వైజాగ్‌లో కింగ్‌డమ్‌ | Vijay Deverakonda Kingdom next schedule in Vizag | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో కింగ్‌డమ్‌

Feb 16 2025 4:03 AM | Updated on Feb 16 2025 4:03 AM

Vijay Deverakonda Kingdom next schedule in Vizag

వైజాగ్‌ వెళ్లారట విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda). గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ‘కింగ్‌డమ్‌’ అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌ చిత్రీకరణ ఇప్పటికే 75 శాతానికి పైగా పూర్తయింది. కాగా ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం విజయ్‌ దేవరకొండ వైజాగ్‌ వెళ్లారని తెలిసింది.

దాదాపు 20 రోజులకు పైగా వైజాగ్‌లో ‘కింగ్‌డమ్‌’ చిత్రీకరణ జరుగుతుందని, కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్‌ సీక్వెన్స్‌లు చిత్రీకరణ జరిగేలా ఈ చిత్రదర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ప్లాన్‌ చేశారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అలాగే ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని, రెండు రకాల టైమ్‌లైన్స్‌తో కథ సాగుతుందనే ప్రచారం జరుగుతోంది.

ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్‌ ఆల్రెడీ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ‘కింగ్‌డమ్‌’ సినిమాను మే 30న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ఇక ఈ చిత్రమే కాకుండా దర్శకులు రాహుల్‌ సంకృత్యాన్, రవికిరణ్‌ కోలాలతో విజయ్‌ దేవరకొండ ఆల్రెడీ సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement