
విషు రెడ్డి, సంయుక్త, విజయ్ సేతుపతి, చార్మీ కౌర్, నారాయణ రావు, పూరి జగన్నాథ్
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పూరి సేతుపతి’ (వర్కింగ్ టైటిల్) సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. సంయుక్త హీరోయిన్‌గా, టబు, విజయ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోళ్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా సోమవారం నుంచి హైదరాబాద్‌లో ‘పూరి సేతుపతి’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైందని ప్రకటించారు మేకర్స్.
‘‘విజయ్ సేతుపతి, సంయుక్తలతో పాటు ఇతర కీలక తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందుకోసం భారీ సెట్ వేశాం. ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ శరవేగంగా జరిగేలా ప్లాన్ చేశాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది.