తండ్రీ, కొడుకులు ఇన్నోసెంట్ అయితే.. 'సౌండ్ పార్టీ' ఉండాల్సిందే! | VJ Sunny and Hrithika Srinivas Sound Party Movie Released On 24th | Sakshi
Sakshi News home page

Sound Party Movie: ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న 'సౌండ్ పార్టీ'

Nov 20 2023 3:16 PM | Updated on Nov 20 2023 3:27 PM

VJ Sunny and Hrithika Srinivas Sound Party Movie Released On 24th - Sakshi

వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం సౌండ్ పార్టీ. ఈ చిత్రానికి సంజ‌య్ శేరి దర్శకత్వం వహించారు. జయ శంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర  నిర్మించారు. ఇప్ప‌టికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అంచ‌నాలు పెంచేశాయి. ఈ మూవీ ఈనెల 24న థియేట‌ర్ల‌లో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

నిర్మాతలు మాట్లాడుతూ.. "మేం తెలంగాణలో పుట్టి పెరిగాం. అమెరికాలో  బిజినెస్ చేస్తూ ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలపై ఉన్న ఇష్టంతో నిర్మాతలుగా మారాలనుకున్నాం. ఫిబ్రవరిలో యుఎస్ నుంచి వచ్చి 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. కాకపోతే అనుకున్న బడ్జెట్ కంటే కాస్తా పెరిగింది. కంప్లీట్ ఫ్యామిలీ అంతా చూసేలా సినిమా ఉంటుంది. సినిమాలో కామెడీ ఉంటే అమెరికా ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ చేస్తారు. కుటుంబంలో తండ్రి కొడుకులు ఇద్దరూ ఇన్నోసెంట్ అయితే మనీ మేకింగ్ ఎలా చేస్తారనేదే సినిమా కాన్సెప్ట్. సన్నీ, శివన్నారాయణ మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తాయి. ఫుల్ కామెడీతో రాబోతున్న చిత్రాన్ని ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది.' అని అన్నారు. ఈ చిత్రంలో శివన్నారాయణ, అలీ, సప్తగిరి, పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్ కీలక పాత్రలు పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement