
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. అయితే ప్రస్తుతం మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పని చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ఇప్పటికే కథను సిద్ధం చేశారు. ఈ ఏడాదిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫుల్‌గా చిల్ అవుతున్నారు. కాస్తా ఖాళీ సమయం దొరికితే చాలు ఠక్కున విదేశాల్లో వాలిపోతుంటారు. తాజాగా ప్రిన్స్ తన ఫ్యామిలీతో కలిసి వేకేషన్‌కు వెళ్లారు. ఇటీవలే కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిన మహేశ్ బాబు తాజాగా ఇండియాకు తిరిగొచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సితార, గౌతమ్, తన భార్యతో కలిసి కనిపించారు. విమానాశ్రయం నుంచి బయటికొస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
#TFNExclusive: Superstar @urstrulyMahesh and his family have arrived in Hyderabad after their vacation!📸#MaheshBabu #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/smdCatOYlb
— Telugu FilmNagar (@telugufilmnagar) July 7, 2024