బాలీవుడ్‌లోకి కీర్తీ సురేష్‌.. దర్శకుడిగా అట్లీ | Varun Dhawan And Keerthy Suresh New Movie Directed By Atlee, Resumes Shooting At Mumbai - Sakshi
Sakshi News home page

Keerthy Suresh-Varun Dhawan: బాలీవుడ్‌లోకి కీర్తీ సురేష్‌.. దర్శకుడిగా అట్లీ

Published Mon, Sep 25 2023 4:16 AM

Varun Dhawan, Keerthy Suresh new movie shooting at mumbai - Sakshi

వరుణ్‌ ధావన్‌ హీరోగా తమిళ దర్శకుడు కాలిస్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, వామికా హీరోయిన్స్‌గా నటిస్తున్నారని బాలీవుడ్‌ సమాచారం. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ ముంబైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ అక్టోబరు రెండో వారం వరకూ సాగుతుందట.

వరుణ్, కీర్తీ కాంబోలో కొన్ని భావోద్వేగ సన్నివేశాలతో పాటు, వరుణ్‌తో ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేశారట కాలిస్‌. కీర్తీసురేష్‌కు బాలీవుడ్‌లో ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. అయితే అట్లీ దర్శకత్వంలోని తమిళ హిట్‌ ‘తేరీ’ హిందీ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్‌ కూడా బాలీవుడ్‌లో విని పిస్తోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement