Trisha To Pair Up With Vijay After 14 Years In Lokesh Kanagaraj Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Trisha: విజయ్‌తో త్రిష.. ఐదోసారి జోడీ రిపీట్‌

Aug 8 2022 8:45 AM | Updated on Aug 8 2022 10:55 AM

Trisha To Pair Up With Vijay After 14 Years In Lokesh Kanagaraj Direction - Sakshi

హీరో విజయ్‌తో హీరోయిన్‌ త్రిష మరోసారి జోడీ కట్టనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ‘మాస్టర్‌’ (2021)  తర్వాత విజయ్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుందని టాక్‌. ఆల్రెడీ ఈ చిత్రంలో సమంత ఓ హీరోయిన్‌గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ మూవీలో మరో హీరోయిన్‌ పాత్రలో త్రిష యాక్ట్‌ చేయనున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది.

లోకేష్‌ అండ్‌ టీమ్‌ ఇప్పటికే త్రిషను సంప్రదించారట. కాగా ‘గిల్లి’ (2004), ‘తిరు పాచ్చి’ (2005), ‘ఆతి’(2006), ‘కురివి’(2008) చిత్రాల్లో విజయ్, త్రిష కలిసి నటించారు. తాజా సినివలో మరోసారి వీరిద్దరూ నటిస్తే దాదాపు 14 సంవత్సరాల తర్వాత స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నట్లవుతుంది. మరి.. విజయ్‌తో త్రిష ఐదోసారి జోడీ కడతారా? వే చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement