
తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే నటి వరలక్ష‍్మి శరత్ కుమార్ ఇప్పుడు కొత్త జర్నీ మొదలుపెట్టింది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్.. రీసెంట్ టైంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మూవీస్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా దర్శకురాలిగా, నిర్మాతగా మారిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు కొత్త చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 9 నుంచి మరో కామనర్ ఎలిమినేట్!)
తండ్రి శరత్ కుమార్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వరలక్ష‍్మీ.. 13 ఏళ్లుగా సినిమాలు చేస్తోంది. దక్షిణాదిలోని అన్ని బాషల్లోనూ నటించింది. ఈ ఏడాది నాలుగు చిత్రాలతో ప్రేక్షకులు ముందుకొచ్చింది. ఇప్పుడు సడన్‌గా 'సరస్వతి' అనే మూవీని ప్రకటించింది. ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వరలక్ష‍్మీ వ్యవహరించనుంది.
థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రంలో వరలక్ష‍్మీ, ప్రియమణి, ప్రకాశ్ రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. తమన్ సంగీతమందిస్తున్నాడు. చెల్లి పూజతో కలిసి వరలక్ష‍్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దోస డైరీస్ పేరుతో నిర్మాణ సంస్థని కూడా ప్రారంభించింది. గతేడాది నికోలాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈమె.. ఇప్పుడు దర్శకనిర్మాతగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి? వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రావొచ్చు.
(ఇదీ చదవండి: సినిమా వాళ్లని జగన్ అవమానించలేదు: ఆర్. నారాయణమూర్తి)
