాగుందని టాక్ వచ్చిన పండుగకు ఫ్యామిలీకి పర్ఫెక్ట్ చిత్రం అవుతుందంటున్నారు. All the best to #PelliSandaD Team..!! Minimum talk vachinda family Q kattestaru..!! Craze kuda families lo bagane undi. — Shannu (@Shannu_S3) October 14, 2021 -
శ్రీవారిని దర్శించుకున్న ‘పెళ్లి సందD’ హీరోహీరోయిన్
పెళ్లి సందD హీరో రోషన్, హీరోయిన్ శ్రీలీలాతో పాటు మూవీ టీం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు(గురువారం) ఉదయం వీఐపీ దర్శనం ద్వారా చిత్రం బృందం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు పెళ్లి సందD హీరోహీరోయిన్ను, చిత్ర బృందాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా హీరో రోషన్ మీడియాతో మాట్లాడుతూ.. రేపు సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో శ్రీవారి ఆశీర్వాదం కోసం వచ్చామని చెప్పాడు. శ్రీనివాసుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఇక హీరోయిన్ శ్రీలీలా మాట్లాడుతూ.. సినిమా బృందం మొత్తం శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిందన్నారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ మూవీ అని, కుటుంబంతో కలిసి అందరూ చూడవచ్చని దర్శకురాలు గౌరీ రోణంకి పేర్కొన్నారు. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించబోయే చిత్రాలివే..
దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకులకు మరింత వినోదం పంచేందుకు పలు సినిమాలు సిద్దమయ్యాయి. ఇందులో కొన్ని థియేటర్లోకి వస్తుండగా మరికొన్ని ఓటీటీలో విడుదల కానున్నాయి. ప్రతి ఏడాది దసరాకు అగ్ర హీరో సినిమాలు పోటీ పడేవి. కానీ ఈసారి అగ్ర హీరోల సినిమాలు ఏం లేకపోవడం గమనార్హం. అయితే కుర్ర హీరోలు మాత్రం తమ లక్‌ను పరీక్షించుకునేందుకు ఈ వారంలో మీ ముందుకు రాబోతున్నారు. వెండితెర, బుల్లితెరపై సందడి చేయబోయే ఆ చిత్రాలేవో తెలుసుకోవాలంటే ఇక్కడ ఓ లుక్కేయండి. థియేటర్లో విడుదల కాబోయే చిత్రాలు మహా సముంద్రం యంగ్ హీరోలు సిద్ధార్థ్, శర్వానంద్‌ల మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముంద్రం’. అదితీ రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘ఆర్ఎక్స్100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రావు రమేశ్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుదీర్ఘ విరామంతో నేరుగా తెలుగు సినిమాతో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకులను మహా సముంద్రంతో పలకరించబోతున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 14న థియేటర్లో విడుదల కానున్న ఈ మూవీ అతడికి ఏ మేర సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్కినేని వారసుడు అఖిల్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. అక్టోబరు 15న దసరా పండగ కానుకగా విడుదలవుతోన్న ఈమూవీని ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకుడిగా వ్యవహరించాడు. కాగా అఖిల్ నటించిన మూడు చిత్రాలు అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకుని మంచి హిట్ కోసం చూస్తున్న అఖిల్ ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో వస్తున్నాడు. ఈ సారి అయినా అఖిల్ బ్లాక్ బస్టర్ కొడతాడో లేదో చూడాలి. పెళ్లి సందD సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెళ్ళిసందD’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలను సమకుర్చారు. రోషన్‌కు జోడిగా కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, ట్రైలర్లకు ప్రేక్షకులను విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రం కూడా అక్టోబరు 15న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాతోనే దర్శకేంద్రుడు నటుడిగా మారి, ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓటీటీ... సర్దార్ ఉద్దమ్ జలియన్ వాలాబాగ్ ఉదంతం నేపథ్యంలో విక్కీ కౌశల్ కీలక పాత్రలో సూజిత్ సిర్కార్ దర్శకత్వం వహిస్తున్న హిస్టారికల్ డ్రామా ‘సర్దార్ ఉద్దమ్’. విక్కీ కౌశల్ ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబరు 16న ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్ అధికారి, జనరల్ డయ్యర్ తన సైన్యంతో వచ్చి, తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో మొత్తం వెయ్యికి పైగా భారతీయులు మృత్యువాతపడ్డారు. వందల మంది మృతికి కారణమైన జనరల్ డయ్యర్‌ను విప్లవకారుడైన ఉద్దమ్ సింగ్ కాల్చి చంపాడు. అనంతరం ఉరిశిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఈ కథతోనే విక్కీ-సూజిత్ సిర్కార్‌లు ‘సర్దార్ ఉద్దమ్’ తెరకెక్కించారు. రష్మీ రాకెట్.. హీరోయిన్ తాప్సీ పన్ను తాజా చిత్రం రష్మీ రాకెట్. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాప్సీ గుజరాత్ అథ్లెట్ రష్మీ ప్రాతలో కినిపించనుంది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను రోనీ స్ర్కూవాలా, నేహా, ప్రంజల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 15న జీ5 ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. కాగా గతంలో తాప్సీ నటించిన ‘థప్పడ్’ ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆమె నటించిన ‘హసీనా దిల్రుబా’, ‘అనబెల్ సేతుపతి’ కూడా ఓటీటీ బాట పట్టాయి. -
‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం అయితే బాగుండేది: రాఘవేంద్రరావు
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఎట్టకేలకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలపై స్పందించారు. ఈ సారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలిపిస్తూ రాజకీయ రణరంగాన్ని తలపించాయన్నారు. ఆయన దర్శక పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా సోమవారం(అక్టోబర్ 11) విశాఖపట్నం వెళ్లారు. చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో ఇంత గందరగోళం జరగకుండా ఉండాల్సింది అన్నారు. ‘ఎన్నికల్లో ఇంత అలజడి సృష్టించడం చిత్ర పరిశ్రమకు మంచిది కాదు. సినీ పెద్దలు అంతా కలిసి మా అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని ఎన్నుకుని.. ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఉంటే బాగుండేది. నిజానికి అదే మంచి పద్దతి. ఇక అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు రాణిస్తాడనే నమ్మకం ఉంది’ అని ఆయన అన్నారు. చదవండి: నన్ను ఎవరు గుర్తు పట్టడంలేదు, అందుకే ఈవెంట్స్‌కి రావట్లేదు: రవళి -
నన్ను ఎవరు గుర్తు పట్టడంలేదు, అందుకే ఈవెంట్స్‌కి రావట్లేదు: రవళి
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్లి సందD’. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న(అక్టోబర్ 10) పెళ్లి సందD ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరి వెంకటేశ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే 25 ఏళ్ల శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలో కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిచిన నాటి పెళ్లి సందడి హీరో, హీరోయిన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: రకుల్ పెళ్లి చేసుకోబోయే ఈ జాకీ భగ్నానీ ఎవరో తెలుసా! ఈ వేడుకలో ఒకప్పుటి హీరోయిన్ రవళిని చూసి అందరూ షాక్ అయ్యారు. అలాగే అతిథులుగా వచ్చిన చిరు, వెంకటేశ్‌లు సైతం ఆమెను చూసి అవాక్కయ్యారు. తన అందం, అభినయంతో 90లలో హీరోయిన్గా చక్రం తిప్పిన రవళి ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. అంతేగాక తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె ఇప్పుడు ఓవర్ వెయిట్‌తో బొద్దుగా ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఈ కార్యక్రమంలో ఆమె స్టేజ్‌పై మాట్లాడుతూ ముందుగా ‘నా పేరు రవళి’ అంటూ చిరంజీవి, వెంకటేశ్‌లకు తనని తాను పరిచయం చేసుకున్నారు. అంతేగాక తనని గుర్తు పట్టి ఉండరేమో.. అందుకే పరిచయం చేసుకుంటున్నాను అంటూ సరదాగా చమత్కరించారు. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న రకుల్!, వరుడు ఎవరంటే.. ఆ తర్వాత రవళి మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. సాధారణంగా నేను ఈ మధ్య ఎలాంటి ఫంక్షన్స్‌కు, మూవీ ఈవెంట్స్‌కు రావడం లేదు. రావొద్దని కాదు కానీ.. వచ్చిన నన్ను ఎవరూ గుర్తుపట్టడం లేదు. అందుకే ఈవెంట్స్‌కు రావడం మానేశాను. అయినా రాఘవేంద్ర రావు పిలిచిన తర్వాత రాకుండా ఉండలేను, ఏ స్టేజ్‌లో ఉన్నా.. ఎలా ఉన్నా వస్తాను’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. అనంతరం ఆమె పెళ్లి సందD హీరో రోషన్, శ్రీలీలా, మూవీ టీంకు ఆమె అభినందనలు తెలిపారు. కాగా కె రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో గౌరి రోనంకి ఈ మూవీని రూపొందించారు. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్గా నటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పెళ్లి సందD ప్రీ-రిలీజ్ ఈవెంట్, స్టార్ల సందడి
-
దర్శకేంద్రుడు వదిలిన అందాల బాణం.. శ్రీలీల ఫొటోలు వైరల్
టాలీవుడ్‌కి ఎందరో హీరోయిన్స్‌ని పరిచయం చేసిన గోల్డెన్ హ్యాండ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది. తెరపై హీరోయిన్స్‌ని ఆయన చూపించినంత అందంగా మరే దర్శకుడు చూపించలేడు అనడంతో అతిశయోక్తి లేదు. అలాంటి శతాధిక దర్శకుడు తన గోల్డెన్ హ్యాండ్‌తో తెలుగు తెరపైకి వదిలిన మరో అందాల బాణమే శ్రీలీల. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ చిత్రం ‘పెళ్లి సందD’తో తెలుగు తెరకు పరిచయం అవుతోంది ఈ కన్నడ భామ. సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు. ట్రైలర్లో తన అందాలతో కవ్వించింది శ్రీలీల బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయే శ్రీలీల. మెడిసిన్ చదువుతుంది. పెళ్లి సందD కంటే ముందు కన్నడలో కొన్ని సినిమాలు చేసింది హీరోయిన్ శ్రీలీల. అక్కడ ఆమెకు మంచి గుర్తింపు ఉంది తెలుగు సినిమాల అవకాశాల కోసం చూస్తున్న తరుణంలో ‘పెళ్లిసందD’లో హీరోయిన్గా ఎంపిక చేశాడు రాఘవేంద్రరావు ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ట్రైలర్లో తన అందాలతో కవ్వించింది లీల తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే ఫేస్ అవ్వడంతో పాటు ఆమె మంచి అందం మరియు ప్రతిభ కలిగిన అమ్మాయి అంటూ రాఘవేంద్ర రావు నుండి కితాబు పొందింది. శ్రీలీల అందానికి టాలీవుడ్ కుర్రకారుతో పాటు దర్శక నిర్మాతలు ఫిదా అవుతున్నారు పెళ్లి సందడి సినిమా తర్వాత ఈ చిన్నది.. తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇప్పటికే కుర్ర హీరోలు ఈ అమ్మడితో సంప్రదింపులు కూడా చేస్తున్నారట. రవితేజ హీరోగా రూపొందబోతున్న త్రినాథరావు నక్కిన సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘పెళ్లి సందD’ నుంచి మరో రొమాంటిక్ సాంగ్
సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెళ్ళిసందD’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, ట్రైలర్లకు ప్రేక్షకులను విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్‌ను పాటను విడుదల చేశారు మేకర్స్. మాస్ మహారాజా రవి తేజ చేతుల మీదుగా విడుదలైన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యంగా అందించగా.. ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలను సమకూర్చారు. శ్రీనిధి, కాలభైరవ, నయన నాయర్ ఆలపించారు. చదవండి: పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయకండి: దిల్ రాజు ‘మధుర నగరిలో..’ అంటూ సాగే ఈ పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాటతో దర్శకేంద్రుడు మరోసారి తన మార్క్ చూపించారు. కాగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాఘవేంద్రరావు చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ సినిమాకు ఆయన దర్శకత్వ పర్యవేక్షణ అందించడమే కాకుండా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘పెళ్ళిసందడి’ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా మరీ రోషన్‌కు ఎంత మేర సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి. చదవండి: Pelli SandaDI : పెళ్లి సందD ట్రైలర్ అదిరిందిగా.. -
తెలుగులోగిళ్లలో మరోసారి ‘పెళ్లి సందD’ మూవీ స్టిల్స్
-
Pelli SandaDI : పెళ్లి సందD ట్రైలర్ అదిరిందిగా..
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం పెళ్లి సందD. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశాడు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపాడు మహేశ్. ఇక ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..పెళ్లి సందడి’ సినిమాకి పనిచేసిన కీరవాణి – చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. పాతికేళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. -
ఆకట్టుకుంటున్న పెళ్లి సందD టీజర్
Pelli SandaD Movie Teaser : శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న సినిమా 'పెళ్లి సందD'.శ్రీ లీల ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'సహస్రకు పెళ్లి నాతోనా.. లేక నువ్వు తెచ్చిన తొట్టిగ్యాంగ్ లీడర్‌తోనా' అంటూ రోషన్ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. రాఘవేంద్ర రావు మార్క్ ప్రతి ఫ్రేములో స్పష్టంగా కనిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. గౌరి రోణంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
Pelli SandaD: టైటిల్ సాంగ్ వచ్చేసింది.. వింటే ఫిదా కావాల్సిందే
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న పెళ్లి సందD. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్. ‘పట్టుచీరల తళతళలు.. పట్టగొలుసులా గలగలలు’అంటూ సాగే ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ అందించగా, కీరవాణి అద్భుత సంగీతాన్ని సమకుర్చాడు. ఈ పాటను హేమచంద్ర, దీపు, రమ్యబెహ్రా ఆలపించగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది.


