‘సంక్రాంతి శుభాకాంక్షలు.. జాగ్రత్తగా ఉండండి’

Tollywood Stars Wishes To Fans On Sankranti Festival - Sakshi

అభిమానులకు టాలీవుడ్‌ స్టార్స్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే ప్రతి పల్లెల్లో భోగి మంటలతో  సంబరాల సందడి నెలకొంది. చిన్న పెద్దలంతా ఒక్కచోట చేరి సరదాలతో సమయం గడుపతున్నారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల దీవెనలు, జంగమదేవరల జేగంటలు, ఢమరుక నాదాలూ.. పిట్టలదొరల బడాయి మాటలతో మార్మోగుతున్నాయి. ఇదిలా ఉండగా గురువారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని టాలీవుడ్‌ స్టార్స్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో చిరంజీవి, మహేష్‌బాబు, సమంత, జూనియర్‌ ఎన్టీఆర్,రకుల్‌ ప్రీత్‌సింగ్‌‌ వంటి వారు తమ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాక కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చదవండి: సంక్రాంతి సంబరాలతో పల్లెసీమలు

‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యపీ సంక్రాంతి’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. అదే విధంగా ‘మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు’ అని మహేష్‌ ట్వీటర్‌లో తెలిపారు. అలాగే దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ భాషల్లో ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వరుస ట్వీట్లు చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top