‘కమిటీ కుర్రోళ్ళు’ చూసి ఏడ్చాను : వరుణ్‌ తేజ్‌ | Varun Tej Talk About Committee Kurrollu Movie At Pre Release Event | Sakshi
Sakshi News home page

‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: వరుణ్‌ తేజ్‌

Aug 7 2024 11:22 AM | Updated on Aug 7 2024 11:38 AM

Varun Tej Talk About Committee Kurrollu Movie At Pre Release Event

‘‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చూశాను. చాలా బాగుంది. నాకు పాత రోజులు గుర్తొచ్చాయి.. చాలా చోట్ల కన్నీళ్లు పెట్టుకున్నాను. ప్రేక్షకులకు కూడా అలాంటి అనుభూతి కలుగుతుందనిపిస్తోంది. ఇంతమంది ప్రతిభ ఉన్న నటీనటులను ఇండస్ట్రీకి అందిస్తున్న మా చెల్లి నిహారికను చూస్తుంటే గర్వంగా ఉంది’’ అని హీరో వరుణ్‌ తేజ్‌ అన్నారు. 

నూతన నటీనటులతో యదు వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 9న విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హీరోలు వరుణ్‌ తేజ్, సాయి దుర్గ తేజ్, అడివి శేష్, దర్శకుడు వెంకీ అట్లూరి అతిథులుగా హాజరయ్యారు. 

సాయి దుర్గ తేజ్‌ మాట్లాడుతూ– ‘‘కమిటీ కుర్రోళ్ళు’ టైటిల్‌ విన్నప్పుడే నాకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. ట్రైలర్‌ చాలా నచ్చింది’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం ట్రైలర్‌ చూడగానే ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది’’ అన్నారు అడివి శేష్‌. 

Advertisement
 
Advertisement
Advertisement