breaking news
numerology
-
అల్లు అర్జున్ పేరు మార్చుకోబోతున్నాడా?
సినిమా సెలబ్రిటీలపై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అలానే అల్లు అర్జున్ (Allu Arjun) గురించి కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్వరలో పేరు మార్చుకోబోతున్నాడని పలు ఇంగ్లీష్ వెబ్ సైట్లలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత?పుష్ప 2 (Pushpa 2 Movie) మూవీతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ కి ఊహించని స్టార్ డమ్ వచ్చింది. దీంతో ఆచితూచి మూవీస్ చేస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమా కన్ఫర్మ్, అట్లీతో కూడా ఖరారైందని అంటున్నారు. పుట్టినరోజున (ఏప్రిల్ 8న) అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.(ఇదీ చదవండి: వీకెండ్ విన్నర్ 'మ్యాడ్ స్క్వేర్'..4 రోజుల కలెక్షన్ ఎంతంటే?)ఇలా కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు మాట్లాడుకుంటున్న ఈ టైంలో బన్నీ (Bunny) పేరు మార్చుకోబోతున్నాడనే రూమర్స్ వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలు జాతకాలు, న్యుమరాలజీ లాంటివి ఎక్కువగా నమ్ముతుంటారు. అలానే న్యూమరాలజీ ప్రకారం.. తన పేరులో అదనంగా ఇంగ్లీష్ అక్షరం U,N గానీ బన్నీ జోడించుకుంటాడని.. ఇలా చేస్తే గుర్తింపు మరింత పెరుగుతుందని నమ్మకమట. మరి బన్నీ పేరు మార్పుపై వస్తున్న రూమర్స్ నిజమా కాదా కొత్త సినిమా ప్రకటిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పటిలానే పేరు ఉంటే ఓకే. లేదంటే మార్పు వార్తలు నిజమేనని తేలుతుంది.(ఇదీ చదవండి: యంగ్ హీరోయిన్ చెల్లి పెళ్లి.. ఫొటోలు వైరల్!) -
న్యూమరాలజీ ప్రకారం పేర్లు ఎలా పెడతారంటే?
-
నందమూరి తారకరత్నకు కలిసిరాని 9వ సంఖ్య.. అదే శాపంగా మారిందా?
నందమూరి తారకరత్న మృతి ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన అర్థాంతరంగా తనువు చాలించడం అందరినీ కలిచివేస్తుంది. తీవ్ర గుండెపోటుతో గత 27న బెంగళూరులోని నారాయణ హృదయాలలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్నను బతికించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే తారకరత్నకు 9 సంఖ్య కలిసిరాలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండస్ట్రీలో చాలామంది న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతారు. ఇక ఎక్కువగా తొమ్మిది అంకెను లక్కీ నెంబర్ అని భావిస్తారు. కానీ తారకరత్నకు మాత్రం 9కలిసి రాలేదని చెప్పాలి.తారకరత్న ముందుగా ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో 2002లో హీరోగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అదే ఏడాది వరుసగా 9సినిమాలకు సైన్ చేసి రికార్డు సృష్టించారు. కానీ ఇందులో కేవలం మూడు సినిమాలు మాత్రమే సెట్స్ మీదకి వెళ్లాయి. ఇక గత నెల 27న ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ రెండు అంకెలను కలిపితే వచ్చేది 9 (2+7=9). ఇక ఆయన మరణించిన తేదీ ఫిబ్రవరి 18,(1+8=9) ఈ రెండు అంకెలను కలిపినా తొమ్మిదే వస్తుంది. ఇలా జరిగిన పరిణామాలన్నీ చూస్తే తారకరత్నకు తొమ్మిదవ నెంబర్ కలిసి రాలేదనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తుంది. -
న్యూమరాలజీ: 2023 సంవత్సర ఫలాలు
2023. ఈ సంవత్సరం అంకెలు మొత్తం కూడితే 2+0+2+3=7, వస్తుంది. 7 అంకె కేతుగ్రహానికి సంకేతం. దీని ప్రభావం వలన వైద్యం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, పురాతన గ్రంథాలు, మరుగున పడిన తాంత్రిక విద్యలు, ఆయుర్వేదం, జ్యోతిషం వంటి విద్యలలో సృజనాత్మక మార్పులు, అభివృద్ధి జరుగుతాయి. వైద్య విద్య, వైద్య పరిశోధనలపై ప్రజలకు, ప్రభుత్వానికి ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. ఫైనాన్స్, మేనేజ్మెంట్ రంగంపై విద్యార్థులలో ఆసక్తి ఎక్కువ అవుతుంది. స్టాక్ మార్కెట్‌పై కూడా ఆసక్తి పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ ఫిబ్రవరి వరకు అస్తవ్యస్తంగా ఉంటుంది. ఫిబ్రవరి 2023 తరువాత లాభదాయకంగా ఉంటుంది. ఈ 2023 సంవత్సరం మొత్తం అంకెలు కలపగా 7 వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కేతు ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా జ్యోతిషపరంగా చూసినా 2023 సంవత్సరం ఆదివారం, అశ్విని నక్షత్రం (01–01–2023)తో ప్రారంభం అయ్యి, ఆదివారం, మఖ నక్షత్రం (31–12–2023)తో ముగుస్తుంది. ఈ విధంగా ఈ సంవత్సరం కేతు నక్షత్రం (అశ్విని)తో మొదయ్యి, కేతు నక్షత్రం (మఖ)తో ముగుస్తుంది. అందువలన కేతు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ 2023 శోభకృత్ నామ సంవత్సరంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. కష్టాల నుండి విముక్తి కలిగి ఆత్మజ్ఞానం, తాత్విక జ్ఞానం, ఆత్మాభిమానం కలిగి మంచి పాజిటివ్ ఆలోచనలు కలిగి ప్రజలు అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తారు. 1, 10, 19, 28 తేదీలలో జన్మించినవారికి 2023 సంవత్సరంలో సూర్య, చంద్ర, కేతు గురు గ్రహాల ప్రభావం ఉంటుంది. గురు ప్రభావం వలన ఆకస్మిక ధన్రపాప్తి కలుగుతుంది. పరిశోధన, మైనింగ్ రాజకీయ రంగాలలో ఉన్నవారికి నూతన అవకాశాలు. బాధ్యతలు పెరుగుతాయి. దీనితోపాటు ఆర్థికవృద్ధి, అదృష్టం కలిసి వస్తాయి. కొత్త పథకాలు, వ్యాపారాల ద్వారా లాభాలు గడిస్తారు. విదేశాలలో విద్య, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఇది మంచి సమయం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ యోగం. వైవాహిక జీవితంలో ఉన్నవారికి స్పర్థలు, అ΄ోహలు తొలగి మంచి వైవాహిక జీవితం గడుపుతారు. భార్య/భర్త ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. నైతికత, విలువలు పాటించాలి. లేక΄ోతే సన్నిహితులు మిత్రులు దూరం అయ్యే అవకాశం ఉంది. అహంభావం విడిచిపెట్టి గొప్పవారి సాయం తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. గత సంవత్సరంతో ΄ోల్చితే ఈ సంవత్సరంలో సామాజికంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. కోర్టు కేసుల్లో అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంచి ఆలోచనలు కలిగి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ్రపాప్తి, విద్యలో పూర్తి చేయని కోర్స్‌లు ఉంటే అవి పూర్తి చేస్తారు. డిగ్రీ చేతికి వస్తుంది. పరిశోధనా రంగం వైద్య రంగం జ్యోతిషం తాంత్రిక విద్యలు మొదలైన రంగాలలో ఉన్నవారికి 2023 సంవత్సరం చాలా మంచి సంవత్సరం. అధిక ఒత్తిడి తీసుకోకుండా శాంతంగా ఉంటూ అహంభావాన్ని విడిచి పెట్టి ప్రయత్నిస్తే ఈ సంవత్సరం మీ జీవితంలో నూతన అధ్యాయానికి నాంది అని చెప్పవచ్చు. దుర్గా సప్తసతి పారాయణ వలన మంచి ఫలితాలు ΄ఫందుతారు. 2, 11, 20, 29 తేదీలలో పుట్టినవారికి న్యూమరాలజీ ప్రకారం 2,7 చంద్రునికి సంబంధించిన అంకెలు. ఈ సంవత్సరంలో వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవివాహితులకు వివాహయోగం. సృజనాత్మకత పెరుగుతుంది. రచయితలకు,నటులకు, కళాకారులకు ఇది మంచి సమయం. నటులకు, కళాకారుకి మంచి అవకాశాలు దొరికి, చిత్ర రంగంలో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో సమాచార రంగం బాగుంటుంది. ఈ సంవత్సరం 23 సంఖ్య ( 2+3) కాబట్టి 5 బుధుడి సంఖ్య. దీనివలన స్టాక్ మార్కెట్లో అభివృద్ధి ఉంటుంది. సంవత్సర సంఖ్య లోని 3 గురుడుకి సంబంధించి సంఖ్య కావటం వలన పుట్టిన తేదీ (2,11,20,29) చంద్రుడికి సంబంధించినది కావటం వలన చంద్ర గురువుల కలయిక వలన రాజయోగం కలుగుతుంది. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పాత మిత్రులను కలుస్తారు. కార్యాలయంలో గుర్తింపు వస్తుంది. గమ్యాలను చేరుకోగలుగుతారు. చాలా కాలంగా విదేశాలలో ఉన్నవారు స్వదేశం వస్తారు. అప్పు కోసం ప్రయత్నించేవారికి అప్పు దొరుకుతుంది. ఆకర్షణ శక్తి పెరిగి స్నేహితులు ఎక్కువ అవుతారు. గృహోపకరణ, విలాస వస్తువులు కొంటారు. నగదు కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందువలన జాగ్రత్తగా ఖర్చు చెయ్యాలి. హీలింగ్ చేసేవారికి, వక్తలకు ఇది మంచి సమయం. విష్ణు సహస్ర నామం పారాయణం, శ్రవణం చేయటం, రుద్రాభిషేకం, హనుమాన్ చాలీసా పారాయణ వలన మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆదాయంలో 2 నుంచి 10 శాతం వికలాంగులకు దానం చేయటం వలన మీ వృత్తిలో ఆదాయ వృద్ధి కలుగుతుంది. 3, 12, 21, 30 తేదీలలో జన్మించినవారికి గురు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు నిరంతరం శక్తి సంపన్నులుగా, ఆశావాదులుగా ఉండి తమ ప్రతిభ ద్వారా ఇతరుల కంటే ఎక్కువగా రాణిస్తారు. వీరిపై బుధ, గురు, కేతు ప్రభావం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఏ వయసు వారైనా కొత్త పరిజ్ఞానాన్ని ΄ఫందుతారు. వృత్తివిద్యలు, నూతన సాంకేతిక విద్యలు నేర్చుకుంటారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీ విద్య కోరిక నెరవేరుతుంది. వీరికి ఈ సంవత్సరం నూతన ఉత్సాహంతో నిర్మాణాత్మకంగా ఉంటుంది. మధ్యలో చదువు ఆపినవారు కొత్త కోర్సులు చేయాలనే కోరిక కలిగి ముందుకు వెళతారు. ఈ సంవత్సరంలో గౌరవ పట్టాలు ΄ఫందుతారు. వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది. వేరుసెనగలు, కందులు, పసుపు పండించేవారికి లాభదాయకం. కొత్తకొత్త వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తారు. