
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సినిమాలపై వందశాతం సుంకం విధించడంపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ట్రంప్ సుంకాలు అమలు చేయడం సాధ్యం కాదని ట్వీట్ చేశారు. బెర్మన్ సవరణ చట్టం ప్రకారం సినిమాలపై దిగుమతి సుంకాలను పూర్తిగా అడ్డుకుంటుందని నిఖిల్ రాసుకొచ్చారు. ఈనెల 29న ఇచ్చిన ట్రంప్ ఆదేశాలపై చట్టపరమైన అడ్డంకులు ఎదుర్కొవాల్సిందేనని అన్నారు. అంతేకాకుండా సినిమాలపై వందశాతం సుంకం అమలు సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా.. టాలీవుడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ, ది ఇండియన్ హౌస్ చిత్రాల్లో నటిస్తున్నారు.
విదేశీ సినిమాలపై ట్రంప్ టారిఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సినిమాలు వందశాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంది.
విదేశీ సినిమాలపై 100శాతం విధిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో ‘మా సినిమా నిర్మాణ వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది చిన్నపిల్లవాడి నుండి మిఠాయి దొంగిలించినట్లే. బలహీనమైన, అసమర్థ గవర్నర్‌తో కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతింది. ఈ దీర్ఘకాలిక, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను’అని పేర్కొన్నారు.
No . Trump Tariffs on Films will Not be Implemented.
Since The Berman Amendment (50 U.S.C. §1702(b)(3)) explicitly Stops presidential restrictions/Tariffs under IEEPA on imported informational materials like films, as confirmed by congressional records. Combined with First… https://t.co/0d7qvItrr2— Nikhil Siddhartha (@actor_Nikhil) September 30, 2025