పెళ్లి సందD ట్విటర్‌ రివ్యూ | Pelli SandaD Movie Twitter Review | Sakshi
Sakshi News home page

Pelli SandaD Movie Twiiter Review: పెళ్లి సందడి మూవీ ఎలా ఉందంటే..

Published Fri, Oct 15 2021 10:16 AM | Last Updated on Fri, Oct 15 2021 11:02 AM

Pelli SandaD Movie Twitter Review - Sakshi

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ‘పెళ్లి సందD’. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహిస్తున్నారు. సీనియర్‌ హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌, కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోహీరోయిన్లు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేనిలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చదవండి: మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ట్విటర్‌ రివ్యూ

దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు ఏమేర వినోదం అందించింది మరికొద్ది సేపట్లో​ పూర్తి రివ్యూ రానుంది. ఆలోపు ప్రీవ్యూస్‌ చూసిన నెటిజన్లు ఈ మూవీ గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. రోషన్, శ్రీలీల పర్ఫామెన్స్, పాటలు, విజువల్స్ గురించి ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి.

మినిమమ్ టాక్ వచ్చినా ఫ్యామిలీ మొత్తం థియేటర్లకు క్యూ కడుతుందని చెబుతున్నారు. అయితే కథపై అంతగా మాట్లాడుకోవడం లేదు కానీ, రోషన్‌, శ్రీలీలా జోడి,  ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం మూవీకి హైలెట్‌గా చెప్పొచ్చు అంటున్నారు. ముఖ్యంగా మధురా నగరి పాట చాలా అద్భుతంగా ఉందని, ఈ పాట తెగ ఆకట్టుకుంటోందంటున్నారు. సీనియలర్‌ నటులు బ్రహ్మనందం, రావు రామేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌ల పాత్రలు బాగున్నాయని, ఇది ఒక పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని,  రోటీన్‌ స్టోరీ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి నాటి పెళ్లి సందడికి సీక్వెల్‌గా వచ్చిన నేటి పెళ్లి సంద​D పాజిటివ్‌ టాక్‌నే తెచ్చుకుంటోందని చెప్పకోవాలని,  సినిమా ఏ మాత్రం బాగుందని టాక్‌ వచ్చిన పండుగకు ఫ్యామిలీకి పర్ఫెక్ట్ చిత్రం అవుతుందంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement