బిచ్చగాడు మూవీతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ మూవీ ప్రేక్షకులను ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబో అలరించేందుకు వస్తోంది. వంద దేవుళ్లు పేరుతో మరోసారి అమ్మ ప్రేమ, సెంటిమెంట్ చూపించేందుకు వచ్చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శశి దర్శకత్వం వహించారు. మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మధ్య తరగతి కుటుంలాల జీవితం నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బిచ్చగాడులానే అమ్మ సెంటిమెంట్ ఉండనుందని టీజర్‌లోనే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని సర్వంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజి ప్రొడక్షన్స్, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాకు బాలాజీ శ్రీరామ్ సంగీతం సమకూర్చారు.


