మా లైఫ్‌లో ఎప్పుడు సర్‌ప్రైజ్‌లే: టాలీవుడ్ హీరోయిన్ | Tollywood Heroine Nidhhi Agerwal Shares A Post | Sakshi
Sakshi News home page

Nidhhi Agerwal: ఓకే రోజు రెండు రాష్ట్రాల్లో జరగడం సంతోషం: నిధి అగర్వాల్

Oct 17 2024 3:41 PM | Updated on Oct 17 2024 5:26 PM

Tollywood Heroine Nidhhi Agerwal Shares A Post

హీరోయిన్ నిధి అగర్వాల్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌ రెండు చిత్రాల్లో నటిస్తోంది. ప్రభాస్-మారుతి కాంబోలో వస్తోన్న ది రాజాసాబ్, పవన్ కల్యాణ్ హరిహరవీరమల్లు సినిమాల్లో కనిపించనుంది. షూటింగ్‌లతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

నిధి అగర్వాల్ తన ట్వీట్‌లో రాస్తూ..'ఆర్టిస్టుల పూర్తిగా సర్‌ప్రైజ్‌లతో నిండి ఉంటుందని.. కానీ వాటిలో కొన్ని గొప్ప అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే రోజు రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటించడం ఆనందంగా ఉంది. అంతేకాదు ఒకటి ఆంధ్రలో షూటింగ్ జరిగితే మరొకటి తెలంగాణ. ఒక్కరోజులో రెండు సినిమాలు.. రెండు రాష్ట్రాలు. నా పనిని మీ ముందుక తీసుకొచ్చేందుకు ఎదురుచూస్తున్నా. ఆ తర్వాత గొప్ప వేడుక చేసుకుంటానని' పోస్ట్ చేసింది.

కాగా.. మారుతి డైరెక్షన్‌ వస్తోన్న ది రాజాసాబ్‌ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈనెల 23న ప్రభాస్ బర్త్ డే రోజు అప్‌డేట్స్ ఉంటాయని నిర్మాత ఎస్‌కేఎన్‌ ఇప్పటికే కామెంట్స్ చేశారు.  హారర్‌ రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement