Urfi Javed Compares Her Style With Samantha For Wearing Transparent Outfit Goes Viral - Sakshi
Sakshi News home page

Urfi Javed: సమంతతో పోల్చుకున్న ఉర్ఫీ, ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం

May 5 2022 3:13 PM | Updated on May 5 2022 6:22 PM

Urfi Javed Compares Her Style With Samantha Ruth Prabhu For Wearing Transparent Outfit - Sakshi

సెలబ్రిటీలు ఏం చేసినా చెల్లుతుంది అనే కాలం కాదిది. వారి మాట, వ్యవహారం, తీరు అన్నింటినీ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు జనాలు. సెలబ్రిటీల వ్యవహారం ఏమాత్రం నచ్చకపోయినా సోషల్‌ మీడియా వేదికగా నోటికొచ్చినట్లు విమర్శిస్తారు. మరీ ముఖ్యంగా తారల డ్రెస్సింగ్‌ విషయంలో ఈ ట్రోలింగ్‌ విపరీతంగా ఉంటుంది. అందుకు బిగ్‌బాస్‌ ఓటీటీ భామ ఉర్ఫీ జావెద్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌ చాలా విభిన్నంగా ఉంటుంది. అందాల ఆరబోతకు పెద్దపీట వేసేలా దుస్తులు ధరిస్తుంటుంది. దీనివల్ల నిత్యం సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోందామె.

అయితే తనలా పలుచటి బట్టలు వేసుకున్నవారిని పొగిడి, తనను మాత్రం ఎందుకు తిడతారని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రశ్నించింది ఉర్ఫీ. 'పలుచని షర్ట్‌ వేసుకున్న సమంత ఈ లుక్‌లో ఇంటర్నెట్‌ టెంపరేచర్‌ పెంచేలా ఉంది' అని రాసిన వార్తను, 'దోమల జాలి కంటే పలుచని డ్రెస్‌ వేసుకున్న ఉర్ఫీ స్టైల్‌ దరిద్రంగా ఉందని జనాలు తిడుతున్నారు' అంటూ రాసి ఉన్న మరో వార్త స్క్రీన్‌షాట్లను పోస్ట్‌ చేసింది. నేనేం చెప్పాలనుకున్నానో మీకీపాటికే అర్థమై ఉంటుంది. సమంత అంటే నాకూ ఇష్టమే, నేను కేవలం పైన రాసి ఉన్న హెడ్‌లైన్స్‌ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అని చెప్పుకొచ్చింది. ఒకరిని పొగుడుతూ మరొకరిని మాత్రం ఎందుకు తిడతారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

చదవండి: ఉత్కంఠగా సమంత ‘యశోద’ మూవీ ఫస్ట్‌గ్లిం‍ప్స్‌

ఓటీటీలో పాన్‌ ఇండియా సినిమాల సందడి.. మేలో ఎన్ని చిత్రాలంటే..

Advertisement
 
Advertisement
Advertisement