గాండీవధారి అర్జున ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఫిక్స్‌.. ఆ పండగకు! | Varun Tej Gandeevadhari Arjuna Movie OTT Release Platform Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Gandeevadhari Arjuna In OTT: ఆ ఓటీటీలో రానున్న గాండీవధారి అర్జున.. పండగ రోజే రిలీజ్‌!

Aug 26 2023 11:29 AM | Updated on Aug 26 2023 12:09 PM

Varun Tej Gandeevadhari Arjuna OTT Platform Confirmed - Sakshi

ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది. యాక్షన్‌ సీన్స్‌, తల్లి సెంటిమెంట్‌ బాగున్నాయంటున్నారు. ఇకపోతే ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ

ఈ మధ్య మెగా హీరోలకు ఏదీ కలిసి రావడం లేదు. చిరంజీవి భోళా శంకర్‌, పవన్‌ కల్యాణ్‌ బ్రో సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా చతికిలపడ్డాయి. తాజాగా ఇదే బాటలోకి వచ్చేట్లు కనిపిస్తోంది. వరుణ్‌ తేజ్‌ గాండీవధారి అర్జున. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో నుంచే ఈ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అవుతోంది. సాధారణ వసూళ్లు రాబట్టడం కూడా కష్టమే అనిపిస్తోంది. దీంతో ఈ సినిమా సైతం అట్టర్‌ ఫ్లాప్‌ దిశగా అడుగులు వేస్తోంది. 

అయితే ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది. యాక్షన్‌ సీన్స్‌, తల్లి సెంటిమెంట్‌ బాగున్నాయంటున్నారు. ఇకపోతే ఈ చిత్ర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఈ సినిమాను నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్‌ చేయాలనుకున్నారు. అయితే థియేటర్ల వద్ద పెద్దగా ఆదరణ లేకపోవడంతో ఈ  వినాయక చవితి (సెప్టెంబర్‌ 19న)కి ఓటీటీలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. 

వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటించిన గాండీవధారి అర్జున సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా మెప్పించింది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాజర్‌, విమలా రామన్‌, వినయ్‌ రాయ్‌, రోషిణి, అభినవ్‌ గోమతం తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మిక్కీజే మేయర్‌ సంగీతం అందించాడు.

చదవండి: సిగరెట్‌, గంజాయి.. ఊహించనన్ని చెడు అలవాట్లు, నాన్న జేబులో డబ్బులు కొట్టేసేవాడిని.. కొట్టడం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement