కత్రినా కైఫ్‌తో ఎంగేజ్‌మెంట్.. నవ్వొస్తుందన్న విక్కీ కౌశల్‌

Vicky Kaushal Reaction on Engagement Rumours With Katrina Kaif - Sakshi

టాలెంటెడ్‌ యాక్టర్‌గా బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న కొద్దిమందిలో ఒకరు విక్కీ కౌశల్‌. ఆయన నటి కత్రినా కైఫ్‌తో డేటింగ్‌ చే​స్తున్నాడని ఎప్పుటి నుంచో రూమర్స్‌ వినిపిస్తుండగా.. ఇటీవల ఏకంగా వారు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారని ప్రచారం ఊపందుకుంది.  ఈ కుర్ర హీరో తాజా చిత్రం ‘సర్దార్ ఉద్ధం’ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్‌లో విడుదలై మంచి విజయాన్ని టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ తరుణంలో ఇచ్చిన ఇంటర్వూలో ఈ రూమర్స్‌ పై ఆయన స్పందించాడు.

విక్కీ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘క్యాట్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని రూమర్స్‌ ఆ రోజు ఉదయం వచ్చాయి. అప్పుడు షూట్‌ మధ్యలో ఉన్నాను. మళ్లీ సాయంత్రానికి చూస్తే అవన్నీ వట్టి పుకార్లేనని మీడియాలో వార్తలు వచ్చాయి. నిజా నిజాలేంటో తెలిసిపోవడంతో వాటి స్పందించలేదని’ తెలిపాడు. ఇలాంటి గాసిప్స్‌ విన్నప్పుడు నవ్వుకుని, పనిలో పడిపోతుంటానని ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ నటుడు చెప్పాడు. అయితే ఇటీవల ‘సర్దార్‌ ఉద్దం’ సినిమా స్పెషల్‌ స్కినింగ్‌ సమయంలో వీరిద్దరూ టైట్‌ హగ్‌ చేసుకున్న వీడియో నెట్టింట హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే.

చదవండి: విక్కీతో క‌త్రినా టైట్ హ‌గ్‌.. వీడియో వైర‌ల్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top