సమంత పోస్ట్‌పై వెంకటేశ్‌ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్‌ | Venkatesh Daughter Ashritha Interesting Comments On Samantha Painting Post | Sakshi
Sakshi News home page

ChaySam Divorce: సమంత పోస్ట్‌పై వెంకటేశ్‌ కూతురు అశ్రిత ఆసక్తికర కామెంట్‌

Oct 28 2021 8:11 PM | Updated on Oct 29 2021 7:33 AM

Venkatesh Daughter Ashritha Interesting Comments On Samantha Painting Post - Sakshi

నాగ చైతన్యతో విడిపోయినప్పటీ నుంచి సమంత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. విడాకుల ప్రకటన అనంతరం తను ఏం చెప్పాలనుకున్నా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారానే మాట్లాడుతున్నారు. ఇక తన బాధను, భావోద్యేగాలను సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పింది అనే హ్యాష్‌ ట్యాగ్‌ ద్వారా తన ప్రస్తుత కండిషన్‌ను చెప్పే ప్రయత్నం చేస్తున్నారామే. దీంతో​ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ప్రతి పోస్ట్‌ చర్చనీయాంశం అవుతుంది. అంతేగాక తన నెక్ట్‌ పోస్ట్‌ ఏంటీ,  ఈ సారి ఆమె ఎలా స్పందించబోతున్నారా? అని ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌లో కూడా ఆసక్తి నెలకొంది.

చదవండి: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్‌ ఆసక్తికర పోస్ట్‌

ఇదిలా ఉంటే ఇటీవల ఆమె తన స్నేహితురాలు, మోడల్‌ శిల్పారెడ్డితో ఛార్‌ధామ్ యాత్ర అనంతరం సమంత.. కూతుళ్ల పెళ్లి విషయంలో తల్లిదండ్రులు ఎలా ఆలోచించాలనే విషయాన్ని చెబుతూ ఓ పోస్ట్‌ షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనితో పాటు ఆమె పెయింటింగ్‌ వేస్తున్న ఫొటోను కూడా పంచుకున్నారు. ఇక తన పోస్ట్‌పై హీరో వెంకటేశ్‌ పెద్ద కూతురు అశ్రిత స్పందించడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే చై-సామ్‌ విడాకుల ప్రకటన అనంతరం దీనిపై నాగార్జున మినహా అక్కినేని కుటుంబ సభ్యులు కానీ ఇటూ దగ్గుబాటి కుటుంబంలో వెంకటేశ్‌ తప్పా ఎవరూ స్పందించలేదు. అంతేగాక సమంత పెట్టే సోషల్‌ మీడియా పోస్టులను కూడా చూసి చూడనంటూ వదిలేస్తున్నారు.

చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్‌ చెఫ్‌ నిర్వాహకులు

కానీ అశ్రిత తొలిసారిగా సామ్‌ పోస్ట్‌పై స్పందించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సమంత షేర్‌ చేసిన తన పెయింటింగ్‌ ఫొటోపైనామె ఆసక్తికరంగా కామెంట్‌ చేశారు. దీంతో ఇది చర్చకు దారి తీసింది. అసలు అశ్రిత ఏమని స్పందించారంటే.. ‘ఇక నువ్వు స్వేచ్ఛగా పెయింటింగ్ వేసుకోవచ్చు’ అంటూ కామెంట్ చేశారు. అశ్రిత కామెంట్‌ చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆమె కామెంట్‌లో మరెదో ఆంతర్యం ఉందని, చై-సామ్‌ విడాకుల విషయంలో అశ్రిత హర్ట్‌ అయినట్టు కనిపిస్తోందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పోస్టుపై పలువురు సినీ సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. దీనిపై మంచు లక్ష్మి స్పందిస్తూ.. ‘నిన్ను ఇలా సరదాగా చూడటం సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement