Urvashi Rautela Charge Rs 2 Crore For 3 Minute Item Song in Waltair Veerayya - Sakshi
Sakshi News home page

Urvashi Rautela: వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్.. మూడు నిమిషాలకు రెండు కోట్లా..!

Jan 27 2023 5:02 PM | Updated on Jan 27 2023 5:42 PM

Urvashi Rautela charge Rs.2 crore for 3 minute item song in Waltair Veerayya - Sakshi

మెగాస్టార్​ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్ చిరు అభిమానులను ఊర్రూతలూగించింది. బాస్‌ పార్టీ సాంగ్ ఈ మూవీలో హైలెట్‌గా నిలిచింది. ఎందుకంటే ఆ సాంగ్‌లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా స్పెషల్‌ అట్రాక్షన్‌గా కనిపించింది. మెగాస్టార్‌తో కలిసి తన డ్యాన్స్‌తో అందరకొట్టింది బాలీవుడ్ భామ. అయితే ఈ సాంగ్‌కు ఆమె తీసుకున్న పారితోషికంపై నెట్టింట్లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. 

నటి ఊర్వశి రౌతేలా 'బాస్ పార్టీ' పాట కోసం భారీ మొత్తంలో వసూలు చేసిందని సమాచారం. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం మూడు నిమిషాల పాట కోసం ఆమె దాదాపు రూ.2 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో విలన్‌గా నటించిన ప్రకాష్ రాజ్ రూ.1.5 కోట్లు తీసుకోగా.. ఊర్వశి పారితోషికంపై నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. 

2023లోనే అత్యంత ఖరీదైన పాట?

వాల్తేరు వీరయ్య చిత్రంలోని ఊర్వశి, చిరంజీవీల 'బాస్ పార్టీ' పాట చిత్రీకరణకు రూ.30 కోట్లు ఖర్చయిందని వార్తలొచ్చాయి. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను నకాష్, అజీజ్, డీఎస్పీ, హరిప్రియ ఆలపించారు. కాగా.. తదుపరి ఊర్వశి రౌతేలా రామ్ పోతినేనితో కలిసి కనిపించనుంది. ఆమె 'ఇన్‌స్పెక్టర్ అవినాష్'లో రణదీప్ హుడా సహనటిగా కూడా నటించనుంది. ఆ తర్వాత మిచెల్ మోరోన్‌తో కలిసి హాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. గ్లోబల్ మ్యూజిక్ సింగిల్‌లో ఆమె జాసన్ డెరులోతో కలిసి కనిపించనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement