వేట్టయాన్‌ కలెక్షన్స్‌.. 18 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే | Vettaiyan Movie 18 Days Box Office Collection | Sakshi
Sakshi News home page

వేట్టయాన్‌ కలెక్షన్స్‌.. 18 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే

Oct 28 2024 3:40 PM | Updated on Oct 28 2024 3:50 PM

Vettaiyan Movie 18 Days Box Office Collection

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘వేట్టయాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో సత్తా చాటుతుంది. 18 రోజులకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 420 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టిందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ ఇంతటి కలెక్షన్స్‌ రావడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. అక్టోబర్‌ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రాన్ని TJ జ్ఞానవేల్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఈ సినిమాలో మంజు వారియర్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా దగ్గుబాటి, కిశోర్‌, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజయ్‌, రోహిణి ముఖ్యపాత్రల్లో కనిపించారు. అనిరుధ్‌ రవిచందర్‌  సంగీతం అందించారు.

వేట్టయాన్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నాలుగో వారంలో అడుగుపెట్టింది. ఇప్పుడు కూడా భారత్‌లో రోజుకు రూ. 2 కోట్ల కలెక్షన్స్‌ వేట్టయాన్‌ రాబడుతుంది. అయితే, ఓవర్సీస్‌లో ఎక్కువగా ఈ మూవీ సత్తా చాటుతుంది. కేవలం భారత్‌లో రూ. 200 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టి.. ప్రపంచవ్యాప్తంగా రూ. 420 కోట్ల మార్క్‌ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. జైలర్‌ సినిమా అంతటి పాజిటివ్‌ టాక్‌ వేట్టయాన్‌కు రాలేదు. అయినా, కలెక్షన్స్‌ పరంగా మెరుగ్గానే రాబడుతుంది.

వేట్టైయన్ నవంబర్ 7న ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేరకు అన్ని భాషలలో డిజిటల్‌ హక్కులను రూ. 90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement