ఒకే ఫ్రేములో టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌ | Vamshi Paidipally Birthday: Top Directors Attended | Sakshi
Sakshi News home page

Vamshi Paidipally: వంశీ బర్త్‌డే వేడుకల్లో దర్శకుల సందడి

Jul 28 2021 9:18 PM | Updated on Jul 28 2021 9:54 PM

Vamshi Paidipally Birthday: Top Directors Attended - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ, పరశురామ్‌, సుకుమార్‌, బోయపాటి శ్రీను, మెహర్‌ రమేశ్‌, కీర్తి సురేశ్‌, దిల్‌ రాజు- ఆయన భార్య, కార్తీ, అల్లు అరవింద్‌, సోనూసూద్‌ ఈ బర్త్‌డే వేడుకకు..

Vamshi Paidipally Birthday: టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌ అంతా ఒకచోట చేరితే ఎలా ఉంటుంది? అబ్బో, ఆ సందడే వేరంటారా? ప్రముఖ దర్శకులంతా కలిసి ఇప్పుడు అదే పని చేశారు! టాలెంటెడ్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి జూలై 25న పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా తన స్నేహితులతో పాటు ఇండస్ట్రీ సహచరులకు పార్టీ ఇచ్చాడు. ఈ క్రమంలో బర్త్‌డే వేడుకలకు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇందులో టాలీవుడ్‌ దర్శకులంతా కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ, పరశురామ్‌, సుకుమార్‌, బోయపాటి శ్రీను, మెహర్‌ రమేశ్‌, కీర్తి సురేశ్‌, దిల్‌ రాజు- ఆయన భార్య, కార్తీ, అల్లు అరవింద్‌, సోనూసూద్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ బర్త్‌డే వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి, పరశురామ్‌ సుకుమార్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, మెహర్ రమేశ్‌లు ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఇది కాస్త ఆలస్యంగా బయటకు రాగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement