టాలెంటెడ్ డైరెక్టర్‌తో దిల్‌ రాజు- విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన | Vijay Devarakonda And Dil Raju New Movie Launch | Sakshi
Sakshi News home page

టాలెంటెడ్ డైరెక్టర్‌తో దిల్‌ రాజు- విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ప్రకటన

May 4 2024 1:20 PM | Updated on May 4 2024 6:02 PM

Vijay Devarakonda And Dil Raju New Movie Launch

టాలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా విజయ్ తన కొత్త సినిమాను తాజాగా ప్రకటించారు. 'రాజావారు రాణిగారు' సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థలో వస్తున్న 59వ సినిమా ఇది. 

ఈరోజు  లాంఛనంగా అనౌన్స్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో విజయ్ దేవరకొండ కొత్త సినిమా తెరకెక్కనుంది. మే 9న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు. విజయ్‌ దేవరకొండ- దిల్‌ రాజు కాంబోలో ఫ్యామిలీస్టార్‌ సినిమా కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. కొందరు కావాలని సినిమాపై నెగెటివ్‌ టాక్‌ వ్యాప్తి చేయడంతో కొంతమేరకు నిరాశపరిచిందని వార్తలు వచ్చాయి. కానీ, హిట్టు ఫ్లాప్‌తో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండతో మరొక సినిమా చేస్తానని దిల్ రాజు గతంలోనే అన్నారు. 

అయితే ఫ్యామిలీ స్టార్ ఫలితం తర్వాత దిల్ రాజు ఇచ్చిన మాటను పక్కనపెడుతారేమో అని అందరూ అనుకున్నారు. అందరి అంచనాలకు మించి ఆయన తాజాగా కొత్త సినిమాను ప్రకటించారు.  కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న రవికిరణ్ కోలాకి ఏకంగా ఇంతటి భారీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చి దిల్ రాజు అందరిని ఆశ్చర్య పరిచారు.  ఇక్కడ విజయ్ దేవరకొండ కూడా తన కమిట్‌మెంట్‌తో దిల్ రాజు మనసు గెలుచుకున్నారని చెప్పవచ్చు.


 

Advertisement
 
Advertisement
Advertisement