Vivek Agnihotri: మరి మహిళల నగ్న చిత్రాల సంగతేంటి?: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ డైరెక్టర్‌

Vivek Agnihotri Reacts to FIR Against Ranveer Singh Over Undressed Photoshoot - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నగ్న ఫొటోషూట్‌ ఎంతటి దుమారం రేపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో రణ్‌వీర్‌ సింగ్‌ ఫొటోషూట్‌ హాట్‌టాపిక్‌ మారింది. ఈ విషయంలో కొందరు రణ్‌వీర్‌కు మద్దుతు ఇస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళల మనోభవాలు దెబ్బతీశాడంటూ రణ్‌వీర్‌పై ముంబైలో పోలీసు కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి స్పందించాడు.

చదవండి: ప్రభాస్‌పై దిశ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇలాంటి హీరోని ఇంతవరకు చూడలేదు

ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాతో  మాట్లాడుతూ.. రణ్‌వీర్‌ సింగ్‌పై వస్తున్న విమర్శలు, ఎఫ్‌ఐఆర్‌ను ఖండించాడు. ఇందులో తప్పేముందంటూ రణ్‌వీర్‌కు మద్దతుగా నిలిచాడు. ‘రణ్‌వీర్‌ ఫొటోషూట్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ చెల్లదు. అది ఓ స్టుపిడ్‌ కేసు. ఎలాంటి కారణం లేకుండా నమోదైన కేసు అది. మహిళల మనోభవాలు దెబ్బతిన్నాయని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే ఇక్కడ నాకో విషయం అర్థం కావడటం లేదు. ఇప్పటికే ఎన్నో మహిళల నగ్న చిత్రాలు వచ్చాయి. వాటి వల్ల పురుషుల మనోభవాలు దెబ్బతినవా? దాని సంగతేంటి? ఇదో ముర్ఖపు వాదన.

చదవండి: ఇక యాక్టింగ్‌కి బ్రేక్‌.. అందుకే అంటున్న స్టార్‌ హీరోయిన్‌

ఇలాంటి వాటిని ఎంటర్‌టైన్‌ చేయను. మన సంస్కృతిలోనే మానవ శరీరానికి గౌరవం ఉంది. మానవ శరీరం భగవంతుడి అద్భుత సృష్టి అని నేను నమ్ముతున్నాను. అందుకే దీనికి నేను మద్దతు ఇవ్వను’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే రణ్‌వీర్‌కు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మతో పాలు పలువురు సినీ ప్రముఖులు మద్దుతుగా నిలుస్తున్నారు. కాగా ఓ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోటో షూట్‌ ఇచ్చాడు. . ఈ ఫోటోని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అయింది. ఇక దీనికి తన ఫ్యాన్ నుంచి ‘హాట్‌’ అంటూ కామెంట్స్‌ రాగా మరికొందరు ఈ పిచ్చి చేష్టలేంటని విమర్శిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top