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారి పిల్లలు ఉద్యోగం వచ్చి సెటిల్ అవుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. షేర్మార్కెట్లో లాభాలు వస్తాయి. తండ్రికి మంచి సమయం. విదేశీ పర్యటన, పుణ్యక్షేత్రాల దర్శనం జరుగుతాయి. ఈ సంవత్సరంలో తీసుకొనే నిర్ణయాల వలన వచ్చే సంవత్సరంలో లాభాలు వస్తాయి. నైతికంగా ఉండాల్సిన అవసరం ఉంది. మే నుండి పిల్లల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దక్షిణామూర్తిని కొలవటం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయంలో 2 నుంచి 10 శాతం పేద విద్యార్థులకు గురువులకు, ఇంటి పురోహితులకు దానం చేయటం వలన మంచి ఫలితాలు వస్తాయి. 4, 13, 22, 31 తేదీలలో జన్మించినవారిపై రాహు గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహు గ్రహం మీద చాలా మందికి వ్యతిరేకత, అ΄ోహలు ఉంటాయి. కానీ రాహు సంఖ్య 4 చాలా మంచి సంఖ్య. వీరు నిర్మాణాత్మక వైఖరి, వాస్తవిక పంథా, స్థిరత్వం, నైపుణ్యం, ప్రశాంతత శాస్త్రీయమైన బాధ్యతాయుతమైన ఆలోచన, కష్టించే గుణం నిజాయితీ, విశ్వాస పాత్రత, పట్టుదల కలిగి ఉంటారు. బుధ రాహుల కలయిక వీరిని గొప్ప నిపుణులుగా చేస్తుంది. రాహు అంటే కొత్త సాంకేతిక నైపుణ్యం కలిగి ఉండటం. ఏ వయసులోవారైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవటం, ఆ రంగంలో ఉన్నవారు నూతన ఆవిష్కరణలు చేయటం, దాని వలన పేరు ప్రఖ్యాతులు, సంపద ΄ఫందటం జరుగుతుంది. కోర్టు కేసులలో విజయం లభిస్తుంది. వివాహం కానివారికి వివాహం జరుగుతుంది. వివాదాలలో ఉన్న వీరి స్థలం వీరికి లభిస్తుంది. కొత్త ఇల్లు కట్టుకుంటారు. పోటీ పరీక్షలలో ఉత్తీర్ణులై మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. రెండో పెళ్ళి కోసం ఎదురు చూసేవారికి ద్వితీయ వివాహం జరుగుతుంది. సంవత్సర సంఖ్యలో 3, జన్మ తేదీ రాహు సంఖ్య అవ్వటం వలన గురు ఛండాల యోగం పడుతుంది. కాబట్టి వీరు ఏ నిర్ణయమైనా తీసుకొనే ముందు ఆలోచించి విజ్ఞుల సలహాలు తీసుకొని చేస్తే మంచిది. గురు ఛండాల యోగం ఉన్నందున ప్రేమ వ్యవహారాలు, రిలేషన్ షిప్లో ఉండటం మంచిది కాదు. రాజకీయ నాయకులకు పదవులు లభిస్తాయి. ఎంతటి క్లిష్టమైన ఎన్నికలోనైనా గెలుస్తారు. సర్పదోష నివారణ పూజ, దక్షిణామూర్తి పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం వలన మంచి జరుగుతుంది. పేదలకు, అనాథలకు, వికలాంగులకు అన్నదానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. 5, 14, 23 తేదీలలో జన్మించినవారు బుధ గ్రహ ప్రభావం వల్ల వీరు బహుముఖ ప్రజ్ఞాశాలురుగా ఉంటారు. క్రియాశీలత, సేచ్ఛా ప్రియత్వం, వినోదం, ఉల్లాసం, మంచి, ఆలోచనలు, తెలివి తేటలు, కార్య దక్షత కలిగి ఉంటారు. 2023 సంవత్సరం లో వీరిపై కేతుప్రభావం ఉంటుంది. సంవత్సరం 23(5) కాబట్టి బుధ ప్రభావం ఉంటుంది. వీరి జన్మతేదీ, సంవత్సర సంఖ్య రెండూ 5 కావడం వల్ల బుధ ప్రభావతో వీరి తెలివి తేటలకు, కార్య నిర్వహణకు గుర్తింపు వస్తుంది. పబ్లిక్ రిలేషన్స్, సేల్స్, పర్యాటక రంగం టీవీ, సినిమా పత్రికా రంగాలలో ఉన్నవారైతే మంచి గుర్తింపు వస్తుంది. వ్యవసాయదారులకు కూరగాయలు చెరుకు, పెసలు, మినుములు పండించేవారికి లాభదాయకంగా ఉంటుంది. వీరు కొత్త భూములు, ΄ఫలాలు కొనే అవకాశం ఉంది. పెట్టుబడులకు ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాలు ్రపారంభిస్తారు. వ్యాపార లావాదేవీలలో డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఇది మంచి సంవత్సరం. పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. నిరుద్యోగులు ΄ోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు వేరే మంచి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నోటిని అదుపులో ఉంచుకోక΄ోతే అవమానాలు జరుగుతాయి. ఆరోగ్యానికి సంబంధించి పంటి, కంటి పరీక్షలు చేయించుకోవాలి. గణపతి ఆరాధన, రుద్రాభిషేకం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయంలో రెండు నుంచి 10 శాతం దానం చేయటం మంచిది. 6, 15, 24 తేదీలలో జన్మించినవారు శుక్ర గ్రహ ప్రభావం వల్ల వీరికి కళాభిరుచి, సృజనాత్మకత, మానవ సేవ, విశ్వాస పాత్రత వంటి లక్షణాలు ఉంటాయి. త్యాగబుద్ధి, సేవాభావం కలిగి ఉంటారు. శుక్ర, బుధ సంబంధం వలన ఈ సంవత్సరం వైద్యం, జ్యోతిషం, తాంత్రిక సంబంధిత వృత్తుల వారికి చాలా మంచి కాలం. వైద్యులు నూతన వైద్యశాలలు ్రపారంభించే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నవారైనా ఆయా రంగాలలో పరిశోధనాత్మక వ్యాసాలు రాస్తారు. అవివాహితులకు వివాహయోగం. ఈ సంవత్సరంలో వీరు ఎంతో ఆత్మతృప్తిని ΄ఫందుతారు. సంవత్సరమంతా చాలా రిలాక్స్డ్గా ఉంటారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. విదేశాలలో ఉన్నవారు స్వదేశం వచ్చి ఆనందంగా గడుపుతారు. విలాస వస్తువులు కొంటారు. ఊహించని ఆస్తి ్రపాప్తిస్తుంది. నటులు, సంగీతకారులకు, మీడియావారికి, నగల వ్యాపారులకు అనుకూలం. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్షిప్స్లో ఉండటం మంచిది కాదు. ప్రేమ వ్యవహారాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. వీథి కుక్కలకు ఆహారం పెట్టడం, బీదవారికి దుప్పట్లు దానం చేయటం మంచిది. భృగు పాశుపత హోమం లేదా సుదర్శన హోమం చేయించుకోవటం మంచిది. 7, 16, 25 తేదీలలో జన్మించినవారిపై కేతు గ్రహ ప్రభావం ఉంటుంది. వీరికి తాత్విక చింతన, మానవాతీత శక్తులు ఉంటాయి. ఆధ్యాత్మికత మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సర సంఖ్య కూడా 2023(7) కేతు సంఖ్య. ఎవరికైనా జన్మ తేదీ, సంవత్సర సంఖ్య ఒక్కటిగా ఉన్నప్పుడు , వారిపై ఆ గ్రహ ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. వారు వారి రంగాలలో చక్కగా రాణిస్తారు. మంచి గుర్తింపు వస్తుంది. ఈ తేదీలలో పుట్టినవారు నర్సులు, వైద్యులు, డ్రగ్గిస్టులు, పురోహితులు, జ్యోతిషులు గా ఉంటారు. ఈ రంగాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం అత్యంత లాభదాయకం అని చెప్పవచ్చు. విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలనుకొనేవారి కోరిక నెరవేరుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం జరుగుతుంది. వీరికి యోగా, ధ్యానం వంటి విషయాలపై మక్కువ ఎక్కువ అవుతుంది. ఈ సంవత్సరం వీరు వ్యాపారంలో రిస్క్ తీసుకోవటం మంచిది కాదు. ప్రేమ వ్యవహారాలలో తల దూర్చకుండా ఉంటే మంచిది. కోర్టులకి, ΄ోలీస్ స్టేషన్స్‌కి వెళ్ళకుండా, సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవటం మంచిది. ఈ సంవత్సరం షేర్ మార్కెట్, స్పెక్యులేషన్‌కు దూరంగా ఉంటే మంచిది. వీరిలో అసాధారణ స్ఫురణ అధికంగా ఉండి ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటిస్తారు. వీరు వీరి రంగాలలో ప్రత్యేకమైన నైపుణ్యం సంపాదించి అందులో ్రపావీణ్యత సాధిస్తారు. ఆంజనేయస్వామి ఆరాధన, గణపతి ఆరాధన వలన మెరుగైన ఫలితాలు పొందుదుతారు. దాన ధర్మాల వల్ల ఉపశమనం లభిస్తుంది. 8, 17, 26 తేదీలలో జన్మించినవారిపై శని ప్రభావం ఉంటుంది. ఇతరులకు సహాయ పడటం, అన్యాయాన్ని ఎదిరించడం వీరి లక్షణాలు. వీరిపై ఈ సంవత్సరం కేతు, బుధ, గురు గ్రహాల ప్రభావం ఉంటుంది. శని బుధ గ్రహాలు మిత్ర గ్రహాలు. అదే విధంగా శని, గురు గ్రహాలు కూడా మిత్ర గ్రహాలు. అందువలన వీరికి ఈ సంవత్సరం భౌతిక సంపదలు, అభీష్టసిద్ధి, విజయం ్రపాప్తిస్తాయి. నూతన ఉత్సాహం, శక్తి, మంచి గుర్తింపు, సంపద, కీర్తి లభిస్తాయి. ఇన్సూరెన్స్ నుంచి ధనం రావటం, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం రావటం జరుగుతుంది. విద్యార్థులు ΄ోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తులు కొంటారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. గొప్పవారి పరిచయాలు కలుగుతాయి. ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులు చాలా క్లిష్టమైన ఎన్నికలలో కూడా విజయం సాధిస్తారు. ఈ సంవత్సరంలో వీరిపై శని, కేతు, గురు, బుధ గ్రహాల ప్రభావం ఉండటం వలన వీరు రుద్రాభిషేకం, గణపతి, ఆంజనేయ, దక్షిణామూర్తి ఆరాధన వల్ల సత్ఫలితాలను ΄ఫందవచ్చు. 9, 18, 27 తేదీలలో జన్మించినవారిపై కుజ గ్రహ ప్రభావం ఉంటుంది. 2023 సంవత్సర సంఖ్య 7, కేతు సంఖ్య. జ్యోతిష శాస్త్ర ప్రకారం కేతువు, కుజుడు రెండూ ఒకే విధమైన ఫలితాలను ఇస్తాయి. అందువలన ఈ సంవత్సరం వీరికి మంచి సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ సంవత్సర సంఖ్యలో ఉన్న 2,0,3 సంఖ్యలు చంద్ర, కేతు,బుధ, గురు గ్రహ ప్రభావాలను కలుగజేస్తాయి. కుజ గురు గ్రహ ప్రభావం వలన గురు మంగళ యోగం కలుగుతుంది. దీని వల్ల రియల్ ఎస్టేట్, మైనింగ్, మిలటరీ, ΄ోలీస్ రంగాలలో ఉన్నవారికి మంచి సంవత్సరం. నిర్మాణం మధ్యలో ఆగి΄ోయినవి మరల మొదలయ్యి, పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం పెండింగ్ పనులు అన్నీ పూర్తి అయ్యే అవకాశం ఉంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. పైకి ధైర్యంగా కనిపించినా, లోలోపల పిరికిగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. రిలేషన్షిప్స్లో ఉన్నవారికి అంత బాగోదు. మనీ మేనేజ్మెంట్లో జాగ్రత్త అవసరం. అనవసర వాద వివాదాలకు దూరంగా ఉండాలి. హనుమాన్, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. అంగారక పాశుపత హోమం చేయించుకుంటే మంచిది. రక్తదానం చేస్తే మంచిది. గ్రహగతులు, వాటి ప్రభావాన్ని పరిశీలించి చూస్తే, ఈ సంవత్సరంలో అందరూ తగు ప్రయత్నంతో అభివృద్ధి పథంలో పయనిస్తారు. శుభకృత్ నామ సంవత్సరం తరువాత 2023లో వచ్చే శోభకృత్ నామ సంవత్సరం, సార్థక నామధేయంతో అందరికీ కొత్త శోభను తెచ్చి పెడుతుంది. – మహమ్మద్ దావూద్ ఆస్ట్రో–న్యూమరో–గ్రాఫాలజిస్ట్ హైదరాబాద్. -
చిరంజీవి పేరు మార్చుకున్నారా ? అసలు కారణం ఇదే !
Megastar Chiranjeevi: ప్రస్తుతం చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలు ఉన్నాయి. సోమవారం (జులై 4) 'గాడ్ ఫాదర్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు చిన్నిపాటి వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి పేరు మార్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోమవారం విడుదలైన 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ గ్లింప్స్‌లో చిరంజీవి పేరు ఇంగ్లీషు లెటర్స్‌లో అదనంగా 'E' అనే అక్షరం దర్శనమిచ్చింది. దీంతో చిరు MEGASTAR CHIRANJEEVIకి బదులుగా MEGASTAR CHIRANJEEEVI అని మార్చుకున్నట్లు పుకార్లు రచ్చ చేశాయి. అంతేకాకుండా ఈ పేరు మార్పు వెనకాల న్యూమరాలజిస్టుల సలహా ఉందని, అందుకే చిరంజీవి పేరు మార్చుకున్నట్లు నెట్టింట వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను చిరంజీవి సన్నిహితులు, గాడ్ ఫాదర్ చిత్రబృందం ఖండిస్తున్నారు. చదవండి: మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఎడిటింగ్ చేసేటప్పుడు జరిగిన తప్పు మాత్రమే అని, చిరంజీవి ఎలాంటి పేరు మార్చుకులేదని చెబుతున్నారు. ఎడిటింగ్ తప్పిదం వల్లే అదనంగా ఇంకో E అక్షరం యాడ్ అయిందే తప్ప న్యూమరాలజిస్ట్‌ల సలహా అస్సలు తీసుకోలేదని తెలిపారు. అలాగే మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చిత్రబృందం పేర్కొంది. అయితే ఈ వార్తపై చిరంజీవి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. చదవండి: కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్ నటుడు మృతి -
పేరు మార్చుకున్న శ్రీకాంత్ కొడుకు రోషన్
నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు రోషన్. ఈ సినిమా తర్వాత ఇటీవలె పెళ్లి సందD సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయినా రోషన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కానీ సరైన హిట్ మాత్రం పడలేదు. దీంతో తాజాగా ఈ యంగ్ హీరో తన పేరులోని స్పెల్లింగ్‌ను “Roshann” గా మార్చుకున్నాడు. న్యూమరాలజీ ప్రకారం తన పేరుకు అదనంగా ‘n’ని జోడించాడు. మరి ఈ లాజిక్ రోషన్ కెరీర్‌కు ప్లస్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇంతకుముందు తమన్నా, సాయి ధరమ్ తేజ్ సహా పలువురు సెలబ్రిటీలు న్యూమరాలజీ ప్రకారం తమ పేరును మార్చుకొని అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. -
పేరు మారింది మరి ఫేట్?
సెంటిమెంట్ చాలా చేయిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఇది కొంచెం ఎక్కువేనని చెప్పక తప్పదు. న్యూమరాలజీని బాగానే నమ్ముతారు.దానిని బట్టి తారలు పేర్లు మార్చుకోవడం అన్నది పరిపాటే.తద్వారా ఎవరు ఎలాంటి ఫలితాలను పొందారన్నది పక్కన పెడితే ఈ పేర్ల మార్పుల పరంపర కొనసాగుతూనే ఉంది.ఆ మధ్య నటి లక్ష్మీరాయ్ తన పేరును రాయ్‌లక్ష్మీగా మార్చుకున్నారు.తాజాగా వర్ధమాన నటి శ్రీప్రియాంక శ్రీజగా పేరు మార్చుకున్నారట. ఇటీవల తమిళ భాష తెలిసిన నటీమణులకు ఇక్కడ అవకాశాలు లేవు అంటూ ఒక వేదికపై తన ఆవేదనను వ్యక్తం చేసి నలుగురి దృష్టిలో పడ్డ ఈ అమ్మడు పుదుచ్చేరికి చెందిన అచ్చమైన తమిళ అమ్మాయి. కంగారు చిత్రం ద్వారా నటిగా పరిచయం అయిన శ్రీప్రియాంక ఆ తరువాత వందామల, కోడైమళై చిత్రాల్లో నటించింది. తాజా చిత్రం సారల్ విడుదలకు ముస్తాబవుతోంది. అయితే నాయకిగా తగిన గుర్తింపు కోసం పోరాడుతున్న శ్రీప్రియాంక తన పేరును శ్రీజగా మార్చుకోవడానికి కారణాన్ని తెలుపుతూ శ్రీప్రియాంక పేరుతో ఇప్పటికే ఇక్కడ ఇంకొందరు నటీమణులు ఉన్నట్లు ఇటీవలే తనకు తెలిసిందని చెప్పుకొచ్చింది. పేరుతో కన్ఫ్యూజన్ ఉండరాదనే శ్రీజగా మార్చుకున్నట్లు వివరించారు. అయితే న్యూమరాలజీ ప్రకారం శ్రీజ పేరు తనకు భాగుంటుందన్నారని అసలు సంగతిని మెల్లగా చెప్పింది. తాను నటించిన సారల్ చిత్ర పాటలకు మంచి స్పందన వస్తోందని చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నానని అంది. ప్రస్తుతం రింగారం అనే చిత్రంలో నటిస్తున్నానని, తిరుపతి లడ్డు అనే మరో చిత్రం త్వరలో ప్రారంభం కానుందని చెప్పింది. మరి కొన్ని నూతన చిత్రాలను అంగీకరించే విషయంలో చర్చలు జరుగుతున్నట్లు శ్రీజగా మారిన శ్రీప్రియాంక చెప్పుకొచ్చింది. మరి ఈ కొత్త పేరు అయినా తనకు మంచి అవకాశాలు తెచ్చి పెట్టి తన ఫేట్‌ను మారుస్తుందేమో చూడాలి. -
చంద్రబింబం: నవంబర్ 10 నుండి నవంబర్ 16 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సంఘంలో విశేష గౌరవం. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. భూ, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. వారం మధ్యలో అనారోగ్యం. వివాదాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రులతో మాటపట్టింపులు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు. పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులకు అవకాశం. వారం మధ్యలో ప్రయాణాలు. ఆరోగ్యభంగం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల ఆశయం నెరవేరుతుంది. వ్యాపారాల్లో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వివాదాలు. అనారోగ్యం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) రుణాలు తీరతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. కాంట్రాక్టు పనులు చేపడతారు. వారం మధ్యలో దూరప్రయాణాలు. ధనవ్యయం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం. ఆరోగ్యం మందగిస్తుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధనలాభం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులకు అవకాశం. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం మధ్యలో విందువినోదాలు. పాతమిత్రుల కలయిక. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. రావలసిన సొమ్ము అందుతుంది. బంధువులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వివాదాలు. అనారోగ్యం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు. వారం చివరిలో ధనవ్యయం. వివాదాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఎంతటి వారినైనా ఆకట్టుకుని వ్యవహారాలు చక్కదిద్దుతారు. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. భూ, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వివాదాలు. ఆరోగ్యభంగం. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి... సన్నిహితులు, మిత్రులు మీ అభివృద్ధికి సహకరిస్తారు. గతంలో నిలిచిపోయిన వ్యవహారాలు సైతం పూర్తి కాగలవు. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ద్వితీయార్థంలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి. మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ... పి. సుశీల పుట్టినరోజు: నవంబర్13