స్టార్ హీరో సినిమాకు రూ.2200 కోట్ల నష్టం? | Tom Cruise Digger Box Office Report Predicts Massive 2200 Crore Losses After Poor Opening Collection, Check Details | Sakshi
Sakshi News home page

Digger Movie Tom Cruise: వేల కోట్ల నష్టం.. ఇంతకీ ఏంటా మూవీ?

Oct 9 2026 9:57 AM | Updated on Oct 9 2026 10:25 AM

Tom Cruise Digger Movie Collection And Loss

హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ పేరు చెప్పగానే సినిమాల కోసం ఇతడు చేసే కళ్లు చెదిరే సాహసాలే గుర్తొస్తాయి. యాక్షన్ అడ్వెంచర్ చిత్రాలతో తనదైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఇతడు.. వారం పదిరోజుల క్రితం 'డిగ్గర్' అనే ప్రయోగాత్మక మూవీ చేశాడు. ఇదేమో బాక్సాఫీస్ దగ్గర ఘోరాతి ఘోరమైన ఫ్లాప్ అయింది. దీంతో వేల కోట్ల రూపాయల నష్టం అని నివేదికలు తేలుస్తున్నాయి. ఇంతకీ ఈ సినిమా సంగతేంటంటే?

టామ్ క్రూజ్ లేటెస్ట్ మూవీ ‘డిగ్గర్’. ఎకో సెటైర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత అలెజాండ్రో ఇనారిట్టు దర్శకుడు కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దానికి తోడు వార్నర్ బ్రదర్స్ నిర్మాణ సంస్థ.. 125 నుండి 150 మిలియన్ డాలర్ల బడ్జెట్ పెట్టడంతో పాటు మరో 100 మిలియన్ డాలర్ల మార్కెటింగ్ ఖర్చు కోసం కేటాయించింది. కానీ రియాలిటీలో స్టూడియో చరిత్రలోనే భారీ నష్టం మూటగట్టుకున్న చిత్రంగా ఇది నిలవబోతోంది.

ప్రపంచవ్యాప్తంగా కేవలం 20 మిలియన్ డాలర్ల ఓపెనింగ్‌తో సరిపెట్టుకున్న ఈ సినిమా.. స్టూడియోకు ఏకంగా 250 మిలియన్ డాలర్ల (రూ.2200 కోట్లు) మేర నష్టాన్ని మిగుల్చుతుందని డెడ్‌లైన్ నివేదిక అంచనా వేసింది. టామ్ క్రూజ్ కెరీర్‌లోనే గత రెండు దశాబ్దాల్లో అత్యంత తక్కువ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా 'డిగ్గర్' నిలిచింది.

'డిగ్గర్' విషయానికొస్తే.. డిగ్గర్ రాక్‌వెల్ అనే పిచ్చివాడైన బిలియనీర్, ఓ ఆయిల్ టైకూన్. గ్రీన్‌ల్యాండ్‌లో అత‌డు చేసిన ప్రమాదకరమైన డ్రిల్లింగ్ ఆపరేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ విపత్తు సంభవిస్తుంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి అత‌డు ఏమేం చేశాడు? ఈ ప్రయత్నాల్లో ఏం జరిగిందనేది మిగతా స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement