'బిచ్చగాడు' కంటే 'వంద దేవుళ్ళు' పెద్ద హిట్ అవ్వాలి: నిహారిక | Vanda Devullu Movie Pre Release Event Niharika Speech | Sakshi
Sakshi News home page

'బిచ్చగాడు' కంటే 'వంద దేవుళ్ళు' పెద్ద హిట్ అవ్వాలి: నిహారిక

Jun 15 2026 6:50 PM | Updated on Jun 15 2026 7:55 PM

Vanda Devullu Movie Pre Release Event Niharika Speech

విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం 'వంద దేవుళ్ళు'. విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ప్రధాన పాత్రలు పోషించారు. 'బిచ్చగాడు' తరువాత దర్శకుడు శశితో విజయ్ ఆంటోని చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారమే (జూన్ 19) రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి మెగా ప్రొడ్యూసర్ నిహారిక అతిథిగా విచ్చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. కుర్చీ కోసం కొట్లాట)

నిహారిక మాట్లాడుతూ .. 'వంద దేవుళ్ళు' సినిమాని ఇప్పటికే చూశాను. డైరెక్టర్ శశి తీసిన 'శ్రీను' చూసి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయన 'బిచ్చగాడు' లాంటి గొప్ప మూవీ తీశారు. ప్రతి ఒక్కరూ హార్ట్ పెట్టి మూవీకి పనిచేసినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి అయితే, పిల్లల్ని కంటే అమ్మాయి అమ్మగా మారిపోతుంది. అయితే అమ్మలోనూ అమ్మాయి ఉంటుంది. అదే పాయింట్‌ను గొప్పగా చూపించారు. అమ్మ ఉన్న ప్రతిఒక్కరూ 'వంద దేవుళ్ళు' చూడాలి. 'బిచ్చగాడు' కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని చెప్పింది.

విజయ్ ఆంటోని మాట్లాడుతూ .. 'శశి.. 20 ఏళ్ల నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశారు. పదేళ్ల క్రితం 'బిచ్చగాడు'తో హీరోగా నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ 'వంద దేవుళ్ళు' అంటూ మేం రాబోతోన్నాం. శశి నాకు ఈ కథ చెప్పిన తరువాత నేను ఎంతో ఏడ్చేశాను. నాకు కన్నీళ్లు మాత్రం ఆగలేదు. నా పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుందని అన్నారు.

(ఇదీ చదవండి: వైరల్ 'చికిరి చికిరి' ఫుల్ వీడియో వచ్చేసింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement