ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా? | Sakshi
Sakshi News home page

SIT Movie: ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Tue, May 28 2024 8:04 PM

Tollywood Movie SIT Gets Huge Response In Ott Director Emotional

అరవింద్ కృష్ణ, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా తాజా చిత్రం సిట్‌(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ చిత్రాన్ని విజయ భాస్కర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని నాగి రెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 10 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంటోంది. తమ చిత్రానికి మంచి ఆదరణ వస్తుండటంతో దర్శకుడు విజయ భాస్కర్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

విజయ భాస్కర్ రెడ్డి.. 'కడప జిల్లాలోనే పుట్టి పెరిగా. అక్కడే విద్యాభ్యాసం జరిగింది. మాది ఉమ్మడి కుటుంబం. రైతుల కష్టం నాకు తెలుసు. మా నాన్న పడ్డ కష్టాలు మేం పడకూడదని ఉన్నత చదువులు చదివించారు. నా డిగ్రీ తరువాత హైద్రాబాద్‌కు వచ్చా. సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీఏ చేశాను. ఆ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చాను. అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా చేసి సిట్‌ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నా. సినిమాల్లోకి రావడం నా ఫ్యామిలీకి ఇష్టం లేదు. కానీ మా పెద్దన్న నాకు అండగా నిలిచారు. ఆయన వల్లే పదిహేనేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.' అని అన్నారు.

అనంతరం మాట్లాడుతూ.. 'నా డిగ్రీ ఫ్రెండ్స్ ఫండింగ్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ కథను వెబ్ సిరీస్ కంటే సినిమా తీస్తేనే బాగుంటుందని అన్నారు. నాగి రెడ్డి, బాల్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్ కలిసి ఈ మూవీని ఇక్కడి వరకు తీసుకొచ్చారు.ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ అద్భుతంగా నటించారు. ఆయన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. నటాషా చక్కగా నటించారు. అందరి సహకారంతోనే ఈ మూవీని బాగా తీయగలిగా. ఓటీటీ కంటెంట్ కాబట్టి.. ముందు నుంచి కూడా మేం ఓటీటీ కోసమే ప్రయత్నాలు చేశాం.సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండో పార్ట్, మూడో పార్ట్ ఎప్పుడు? అని అంతా అడుగుతున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రీచ్ అయిందని తెలుస్తోంది.  ప్రస్తుతం మా చిత్రం టాప్ 5లో ట్రెండ్ అవుతోంది. చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement