ఈ సంక్రాంతి మాకు కొత్త ఆరంభం: ఉపాసన స్పెషల్‌ పోస్ట్‌ | Sakshi
Sakshi News home page

Upasana Sankranti Wishes: ఈ సంక్రాంతి మాకు కొత్త ఆరంభం: ఉపాసన స్పెషల్‌ పోస్ట్‌

Published Sun, Jan 15 2023 11:51 AM

Upasana Shares a Special Post on Instagram Over Sankranti Festival - Sakshi

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మెగా కోడలు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన ఓ స్పెషల్‌ పోస్ట్‌ను షేర్‌ చేశారు. ఈ సంక్రాంతి తనకు చాలా ప్రత్యేకమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అలాగే తెలుగు ప్రజలకు, మెగా ఫ్యాన్స్‌కి ఆమె మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఉపాసన తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె మాతృత్వ క్షణాలను ఆస్వాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తనకు ఈ ఏడాది చాలా ముఖ్యమైందని చెప్పుకొచ్చారు.

చదవండి: తెలుగు ప్రజలకు చిరంజీవి సంక్రాంతి శుభాకాంక్షలు

‘ఈ సంక్రాంతి నాకు చాలా ప్రత్యేకం. ఎందుకుంటే ప్రస్తుతం నేను మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ దశను నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఇది మా అందరికి కొత్త ఆరంభం’ అంటూ ఉపాసన రాసుకొచ్చారు. కాగా 2012లో రామ్‌ చరణ్‌-ఉపాసనలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత చరణ్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. దీంతో రామ్‌ చరణ్‌ తండ్రి కాబోతుండటంతో మెగా ఫ్యాన్స్‌ అంతా ఫల్‌ ఖుషి అవుతున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement