Tv Actress Sreevani Recover From Rare Throat Disease - Sakshi
Sakshi News home page

Actress Sreevani: ఎట్టకేలకు మాట్లాడగలుగుతున్న నటి శ్రీవాణి

Aug 25 2022 10:02 PM | Updated on Aug 26 2022 8:28 AM

Tv Actress Sreevani Recover From Rare Disease - Sakshi

నెల రోజుల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. తాజాగా ఆమె తీసుకున్న చికిత్స విజయవంతమైంది. దీంతో ఆమె మళ్లీ ఎప్పటిలా మాట్లాడగలుగుతోంది.

తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించింది నటి శ్రీవాణి. గత నెలలో ఆమె అరుదైన వ్యాధి బారిన పడింది. దీని కారణంగా ఆమె గొంతు తాత్కాలికంగా మూగబోయింది. కొంచెం గట్టిగా మాట్లాడినా ఆమె గొంతు ఎప్పటికీ పోతుందని వైద్యులు హెచ్చరించడంతో నెల రోజుల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. తాజాగా ఆమె తీసుకున్న చికిత్స విజయవంతమైంది.

దీంతో ఆమె మళ్లీ ఎప్పటిలా మాట్లాడగలుగుతోంది. ఈ సంతోషకర విషయాన్ని తెలియజేస్తూ ఆమె యూట్యూబ్‌లో వీడియో వదిలింది. డాక్టర్‌ సూచన మేరకు జూలై 19 నుంచి ఆగస్టు 19 వరకు అస్సలు మాట్లాడలేదు. కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే మాట్లాడేశా. ఈ సమయంలో నాకోసం ఎంతోమంది ప్రార్థించారు. వారందరికీ చాలా థ్యాంక్స్‌ అని చెప్పుకొచ్చింది.

చదవండి: బెడ్‌రూమ్‌లో దొంగాపోలీసు ఆటలు ఆడలేదా? ఇబ్బంది పడ్డ హీరోయిన్‌
భార్యతో విడాకులు, కూతుర్ని కలవనీయట్లేదు: నటుడు

Advertisement
 
Advertisement
Advertisement