Vijay Devarakonda : 'ఒకప్పుడు డబ్బులు లేకపోతే నా ఖర్చులన్నీ ఫ్రెండ్‌ భరించాడు'

Vijay Devarakonda Shares New Manali Video Of Devarasanta - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అర్జున్‌ రెడ్డి చిత్రంతో స్టార్‌స్టేటస్‌ అందుకున్న విజయ్‌ గత ఐదేళ్ల నుంచి ‘దేవరశాంటా’(Deverasanta) పేరుతో ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఇంకాస్త డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసిన విజయ్‌ తన అభిమానుల్లో 100మందిని మనాలికి హాలీడే ట్రిప్‌కు పంపించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా విజయ్‌ ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌చేసుకున్నాడు. తన స్నేహితులతో చిన్నప్పుడు ట్రిప్‌కి వెళ్లిన సంగతులని గుర్తుచేసుకుంటూ.. 'నాకు 21 ఏళ్లున్నప్పుడు అనుకుంటా. మొదటిసారి నా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి హంపి ట్రిప్‌కు వెళ్లాను. అప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో నా ట్రిప్‌కు సరిపడా డబ్బులన్నీ నా స్నేహితుడే భరించాడు. నా ఫస్ట్‌ హాలీడే వెకేషన్‌ అదే. నాలాగే అలాంటి సంతోసాన్ని మీ అందరికి కూడా పంచాలనుకున్నా' అంటూ విజయ్‌ అభిమానులతో పంచుకున్నాడు.

 ఇక ఈ దేవర శాంటాలో భాగంగా మనాలి ట్రిప్‌కు వెళ్లిన అభిమానులు తమ అనుభవాలను షేర్‌ చేసుకుంటూ విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఈ ట్రిప్‌కు చివర్లో తన తల్లిదండ్రులతో వెళ్లి విజయ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ చేయడం విశేషం. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top