కాబోయేవాడు అలా ఉండాలి, అప్పుడే పెళ్లి : సురేఖవాణి కూతురు

Viral: Surekha Vani Daughter Supritha Reveals About Her Future Husband Qualities - Sakshi

క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్‌ మీడియాలో ఎంత ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సోషల్‌ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు.  పొట్టి దుస్తుల్లో ఉన్న వీరిద్దరి ఫోటోలు వైరల్‌ అయి, చివరకు ట్రోల్‌ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో సురేఖా వాణి సెకండ్ మ్యారెజ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అయితే ఈ వార్తలపై సురేఖా వాణి స్పందించి తాను.. రెండో పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూతురు సుప్రిత కూడా ఈ విషయంపై సీరియస్‌ అయింది. ఇలా నిత్యం ఏదో ఒక విషయంపై వీరిద్దరు వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా సుప్రిత అయితే ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. 

ఇదిలా ఉంటే తాజాగా సుప్రిత తన ఫాలోవర్స్‌తో ముచ్చటించేందుకు లైవ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో నెటిజన్లు సుప్రితపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రశ్నలు వేశారు. మీ నాన్న గురించి ఏమైనా చెప్పు? ఆయన ఎలా చనిపోయాడు? ఫోన్‌లో ఏ యాప్స్ వాడుతావ్? ఖాళీగా ఉంటే ఏం చేస్తావ్? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా?  మీ లవ్‌ స్టోరీ చెప్పండి?  హీరోయిన్‌గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నావు? ఎలాంటివాడిని పెళ్లి చేసుకుంటావు? అసలు పెళ్లి ఎప్పుడు? అంటూ రకరకలా ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికి సుప్రిత ఓపికగా సమాధానం చెప్పింది. ముఖ్యంగా పెళ్లి విషయం గురించి సుప్రిత చెప్పిన సమాధానాలు అందరిని ఆకట్టుకున్నాయి. 

ఎలాంటి వాడు రావాలని కలలు కంటున్నావ్ అని ఓ నెటిజన్ అడిగాడు. నాకు పెద్దగా కోరికలేవీ లేవు గానీ.. ఓవర్ థింకింగ్ ఉండకూడదు..ఎక్కువగా ఆలోచించకూడదు.. నా పిచ్చిని భరించే వాడై ఉండాలి అంటూ తన కలల రాకుమారుడి గురించి చెప్పుకొచ్చింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని మరొకరు అడగడంతో, ఇంకా సమయం ఉందని,  రెండు, మూడేళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది సుప్రిత

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top