పుష్ప: ఫోన్‌ పోగొట్టుకున్న అల్లు అర్జున్!‌

Viral: Is Allu Arjun Lost His Mobile In Pushpa Teaser Release Event - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నేడు(గురువారం) 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దీంతో పుష్ప టీమ్‌ అతడి అభిమానుల కోసం ఒకరోజు ముందే టీజర్‌ను రిలీజ్‌ చేసి మాంచి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. అయితే బన్నీకి మాత్రం ఈ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ షాక్‌నిచ్చింది. ఈ కార్యక్రమానికి అనుకున్న సమయాని కంటే కొంత ఆలస్యంగా వచ్చిన బన్నీ తన మాటలతో అభిమానుల్లో జోష్‌ నింపాడు.

ఇంతమంది ప్రేమను అందుకున్న తాను ఎంతో అదృష్టవంతుణ్ణి అని చెప్పుకొచ్చాడు. ఇక బన్నీ స్పీచ్‌తో ఫ్యాన్స్‌ కేరింతలు కొట్టారు. అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ తన ఫోన్‌ను పోగొట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అతడు కొంత అప్‌సెట్‌ అయినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

చదవండి: అలా అనుకున్నాను కాబట్టే ఇంత దూరం వచ్చా!: బన్నీ

‘జార్జియా’కు పయనమైన హీరో విజయ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top