Mahesh Babu Family Fly To Vacation Video Goes Viral in Airport - Sakshi
Sakshi News home page

Mahesh Babu: వేకేషన్‌ బయల్దేరిన ప్రిన్స్ ఫ్యామిలీ.. వీడియో వైరల్!

Jul 22 2023 7:36 PM | Updated on Jul 22 2023 8:35 PM

Mahesh Babu Family Fly To Vacation Video Goes Viral in Airport - Sakshi

టాలీవుడ్ ప్రిన్స్‌ మహేశ్‌బాబు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. అయితే మొదట ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హేగ్డేను ఎంపిక చేయగా.. ఆ తర్వాత ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. పూజా స్థానంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీలను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే హీరో.. కాస్త విరామం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతుంటారు.

(ఇది చదవండి: జ్యువెల్లరీ యాడ్‌లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

అయితే ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్‌కు కాస్త విరామం లభించడంతో వేకేషన్‌ ప్లాన్ చేశాడు ప్రిన్స్ మహేశ్ బాబు. తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు పయనమయ్యారు. మహేశ్ బాబు సతీమణి, పిల్లలు సితార, గౌతమ్‌ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

 కాగా.. జూలై 20న సితార బర్త్‌డేను జరుపుకున్న సంగతి తెలిసిందే. సితార పుట్టినరోజు వేడుకను మహేష్ బాబు ఫౌండేషన్‌లోని యువతులతో కలిసి ఇంట్లోనే చాలా సింపుల్‌గా జరుపుకున్నారు. కాగా.. ఇటీవలే  సితార మొదటి జ్యూవెల్లరీ యాడ్ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ యాడ్‌ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సితారకు యాడ్‌ కోసం ఏకంగా రూ.కోటి ఇచ్చినట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: బేబీ బంప్‌ వీడియో షేర్ చేసిన నటి..సోషల్ మీడియాలో వైరల్!)

Advertisement
 
Advertisement
Advertisement