
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కొత్త సినిమా ‘తలైవా తలైవి’ (Thalaivan Thalaivi) టీజర్‌ను విడుదల చేశారు. ఆపై మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నిత్యా మీనన్ (Nithya Menen) ఆయనకు జోడీగా నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, సెంబన్ వినోద్ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. జులై 25న విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.