Sreeleela Mother: ‘పెళ్లి సందD’ హీరోయిన్‌ శ్రీలీల తల్లిపై కేసు

FIR Registered Against Actress Sreeleela Mother Swarnalatha - Sakshi

‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల తల్లిపై పోలీసుల కేసు నమోదైంది. తొలి చిత్రంతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఆమె వరస ఆఫర్లు అందుకుంటోంది. మూవీ ప్లాప్‌ అయినప్పటికు ఆమె మాత్రం వరస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం చేతి నిండ ప్రాజెక్ట్స్‌తో తెలుగులో ఫుల్‌ బిజీగా ఉన్న శ్రీలీలకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె తల్లి స్వర్ణలతపై తాజాగా ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. వివరాలు.. సుభాకర్‌రావు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న స్వర్ణలత మనస్పర్థలు రావడంతో 20 ఏళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె తన కూతురు, హీరోయిన్‌ శ్రీలీలతో కలిసి విడిగా జీవిస్తోంది. అయితే స్వర్ణలత-సుభాకర్ విడాకుల పిటిషన్‌పై ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది.

చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్‌ నటుడు కన్నుమూత

ఈ నేపథ్యంలో అక్టోబరు 3న కొరమంగళలో ఉన్న తన అపార్ట్ మెంట్ లోకి స్వర్ణలత తాళం పగలగొట్టి వెళ్లిందని సుభాకర్ ఆరోపించారు. దీనిపై ఆయన తాజాగా అడుగుడి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.కాగా ఇప్పటికే స్వర్ణలతపై ఓ కేసులో నిందితురాలిగా ఉన్నారు. అలియన్స్ యూనివర్సిటీ వివాదంలో అనేకల్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఏ2గా కేసు నమోదైంది. ప్రస్తుతం స్వర్ణలత బెయిల్‌పై ఉంది. ఈ క్రమంలో ఆమెపై తాజాగా మరో కేసు నమోదైంది. ఇదిలా ఉండగా హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం రవితేజ ‘ధమాకా’, నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’, గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ హీరోగా చేస్తున్న ‘స్టూడెంట్’లో చిత్రాలతో బిజీగా ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top