Samantha: సమంతను కాపాడిన బాలీవుడ్‌ హీరో.. వీడియో వైరల్‌

Varun Dhawan Protects Samantha From Paparazzi, Watch Video - Sakshi

బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌, సమంత తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. సిటడెల్‌ అనే వెబ్‌సిరీస్‌ కోసం వీరిద్దరూ జత కడుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ టీం గత రాత్రి సమావేశమాయ్యారు. మీటింగ్‌ అనంతరం సమంత, వరుణ్‌ తిరిగి వెళ్లిపోతున్న సందర్భంలో ఫోటో జర్నలిస్టులు తెగ హడావిడి చేశారు. ఫోటోల కోసం చుట్టుముట్టడంతో ఆ ఫోటోగ్రాఫర్ల నుంచి వరుణ్‌ సమంతను కాపాడారు.

'ఎందుకు అలా ఆమెను భయపెడతున్నారు? భయపెట్టకండి' అంటూ సరదాగా కామెంట్‌ చేశాడు. దగ్గరుండి సమంతను కారు ఎక్కించాడు. కాగా ప్రముఖ హాలీవుడ్‌ సిరీస్‌ సిటడెల్‌కు ఇండియన్‌ వెర్షన్‌లో ఓ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. రాజ్‌ అండ్‌ డీకేలు దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా పాపులర్‌ అయిన సమంత ఇప్పుడు సిటడెల్‌తో మరింత దగ్గర కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top