breaking news
Vanda Devullu Movie
-
యాంకర్ అనసూయ సందేహం.. ఈ సినిమా ఇచ్చిన సందేశం ఒక్కటే!
‘భర్త చనిపోతే బోట్టు, గాజులు ఎందుకు తీసెయ్యాలి?’ అంటూ ఇటీవల ప్రముఖ యాంకర్, నటి అనసూయ చేసిన వీడియో పోస్ట్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు. చాలా మంది అనసూయకు సపోర్ట్‌గానే పోస్టులు పెట్టారు. అలా బొట్టు, గాజులు తీసేయాలని ఏ శాస్త్రంలోనూ లేదని కామెంట్ బాక్సులో రాసుకొచ్చారు. మరికొంతమంది అనసూయను తప్పుపడుతూ పోస్టులు పెట్టారు. ఇదంతా పక్కన పెడితే.. అనసూయ బయటపెట్టిన సందేహాల మాదిరే.. కొన్నేళ్లుగా సమాజంలో పేరుకుపోయిన ఓ కట్టుబాటు వల్ల మహిళలు ఎదుర్కొనే సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. ఆ కట్టుబాటు తప్పు అని చాటి చెబుతూ ఓ సినిమా తెరకెక్కించారు. అదే వంద దేవళ్లు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చిత్రం కథేంటి? ఇచ్చిన సందేశం ఏంటి? ఓ లుక్కేద్దాం.(చదవండి: ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ రివ్యూ)భార్యభర్తల బంధమనేది అపూర్వం. ఆ అనుబంధమే కుటుంబ శ్రేయస్సుకు ఆధారం. జీవిత ప్రయాణంలో ఎక్కడైనా, ఏ రకంగానైనా ఆ బ్రహ్మముడి పొరపాటున చెరిగితే కుటుంబాలకు కుటుంబాలు కుదేలవుతాయి. అందుకే ఏడు జన్మల బంధం ఆ ఏడడుగుల సంబంధం అంటారు. భార్యభర్తలలో ఎవరో ఒకరు దూరమైతే మిగతా వారి బ్రతుకు భారమే. ఆ సమయంలో ఇటు దూరమైనవారి బాధ ఓ వైపైతే అటు సమాజం నుండి వచ్చే సెగ మరో వైపు. అయితే పోయినవారి కోసం కాకుండా ఉన్నవారి గురించి కన్నవారే ఆలోచిస్తే ఎలా ఉంటుందన్న ఇతివృత్తంతో వచ్చిన సినిమా నూరు దేవుళ్ళు. తమిళ సినిమా నూరు సామి దీనికి మాతృక.నిజానికి ఈ తరహా సినిమాలు ఇదివరకు ఎన్నో చూశాం. కాని ఈ సినిమాలో ఉన్న సహజత్వం, స్వచ్ఛత చాలా రోజుల తరువాత ప్రేక్షకులను పులకరిస్తూ పలకరిస్తుంది. ఇటీవల ప్రముఖ యాంకర్, నటి అనసూయ ఈ విషయంపై చేసిన పోస్ట్ కూడా తెగ వైరలవుతోంది.ఈ సినిమాలో వర్ధమాన నటులు విజయ్ ఆంటోని, స్వాసిక తమ పాత్రల్లో జీవించారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ నరాలు తెగే ఉత్కంఠతతో నడుస్తుంది. సినిమా పూర్తయ్యాక చాలా మంది ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా చూశామని సంబరపడతారు. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓ సారి చూద్దాం. ఓ మారుమూల గ్రామంలో ఉన్న సెల్వి అనే వితంతువు కథ ఈ సినిమా. సెల్వికి ఇద్దరు చిన్నపిల్లలు. పెళ్ళైన అతి కొద్ది కాలంలోనే సెల్వి భర్త చనిపోతాడు. అసలే పేదరికంలో ఉన్న సెల్వి భర్త పోయిన బాధను దిగమింగుకోని కనిపించిన ప్రతి పని చేస్తూ పిల్లలను పెంచుతూ ఉంటుంది. కాలం గడుస్తూ పిల్లలకు యుక్తవయసు వస్తుంది. కాని అదే సమయంలో సెల్వికి రెండో పెళ్ళి చేసుకోవాలనిపించి పెద్ద కొడుకైన భాస్కర్ తో తన ఆలోచనను పంచుకుంటుంది. భాస్కర్ ఆ విషయం విన్నాక ససేమిరా అంటాడు. ఇక చేసేదిలేక సెల్వి పెళ్ళి ఆలోచనను విరమించుకుంటుంది. కాని కొద్ది సమయంలోనే ఇద్దరు పిల్లలు తమ కోసం అష్టకష్టాలు పడుతున్న తల్లికి ఓ తోడుండాలనే నిర్ణయానికి వచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి తెస్తారు. పక్క గ్రామంలో భార్యను పోగొట్టుకున్న ఎజుమలై తమ తల్లికి సరైన తోడని వారిద్దరికీ పెళ్ళి చేయాలని నిశ్చయించుకుంటారు. అటు సెల్వి కూడా ఒప్పుకోవడంతో అంతా బాగుంది అనుకునే లోపల సెల్వి బంధువులు, ఆ గ్రామస్తులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. మరి ఆ పిల్లలు ఆ తల్లి పెళ్ళి చేయగలరా లేదా అన్నది మాత్రం వంద దేవుళ్ళు సినిమాలోనే చూడాలి. ఏది ఏమైనప్పటికీ అవకాశం అందిపుచ్చుకోవడమే కాదు, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ధైర్యం కూడా ఉండాలి అని చెప్పే ఈ సినిమా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి. -
ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి థియేటర్లలో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో పాటు కేజేక్యూ, అనకాపల్లి, అమ్మ నాకు అబ్బాయి కావాలి అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. అలానే లోకేశ్ కనగరాజ్ హీరోగా పరిచయమవుతున్న 'డిసి', మాధవన్ 'జీడీ నాయుడు' లాంటి డబ్బింగ్ చిత్రాలు రాబోతున్నాయి. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా దూకుడు రీ రిలీజ్ (ఆగస్టు 09) కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ చాలానే క్రేజీ సినిమాలు రాబోతున్నాయి. జాబితాలో దాదాపు 23 వరకు మూవీస్, సిరీస్‌లు ఉన్నాయి. వాటిలో లెనిన్, హృదయం మురళి (ఇదయం మురళి), వంద దేవుళ్లు (నూరు సామి), మై వాసప్ ఆవుంగా లాంటి హిట్స్ ఉన్నాయి. వీటికి తోడు ఆపరేషన్ సఫేద్ సాగర్, వదంది 2 లాంటి డబ్బింగ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 03 నుంచి 09 వరకు)జీ5లెనిన్ (తెలుగు మూవీ) - ఆగస్టు 07వంద దేవుళ్లు (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07తుంబడ్ చీ మంజులా (మరాఠీ మూవీ) - ఆగస్టు 07అమెజాన్ ప్రైమ్ఈవిల్ డెడ్ బర్న్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 04 (రెంట్)స్టెర్లింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05వదంది 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07నెట్ఫ్లిక్స్బ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 04బిగ్ చికెన్: ఏ ఫాస్ట్‌ఫుడ్ కాన్సిపరసీ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 05ఇన్సైడ్ ద ట్రస్టెడ్ స్కాండల్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 05మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 06ఇదయం మురళి (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 07ఆపరేషన్ సఫేద్ సాగర్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ఆగస్టు 07ద లాస్ట్ హౌస్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 07మై వాపస్ ఆవుంగా (హిందీ సినిమా) - ఆగస్టు 07రికీ గెర్వైస్ ఆలే క్యాట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07అవర్ స్టిక్కీ లవ్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 07డెత్ ఇంక్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 07ద రిబ్బన్ హీరో (జపనీస్ ఏనిమే మూవీ) - ఆగస్టు 08హాట్స్టార్ఉయిర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 04ద షార్డ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 05ద సూపర్ మారియో గెలక్సీ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 07మనోరమ మ్యాక్స్కాట్టలన్ (మలయాళ మూవీ) - ఆగస్టు 07ఆపిల్ టీవీ ప్లస్టెడ్ లాసో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 04(ఇదీ చదవండి: తెలుగులో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా) -
ఓటీటీకి వంద దేవుళ్లు.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వంద దేవుళ్లు’. ఈ మూవీకి శశి దర్శకత్వం దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య జూన్ 19న రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. బిచ్చగాడు కాంబో రిపీట్ అయిన అంతగా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం బాగుందనే ప్రశంసలు దక్కించుకుంది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మూవీ రైట్స్‌ను జీ5 దక్కించుకోగా.. స్ట్రీమింగ్ తేదీని కూడా ఖరారు చేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్ షేర్ చేసింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది.వంద దేవళ్లు కథేంటంటే..పాతికేళ్ల వయసులోనే వాసవి(శ్వాసిక) భర్తను కోల్పోతుంది. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కదు. మరోవైపు మగ దిక్కులేని ఆడదనే అలుసుతో వంకర బుద్ది ఉన్న మగాళ్లంతా ఆమె గురించి మరోలా మాట్లాడతారు. అర్థరాత్రి ఇంట్లో లైట్ వెలిగినా అనుమానిస్తారు. ఇవన్నీ భరిస్తూ ఇద్దరు కొడుకులు భాస్కర్(అజయ్ దిషాన్), వివేక్ (శక్తి)లను పెంచి పెద్ద చేస్తుంది. భాస్కర్ బీటెక్ చేస్తున్న సమయంలోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది వాసవి. ఈ విషయాన్ని స్కూల్ మాస్టర్ ద్వారా కొడుకులను చెప్పిస్తుంది. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇద్దరు కొడుకులు స్వాగతించారా లేదా? 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోతుందనే విషయం తెలిసిన తర్వాత బంధువులు, సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాసవి జీవితంలోకి ఏడు కొండలు(విజయ్ ఆంటోనీ) వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు వాసవి మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. An emotional family entertainer is ready to warm your heart...❤️🔥Family blockbuster of the year #NooruSaami premieres on August 7th on Tamil Zee5.❤️@vijayantony #Sasi @vijayantonyfilm @AJDhishan990 #Swasika @karunaasethu @jose_lijomol @Sakthi_Raj7 #BalajiSakthivel @kavyaanil_… pic.twitter.com/WT3yOeUIH9— Zee 5 Tamil (@ZEE5Tamil) July 31, 2026 -
ఓటీటీలోకి ‘వంద దేవుళ్లు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వంద దేవుళ్లు’. బిచ్చగాడు ఫేం శశి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య జూన్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మంచి వసూళ్లతో పాటు ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం బాగుందనే ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. విజయ్ ఆంటోని బర్త్‌డే సందర్భంగా ఈరోజు(జులై 24) ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలను పంచుకుంది. ఆగస్టులో తమ ప్లాట్ఫామ్లో ఓటీటీ ప్రీమియర్ కానుందని జీ5 తెలుగు ప్రకటించింది.అధికారిక స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.వంద దేవళ్లు కథేంటంటే..పాతికేళ్ల వయసులోనే వాసవి(శ్వాసిక) భర్తను కోల్పోతుంది. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కదు. మరోవైపు మగ దిక్కులేని ఆడదనే అలుసుతో వంకర బుద్ది ఉన్న మగాళ్లంతా ఆమె గురించి మరోలా మాట్లాడతారు. అర్థరాత్రి ఇంట్లో లైట్ వెలిగినా అనుమానిస్తారు. ఇవన్నీ భరిస్తూ ఇద్దరు కొడుకులు భాస్కర్(అజయ్ దిషాన్), వివేక్ (శక్తి)లను పెంచి పెద్ద చేస్తుంది. భాస్కర్ బీటెక్ చేస్తున్న సమయంలోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది వాసవి. ఈ విషయాన్ని స్కూల్ మాస్టర్ ద్వారా కొడుకులను చెప్పిస్తుంది. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇద్దరు కొడుకులు స్వాగతించారా లేదా? 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోతుందనే విషయం తెలిసిన తర్వాత బంధువులు, సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాసవి జీవితంలోకి ఏడు కొండలు(విజయ్ ఆంటోనీ) వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు వాసవి మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఒక్క క్లిక్‌తో ఐదు సినిమాల రివ్యూస్.. ఈ వారం హిట్ బొమ్మ ఏది?
ఈ వారం టాలీవుడ్లో అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీతో పాటు పదేళ్ల గ్యాప్ తర్వాత వడ్డే నవీన్ హీరోగా నటించిన ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’కూడా ఉంది. వీటితో పాటు యంగ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన లవ్‌స్టోరీ ‘దీవాన’, ‘బిచ్చగాడు’ఫేం విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’, మలయాళ మూవీ ‘బాలన్-ది బాయ్’ సినిమాలు కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాల కథేంటి? ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటి? పూర్తి రివ్యూస్‌ని ఒక్క క్లిక్‌తో చదివేయండి.1) ‘మా ఇంటి బంగారం’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి2) ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి3) ‘బాలన్- ది బాయ్’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి4) ‘దీవాన’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి5) ‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘వంద దేవుళ్లు’ మూవీ రివ్యూ
టైటిల్: వంద దేవుళ్లునటీనటులు: విజయ్ ఆంటోనీ, శ్వాసిక, అజయ్ దిషాన్, లిజోమోల్ జోసే, కరుణాస్ తదితరులునిర్మాణ సంస్థ:విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్నిర్మాత:రామాంజనేయులు జవ్వాజిదర్శకత్వం: శశిసంగీతం: బాలాజీ శ్రీరామ్సినిమాటోగ్రపీ: ఎస్బీ దర్శన్ కిర్లోష్ఎడిటర్: హరీష్ యువరాజ్విడుదల తేది: జూన్ 19, 2026‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటించిన ప్రతి చిత్రం తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. అలా రిలీజ్ అయిన కొత్త చిత్రమే ‘వంద దేవుళ్లు’. బిచ్చగాడు ఫేం శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే ట్రైలర్‌ని కట్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. ఇలా భారీ అంచనాలతో నేడు(జూన్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. పాతికేళ్ల వయసులోనే వాసవి(శ్వాసిక) భర్తను కోల్పోతుంది. దీంతో ఇద్దరు పిల్లలకు అన్నీ తానై పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత కుటుంబం నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కదు. మరోవైపు మగ దిక్కులేని ఆడదనే అలుసుతో వంకర బుద్ది ఉన్న మగాళ్లంతా ఆమె గురించి మరోలా మాట్లాడతారు. అర్థరాత్రి ఇంట్లో లైట్ వెలిగినా అనుమానిస్తారు. ఇవన్నీ భరిస్తూ ఇద్దరు కొడుకులు భాస్కర్(అజయ్ దిషాన్), వివేక్ (శక్తి)లను పెంచి పెద్ద చేస్తుంది. భాస్కర్ బీటెక్ చేస్తున్న సమయంలోనే మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన చేస్తుంది వాసవి. ఈ విషయాన్ని స్కూల్ మాస్టర్ ద్వారా కొడుకులను చెప్పిస్తుంది. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఇద్దరు కొడుకులు స్వాగతించారా లేదా? 42 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోతుందనే విషయం తెలిసిన తర్వాత బంధువులు, సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాసవి జీవితంలోకి ఏడు కొండలు(విజయ్ ఆంటోనీ) వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరకు వాసవి మళ్లీ పెళ్లి చేసుకుందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..చిన్న వయసులోనే పెళ్లి, పిల్లలు.. సంసార జీవితం ఆస్వాదించే వయసుకొచ్చేసరికే భర్తను కోల్పోవడం.. తర్వాత పిల్లలే ప్రపంచంగా బతికే ఓ తల్లి కథ ఇది. కాలం మారినా ఇప్పటికీ కొన్ని కట్లుబాట్లు మాత్రం మారడం లేదు. చిన్న వయసులో భర్తను కోల్పోయిన ఒక మహిళకు ‘వితంతువు’ అనే శిక్ష వేసి జీవితాంతం బంధీగానే ఉంచేస్తుంది ఈ సమాజం. భార్యను కోల్పోయిన భర్త మళ్లీ పెళ్లి చేసుకోవడం సులభం కానీ భర్తను కోల్పోయిన ఒక మహిళ మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇప్పటికీ అంత ఈజీ కాదు. మగాళ్లతో పాటు తోటి ఆడవాళ్లు కూడా అదేదో పెద్ద తప్పుగానే భావిస్తున్నారు. మళ్లీ పెళ్లి అంటే కేవలం శారీరక సుఖం కోసమే అన్నట్లుగా చూస్తున్నారు. అదొక్కటే కాదు శారీరక అవసరాలతో పాటు ప్రతి ఒక్కరికి ఒక తోడు అవసరం అని చాట చెప్పిన సినిమా వంద దేవుళ్లు. సినిమా చూస్తున్నప్పుడు ఎంతో మంది అమ్మల జీవితాలు మన కళ్లముందు మెదలుతాయి. ఇదే కాన్సెప్ట్‌తో దాదాపు 30 ఏళ్ల కిత్రం ‘మా నాన్నకు పెళ్లి’ అనే సినిమా వచ్చింది. అందులో హీరో శ్రీకాంత్ వాళ్ల నాన్న కృషం రాజుకు మళ్లీ పెళ్లి చేయాలని భావిస్తాడు. ఇందులో హీరో అజయ్ దిషాన్ తన తల్లికి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే కథ-కథనం విషయంలో మాత్రం చాలా తేడానే ఉంది. ఈ సినిమాలో చాలా సున్నితమైన అంశాలను చర్చించారు. పాతికేళ్ల వయసులోనే భర్తను కోల్పోతే.. ఆ మహిళ జీవితాంతం ఒంటరిగానే ఉండాలా? ఆమెకు కూడా శారీరక అవసరాలు ఉంటాయి కదా? దాన్ని ఎందుకు తప్పుగా చూస్తారు? తోడు వెతుక్కుంటే తప్పేంటి? అనే అంశాలను ఇక్కడ చాలా సహజంగా చర్చించారు. ‘నేను కూడా అందరిలాగానే ఉప్పుకారం తింటున్నాను కదా? నాకు కూడా కూడా కోరికలు ఉండవా?’ అని ప్రారంభంలోనే అమ్మ పాత్రతో చెప్పించి, అసలు కథను ప్రారంభించాడు. పిల్లలు పెద్దయిన తర్వాత తల్లికి మళ్లీ పెళ్లి ఆలోచన రావడం.. ఒక కొడుకు ప్రేమతోనూ, మరొక కొడుకు పెళ్లితోనూ ఆ పెళ్లిని ముడి పెడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగినా.. సెకండాఫ్ మాత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఏడు కొండలు పాత్ర ఎంట్రీ తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. యూట్యూబ్ కంటెంట్ నేపథ్యంలోని సన్నివేశాలూ నవ్విస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే చిన్న ట్విస్ట్ బాగుంటుంది. ఇలాంటి సందేశాత్మక చిత్రాలకు అలాంటి క్లైమాక్స్ ఊహించలేం. ఎవరెలా చేశారంటే..విజయ్ ఆంటోనీ మరోసారి తన నటనతో పాత్రలో జీవించేశారు. హీరోయిన్ శ్వాసిక తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే ఎస్బీ దర్శన్ కిర్లోష్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ పరంగా రిచ్‌గా అనిపించింది. బాలాజీ శ్రీరామ్ నేపథ్యం సంగీతం ఫర్వాలేదు. హరీష్ యువరాజ్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)
-
'బిచ్చగాడు' కంటే 'వంద దేవుళ్ళు' పెద్ద హిట్ అవ్వాలి: నిహారిక
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం 'వంద దేవుళ్ళు'. విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ప్రధాన పాత్రలు పోషించారు. 'బిచ్చగాడు' తరువాత దర్శకుడు శశితో విజయ్ ఆంటోని చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారమే (జూన్ 19) రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి మెగా ప్రొడ్యూసర్ నిహారిక అతిథిగా విచ్చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)నిహారిక మాట్లాడుతూ .. 'వంద దేవుళ్ళు' సినిమాని ఇప్పటికే చూశాను. డైరెక్టర్ శశి తీసిన 'శ్రీను' చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయన 'బిచ్చగాడు' లాంటి గొప్ప మూవీ తీశారు. ప్రతి ఒక్కరూ హార్ట్ పెట్టి మూవీకి పనిచేసినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి అయితే, పిల్లల్ని కంటే అమ్మాయి అమ్మగా మారిపోతుంది. అయితే అమ్మలోనూ అమ్మాయి ఉంటుంది. అదే పాయింట్‌ను గొప్పగా చూపించారు. అమ్మ ఉన్న ప్రతిఒక్కరూ 'వంద దేవుళ్ళు' చూడాలి. 'బిచ్చగాడు' కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పింది.విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. 'శశి.. 20 ఏళ్ల నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం 'బిచ్చగాడు'తో హీరోగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ 'వంద దేవుళ్ళు' అంటూ మేం రాబోతోన్నాం. శశి నాకు ఈ కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుందని అన్నారు.(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది) -
'నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవర్రా?'.. ఫుల్ ఎమోషనల్‌గా ట్రైలర్
బిచ్చగాడు మూవీతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈ మూవీ ప్రేక్షకులను ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఇప్పుడు మళ్లీ అదే కాంబో అలరించేందుకు వస్తోంది. వంద దేవుళ్లు పేరుతో మరోసారి అమ్మ ప్రేమ, సెంటిమెంట్ చూపించేందుకు వచ్చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి శశి దర్శకత్వం వహించారు. మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే మధ్య తరగతి కుటుంలాల జీవితం నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బిచ్చగాడులానే అమ్మ సెంటిమెంట్ ఉండనుందని టీజర్లోనే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని సర్వంత్ రామ్ క్రియేషన్స్, రామాంజనేయులు జవ్వాజి ప్రొడక్షన్స్, విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాకు బాలాజీ శ్రీరామ్ సంగీతం సమకూర్చారు.


