Samantha : లాంచింగ్‌ ఈవెంట్‌లో కనిపించని సామ్‌.. ఎక్కడికెళ్లింది?

Why Did Samantha Missed For Vijay Devarakonda Movie Launch - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ శివ నిర్వాణ డైరెక్షన్‌లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా సమంత నటించనుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో లాంచనంగా ప్రారంభమైంది. పూజా కార్య‌క్ర‌మాల్లో డైరెక్ట‌ర్ శివ నిర్వాణ‌తోపాటు హరీశ్ శంకర్, బుచ్చిబాబు, కొరటాల శివ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చదవండి: తల్లి బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. మిస్‌ అయిన మహేశ్‌

కానీ హీరోయిన్‌గా నటిస్తున్న సమంత మాత్రం మిస్సయ్యింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ లాంచ్‌కు సామ్‌ ఎందుకు రాలేదు అన్న చర్చ మొదలైంది. సామ్‌ ఎక్కిడికెళ్లిందనే విషయంపై నెట్టింట చర్చ నడుస్తుంది. అసలు ఏమైందంటే.. బ్యాక్‌ టూ బ్యాక్‌ చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం దుబాయ్‌లో హాలీడే ట్రిప్‌లో ఉంది. ఈ కారణంగానే మూవీ లాంచ్‌ ఈవెంట్‌కు ఆమె రాలేదని సమాచారం.

కాగా రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సమంత నటిస్తుండటం, రౌడీ హీరోతో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని అంచనాలు పెరిగాయి. చదవండి:  ఆ హీరోయిన్‌ గురించి మనసులో మాటను బయటపెట్టిన యశ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top