TV Actress Sunetra Pandit Injured In Road Accident - Sakshi
Sakshi News home page

Sunetra Pandit: రోడ్డు ప్రమాదంలో గాయపడిన బుల్లితెర నటి..

May 9 2022 3:48 PM | Updated on May 9 2022 4:18 PM

TV Actress Sunetra Pandit Injured In Road Accident - Sakshi

రోడ్డు గుంతల వల్ల బుల్లితెర నటి గాయపడింది. ఈ సంఘటన ఆదివారం (మే 8) బెంగళూరులో చోటుచేసుకుంది. టీవీ నటి సునేత్రా పండిట్‌ ఎన్‌ఆర్‌ కాలనీ 9వ రోడ్డులో స్కూటర్‌పై వెళ్తూ హంప్స్‌ వద్ద గుంతల్లో ప్రయాణిస్తూ అదుపుతప్పి కింద పడింది. ఆమె తల, చేతికి గాయాలు తగిలాయి. 

యశవంతపుర (కర్ణాటక): రోడ్డు గుంతల వల్ల బుల్లితెర నటి గాయపడింది. ఈ సంఘటన ఆదివారం (మే 8) బెంగళూరులో చోటుచేసుకుంది. టీవీ నటి సునేత్రా పండిట్‌ ఎన్‌ఆర్‌ కాలనీ 9వ రోడ్డులో స్కూటర్‌పై వెళ్తూ హంప్స్‌ వద్ద గుంతల్లో ప్రయాణిస్తూ అదుపుతప్పి కింద పడింది. ఆమె తల, చేతికి గాయాలు తగిలాయి. 

ఈ సంఘటనను గమనించిన స్థానికులు నటి సునేత్రా పండిట్‌ను వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా నటికి వైద్యులు సూచించారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు, కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు. బీబీఎంపీ అధికారులు తక్షణం గుంతల రోడ్లను సరిచేయాలని స్థానికులు కోరారు. సునేత్ర పండిట్‌ ప్రముఖ సీరియల్ 'సిల్లి లిల్లి'తో పాపులర్‌ అయింది. 

చదవండి: సంచలనాల 'లాకప్‌' షో విన్నర్‌ గెలుచుకుంది ఎంతో తెలుసా ?



Advertisement
 
Advertisement
Advertisement