మళ్లీ ఏ | Upendra A Kannada Movie Re Release | Sakshi
Sakshi News home page

మళ్లీ ఏ

Jun 8 2024 6:21 AM | Updated on Jun 8 2024 6:21 AM

Upendra A Kannada Movie Re Release

ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘ఏ’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. 1998లో దాదాపు రూ. 1 కోటీ 25 లక్షలతో రూపోందిన ఈ చిత్రం రూ. 20 కోట్లు వసూలు చేసింది. కొత్త తరహా రొమాంటిక్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపోందిన ఈ చిత్రంలో చాందినీ కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని తాజాగా 4కేలో ఉపేంద్ర ఉప్పి క్రియేషన్స్, లింగం యాదవ్‌ చందు ఎంటర్‌టైన్మెంట్‌ విడుదల చేయనున్నాయి. ఈ నెల 21న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది.

ఈ సందర్భంగా లింగం యాదవ్‌ మాట్లాడుతూ – ‘‘అప్పట్లో ‘ఏ’ ఒక సంచలనం. ఇప్పటికే కన్నడలో రీ రిలీజ్‌ అయిన ఈ చిత్రం అద్భుతమైన స్పందన రాబట్టింది. జూన్‌ 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేయనున్నాం. ఇక మేం 4కేలో విడుదల చేసిన ప్రభాస్‌ ‘ఛత్రపతి, యోగి’ చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ‘ఏ’కి కూడా మంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement