కొత్త వాళ్లను ప్రోత్సహించాలి | Unstoppable Movie Trailer Launch Event | Sakshi
Sakshi News home page

కొత్త వాళ్లను ప్రోత్సహించాలి

Jun 4 2023 6:21 AM | Updated on Jun 23 2023 6:12 PM

Unstoppable Movie Trailer Launch Event - Sakshi

‘‘జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డిగార్ల సినిమాల్లో తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్లీ ఇంతమందిని (దాదాపు 50 మంది) ఒక్క దగ్గరికి చేర్చి ‘అన్‌స్టాపబుల్‌’ లాంటి మంచి వినోదాత్మక సినిమా చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలని యువ దర్శకులు, నటులు ప్రోత్సహించాలి.. అప్పుడే చిత్ర పరిశ్రమకు కొత్త ప్రతిభ వస్తుంది’’ అని సీనియర్‌ నటుడు బ్రహ్మానందం అన్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా,  నక్షత్ర, అక్సాఖాన్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌ స్టాపబుల్‌’. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహించారు.

రజిత్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘అన్‌స్టాపబుల్‌’లో నటించిన వారందరూ ఒక బ్రహ్మానందం కావాలి’’ అన్నారు. ‘‘డైమండ్‌ రత్నబాబులాంటి దర్శకులు సక్సెస్‌ అయితే మాలాంటి వాళ్లకు మరిన్ని సినిమాలు వస్తాయి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ మూవీతో ప్రేక్షకులను నవ్విస్తాం’’ అన్నారు వీజే సన్నీ. ‘‘అన్‌స్టాపబుల్‌’ పై ఉన్న నమ్మకంతో రిలీజ్‌కి ముందే నాకు కారుని బహుమతిగా ఇచ్చారు నిర్మాత రజిత్‌ రావు’’ అన్నారు డైమండ్‌ రత్నబాబు. ‘‘ఫ్యామిలీతో చూసే చిత్రం ఇది’’ అన్నారు రజిత్‌ రావు.  

Advertisement
 
Advertisement
Advertisement