Liger: బాయ్‌కాట్‌ చేస్తారా ..ఏదొచ్చినా కొట్లాడుడే: విజయ్‌ దేవరకొండ

Vijay Devarakonda Respond On Boycott Liger Issue - Sakshi

‘లైగర్‌ కోసం మూడేళ్లు కష్టపడ్డాం. ప్రాణం పెట్టి నటించాను. తల్లి సెంటిమెంట్‌తో భారతీయ జెండాను ఎగురవేస్తే బాయ్‌ కాట్‌ చేస్తారా? మనం ధర్మంతో ఉన్నాం. ఏదొచ్చిన కొట్లాడుడే’అని విజయ్‌ దేవరకొండ అన్నాడు. లైగర్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ శనివారం విజయవాడలో ఈవెంట్‌ నిర్వహించింది. ఇందులో హీరో విజయదేవర కొండ, హీరోయిన్ అనన్య పాండే, డైరెక్టర్ పూరి జగన్నాధ్, ప్రొడ్యూసర్ చార్మి పాల్గొని సందడి చేశారు.

ఈ సందర్భంగా విజయ్‌ మీడియాతో ముచ్చటిస్తూ బాయ్‌కాట్‌ వివాదంపై స్పందించారు. మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు, మన ధర్మం మనం చేసినప్పుడు ఎవడి మాట వినేదే లేదు. ఏదొచ్చినా కొట్లాడుడే. తల్లి సెంటిమెంట్‌తో మంచి సినిమా చేస్తే బాయ్‌కాట్‌ చేస్తారా? చూద్దాం.. అల్రెడీ బుకింగ్స్‌ ఓపెనయ్యాయి’ అన్నారు.

ఇక లైగర్‌ సినిమా గురించి పూరి కధ చెప్పగానే మెంటలొచ్చిందని వెంటనే ఓకే చెప్పేశానన్నారు. కరణ్ జోహార్ ఈ చిత్రాన్నిఇండియా కు పరిచయం చేశారని చెప్పాడు. ఇక పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ.. లైగర్‌  ఓ యాక్షన్‌ డ్రామా చిత్రమని, చిన్నా, పెద్ద అంతా కలిసి చూడొచ్చని చెప్పారు. అమ్మా నాన్నా తమిళ అమ్మాయి చిత్రానికి లైగర్‌తో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇలాంటి చిత్రాన్ని థియేటర్స్‌లోనే చూడాలని, ఓటీటీ చూడాల్సిన మూవీ కాదన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top