రెండు భాగాలుగా ‘వీడీ 12’.. టార్గెట్‌ ఫిక్స్‌! | VD 12: Gowtam Tinnanuri, Vijay Devarakonda Movie Latest Update | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: రెండు భాగాలుగా ‘వీడీ 12’.. టార్గెట్‌ ఫిక్స్‌!

Sep 22 2024 1:33 PM | Updated on Sep 22 2024 1:58 PM

VD 12: Gowtam Tinnanuri, Vijay Devarakonda Movie Latest Update

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘వీడీ 12’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూట్‌ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. విజయ్‌ పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను నవంబరు కల్లా పూర్తి చేయాలని విజయ్‌ దేవరకొండ టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకున్నారట.

(చదవండి: ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నా.. కానీ ఇప్పుడు చెబుతున్నా)

 ఇందుకు తగ్గట్లుగా చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేసిందని సమాచారం. ఇక ఈ సినిమా టైటిల్‌పై ఈ దసరా పండగ సమయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ స్పెగా కనిపిస్తారని, ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే చాన్స్‌ ఉందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 25న చిత్రం రిలీజ్‌ కానుంది. 

(చదవండి: మూడు నెలల పాటు షూటింగ్స్ కు దూరంగా ఎన్టీఆర్‌.. కారణం ఇదే!)

అలాగే రాహుల్‌ సంకృత్యాన్, రవి కిరణ్‌ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్‌ దేవరకొండ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సినిమాల చిత్రీకరణను త్వరలోనే ప్రారంభించాలనుకుంటున్నారట. ఈ సినిమాల్లోని క్యారెక్టర్స్‌ కోసం విజయ్‌ మేకోవర్‌ కావాల్సి ఉంది. అందుకే ‘వీడీ 12’ సినిమా చిత్రీకరణను తొందరగా పూర్తి చేసి, తన తర్వాతి సినిమాలపై ఫోకస్‌ పెట్టాలని విజయ్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement