తెలుగు ప్రజలకు చిరంజీవి సంక్రాంతి శుభాకాంక్షలు | Megastar Chiranjeevi Sankranti Wishes to Fans and Telugu People | Sakshi
Sakshi News home page

Chiranjeevi: తెలుగు ప్రజలకు చిరంజీవి సంక్రాంతి శుభాకాంక్షలు

Jan 15 2023 11:18 AM | Updated on Jan 15 2023 11:20 AM

Megastar Chiranjeevi Sankranti Wishes to Fans and Telugu People - Sakshi

తెలుగు ప్రజలకు, తన అభిమానులకు మెగాస్టార్‌ చిరంజీవి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నేడు మకర సంక్రాంతి సందర్భంగా చిరంజీవి ట్వీట్‌ చేశారు. ‘అందరికీ పచ్చ తోరణాల, ముంగిట ముగ్గుల, మకర సంక్రాంతి శుభాకాంక్షలు! సంవత్సరం పొడుగునా అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, పాడి పంటలు, భోగ భాగ్యాలు లోడింగ్‌ (LOADING) అవుతూనే ఉండాలి’ అని రాసుకొచ్చారు.

కాగా ఆయన నటించి లేటెస్ట్‌ మూవీ వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా శుక్రవారం విడుదలై థియేటర్లో సందడి చేస్తోంది. రిలీజ్‌ అయిన ఫస్ట్‌ షో నుంచే ఈ మూవీ హిట్‌టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాలో చిరు మాస్‌ లుక్‌, యాక్షన్‌ సీన్స్‌, కామెడీ ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. ఈ సినిమా చూసి అభిమానులంతా బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ చిరుకి థియేటర్లో నీరాజనాలు పలుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement