
‘ఆ ఛాన్స్ నాకు ఎక్కడ దక్కుతుంది?’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన త్రిప్తికి.. కొన్ని రోజుల్లోనే ఆ అవకాశం పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ చుట్టూ తిరిగి చివరకు ఆమెనే వరించింది. దీపికా పదుకొణే ప్లేస్‌ని భర్తీ చేసిన త్రిప్తి తాజా జర్నీ ఆసక్తికరమే కాదు, ఆశ్చర్యకరమైనది కూడా!
టాలీవుడ్‌లోనూ గుర్తింపు
బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రి (Tripti Dimri).. సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమాలో నటించి టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడదే దర్శకుడు ప్రభాస్‌తో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకొని ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. త్రిప్తి.. దీపికా పదుకొణెకు పెద్ద అభిమాని. చిన్నతనంలో ‘చాందినీ చౌక్ టు చైనా’ సినిమాలో దీపికా లుక్ చూసి, అదే స్టయిల్‌లో హెయిర్ కట్ చేసుకుందట!
మందు జోలికి వెళ్లను
మొన్నటి వరకు టీ ఎక్కువగా తాగే త్రిప్తి, ఇప్పుడు కాఫీ మీద మక్కువ పెంచుకుందట. టీ, కాఫీ తప్ప... ఇప్పటివరకు ఎప్పుడూ ఆల్కహాల్ టేస్ట్ చేయలేదని, భవిష్యత్తులో చేయాలనే ఆలోచన కూడా లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇండియన్ సినిమాల్లో న్యూడ్‌గా నటించేందుకు ధైర్యం చేసిన అరుదైన నటీమణుల్లో త్రిప్తి ఒకరు. ‘యానిమల్’లో బోల్డ్ సీన్లు చేసిన తర్వాత స్టార్ అయింది. అయితే ఆ సీన్లు చూసి తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారని ఒప్పుకుంది. అయినా కెరీర్ కోసం ఇలాంటి సాహసాలు అవసరమే అంటోంది.

యానిమల్ మూవీతో దశ తిరిగింది
త్రిప్తి 2017లో ‘పోస్టర్ బాయ్స్’ సినిమాతో రంగ ప్రవేశం చేసింది. ‘లైలా మజ్ను’, ‘బుల్ బుల్’ వంటి చిత్రాల్లో నటించినా పెద్దగా పాపులారిటీ రాలేదు. చిన్నప్పటి నుంచే టాప్ హీరోయిన్ కావాలని కలలు కన్న త్రిప్తి, అవి నెరవేరక మొదట్లో చాలా డిజప్పాయింట్ అయిందట! సరిగ్గా అలాంటి సమయంలో ‘యానిమల్’ ఛాన్స్ రావడంతో వదులుకోలేకపోయింది. ఆ సినిమా ఆమె కెరీర్‌ను ఊహించని ఎత్తులకు చేర్చింది. రష్మిక మందన్నా కన్నా త్రిప్తికి ‘ఛోటా భాభీ’గా ఎక్కువ క్రేజ్ వచ్చింది.
బాలీవుడ్ సినిమాలు
ఆ తర్వాత కూడా బోల్డ్ కథలే త్రిప్తిని వెతుక్కుంటూ వచ్చాయి. ‘బ్యాడ్ న్యూస్’ చిత్రంలో ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్‌లో ఎవరి వల్ల గర్భం దాల్చిందో తెలియని యువతి పాత్రలో నటించింది. అలాగే, ‘విక్కీ విద్యా కా వోహ్ వాలా వీడియో’ అనే సినిమా హాలీవుడ్ సెక్స్ టేప్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది. కొత్తగా పెళ్లైన జంట తమ మొదటి రాత్రిని షూట్ చేయడం, ఆ వీడియో లీక్ కావడం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావుతో కలిసి నటించింది.
విమర్శలు
త్రిప్తి నటనపై, డ్యాన్స్‌పై కొన్ని విమర్శలు వచ్చినా.. గ్లామర్, టాలెంట్, సక్సెస్ వల్ల అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి. ‘యానిమల్’లో న్యూడ్ సీన్ తీసే సమయంలో డైరెక్టర్, హీరో ఎంతో మద్దతు ఇచ్చారని తెలిపింది. ఆ సీన్‌ను చాలా అందంగా చూపించారని, ఏ కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినా షూటింగ్ ఆపేస్తామని మాట ఇచ్చిన తర్వాతే షూట్ చేశారని చెప్పింది త్రిప్తి.
స్పిరిట్‌లో నేనా?
ఒకసారి ఓ జర్నలిస్టు త్రిప్తిని ‘స్పిరిట్ సినిమాలో మీకు ఛాన్స్ వస్తుందా?’ అని అడిగినప్పుడు ‘ఒక్క శాతం కూడా అవకాశం లేదు. అంత పెద్ద ప్రాజెక్ట్‌లోకి ఎలా వస్తాను?’ అని ఆశ్చర్యంగా అంది. పైగా సందీప్ రెడ్డి వంగా తనకే మళ్లీ ఛాన్స్ ఇస్తాడా? అంటూ ఎదురు ప్రశ్నించింది. కానీ, విధి, సినిమా రంగం రెండూ మాయామయం! చివరకు దీపికా పదుకొణె స్థానంలో త్రిప్తి వచ్చి చేరింది.