టీజర్‌, సాంగ్స్‌ నచ్చితే మా సినిమా ఎంకరేజ్‌ చేయండి: హీరో | Viplav Eesaraina Movie Pre Release Event Highlights | Sakshi
Sakshi News home page

Eesaraina Movie: సలార్‌ తర్వాత బాగా నచ్చి యాక్ట్‌ చేసిన మూవీ ఇదే!

Nov 4 2024 4:53 PM | Updated on Nov 4 2024 5:03 PM

Viplav Eesaraina Movie Pre Release Event Highlights

విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమా 'ఈసారైనా'. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న ఓ నిరుద్యోగి అతడి ప్రేమను వెతుక్కునే దిశగా ఎలా సాగుతాడనేది కథ. విప్లవ్‌ నిర్మాతగా, సంకీర్త్‌ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ నవంబర్ 8 న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో హీరో విప్లవ్ మాట్లాడుతూ.. "ఈ సినిమా మీ అందరి ముందుకు రావడానికి కారణం సంకీర్త్ అన్న. ఆయన ముందు నుంచి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఈ సినిమాకి నేనే నిర్మాతను. కష్టమైనా సరే అన్నింటినీ మేనేజ్ చేశాను. టీజర్, సాంగ్స్ చూడండి. నచ్చితే సినిమా చూడండి" అన్నారు.

హీరోయిన్ అశ్విని మాట్లాడుతూ.. ఈ సినిమాకు షూటింగ్ చేస్తున్నన్ని రోజులు సమ్మర్ హాలిడేస్‌లా అనిపించాయి. నా ఫస్ట్ మూవీకి ఇలాంటి క్యారెక్టర్ రావడం సంతోషంగా ఉంది అని తెలిపింది. చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ మాట్లాడుతూ.. విప్లవ్ అన్న నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థాంక్స్. సలార్ తర్వాత ఇష్టంగా చేసిన సినిమా ఇదే" అన్నాడు.

కో ప్రొడ్యూసర్ సంకీర్త్ మాట్లాడుతూ, "నా దృష్టి లో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు. నా దృష్టిలో ఒక సినిమా మనతో పాటు ఇంటికి వచ్చిందంటే అది అందరికీ నచ్చుతుంది. నవంబర్ 8 న థియేటర్స్‌లో ఈ సినిమా చూడొచ్చు" అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement