హైదరాబాద్‌కు తిరిగొచ్చిన మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్ | Mahesh Babu family clicked at Hyderabad airport return from London | Sakshi
Sakshi News home page

Mahesh Babu: హైదరాబాద్‌కు తిరిగొచ్చిన మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్

Jan 7 2023 1:54 PM | Updated on Jan 7 2023 1:56 PM

Mahesh Babu family clicked at Hyderabad airport  return from London - Sakshi

టాలీవుడ్‌ ప్రిన్స్ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యూ ఇయర్‌కు ముందు ఫ్యామిలీతో కలిసి వ్యాకేషన్‌కు వెళ్లారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉన్నారు. వ్యాకేషన్ పూర్తి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ శనివారం హైదరాబాద్‌కు తిరిగొచ్చింది. మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితార, కుమారుడు గౌతమ్‌తో కలిసి లండన్‌ నుంచి నగరానికి తిరిగి వస్తుండగా ఎయిర్‌పోర్టులో కెమెరాలకు చిక్కారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. 

మహేష్ బాబు తన కుటుంబం, స్నేహితులతో కలిసి స్విట్జర్లాండ్‌లో వేడుకలు జరుపుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. మహేష్ ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్‌తో కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలో నటి పూజా హెగ్డే నటిస్తోంది. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళితో కలిసి మరో చిత్రంలో కనిపించనున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement