Watch: VV Vinayak Launches Bellamkonda Ganesh Nenu Student Sir Movie Teaser - Sakshi
Sakshi News home page

Bellamkonda Ganesh : బెల్లంకొండ గణేష్‌ 'నేను స్టూడెంట్‌ సర్‌' టీజర్‌ విడుదల

Nov 13 2022 9:43 AM | Updated on Nov 13 2022 2:06 PM

VV Vinayak Launches Bellamkonda Ganesh Nenu Student Sir Teaser - Sakshi

బెల్లంకొండ గణేష్, అవంతిక జంటగా నటింన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’. కృష్ణచైతన్య కథ, స్క్రీన్‌ ప్లేతో రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శనివారం ఈ సినివ టీజర్‌ను లాంచ్‌ చేసిన దర్శకుడు వీవీ వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘టీజర్‌ బాగుంది. ఈ సినిమాతో గణేష్‌కు మరో విజయం దక్కాలి. ‘నాంది’ వంటి సినిమాను నిర్మించిన సతీష్‌ వర్మ సంస్థలో గణేష్‌ సినిమా చేయడం హ్యాపీగా ఉంది.

దర్శకుడు రాఖీతో పాటు చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రం ‘స్వాతిముత్యం’తోనే ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్‌ చేయడం సంతోషంగా అనిపింంది. అయితే ఆ సినిమా రిలీజ్‌ కాక ముందే నన్ను నమ్మి, ‘నేను స్టూడెంట్‌ సర్‌’ను నిర్మింన సతీష్‌గారికి ధన్యవాదాలు. ఈ కథలో మంచి కంటెంట్‌ ఉంది. అందుకే యాక్సెప్ట్‌ చేశాను’’ అన్నారు గణేష్‌.

‘‘నిర్మాతగా నా తొలి చిత్రం ‘నాంది’ సక్సెస్‌ అయ్యింది. ‘నేను స్టూడెంట్‌ సర్‌’లో కూడా మంచి కంటెంట్‌ ఉంది’’ అన్నారు సతీష్‌ వర్మ. ‘‘గణేష్‌ కథతో పాటే ట్రావెల్‌ చేస్తారు. సతీష్‌గారిలాంటి నిర్మాత దొరకడం నా అదృష్టం’’ అన్నారు రాఖీ.

Advertisement
 
Advertisement
Advertisement